దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న కారు.. షోరూమ్‌కు క్యూ కట్టిన జనాలు.. ఇండియా నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్
భారతీయ కార్ల తయారీలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) చాలా కాలంగా నెం.1 స్థానంలో ఉంటుంది. దశబ్దాల నుంచి దేశంలో బడ్జెట్ ధరలో హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని SUV ఇతర సెగ్మెంటల కార్లను విక్రయిస్తుంది. కంపెనీ ప్రతిఏడాది కూడా అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎక్కువ అవుతున్న కొద్ది మారుతీ సైతం తన దూకుడును ప్రదర్శిస్తూ, మరింత మంది వినియోగాదారులకు చేరువ అవుతుంది. ప్రతినెల ముగిసిన తరువాత కార్ల తయారీదారులు తమ సేల్స్ వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి ముగిసిన నేపథ్యంలో వరుసగా కంపెనీలు ఈ నెలలో నమోదు చేసిన అమ్మకాలను విడుదల చేస్తున్నారు. డేటా ప్రకారం గత నెలలో మారుతీ సుజుకీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించి ఫిబ్రవరిలో అగ్రస్థానం పొందింది.
ఈ నెలలో దీంతో పాటు ఇతర కంపెనీలు కూడా మెరుగైన సేల్స్ సాధించాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ తయారీదారులు కూడా మెరుగైన సేల్స్ నమోదు చేశాయి. గత నెలలో దేశంలో మొత్తంగా అమ్ముడైన టాప్ 10 కార్లను మోడళ్ల వారిగా తెలుసుకుందాం. కంపెనీలు విడుదల చేసిన మొత్తం డేటా ప్రకారం, ఇండియాలో ఫిబ్రవరి 2025లో అత్యధికంగా సేల్స్ సాధించిన జాబితాలో మారుతీ సుజుకీ టాప్ ప్లేస్‌లో ఉంది.

ఈ నెలలో దేశంలో అమ్ముడపోయిన టాప్ 10 కార్లలో ఏడు మారుతీకి చెందినవే ఉన్నాయి. తరువాత టాటా మోటార్స్ రెండు కార్లు, హ్యుందాయ్ ఒక మోడల్లి లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 2025లో మారుతీ ఫ్రాంక్స్(Fronx) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ కారును 21,461 మంది కొనుగోలు చేశారు. జనవరి 2025లో ఇది 15,192 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.
నెలవారీగా అమ్మకాలను చూసినట్లయితే ఇది భారీ పెరుగుదల. ఇక రెండో స్థానంలో మొత్తం 19,879 అమ్మకాలతో వ్యాగన్ఆర్ (Wagon R) నిలిచింది. జనవరి నెలలో సేల్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన వ్యాగన్ఆర్ ఫిబ్రవరిలో మాత్రం సెకండ్ ప్లేస్‌కు పడిపోయింది. తరువాత మూడో స్థానంలో మిడ్ సైజ్ SUV విభాగంలో ప్రిసద్ద మోడల్ హ్యుందాయ్ క్రెటా(Creta) ఉంది. ఫిబ్రవరి 2025లో 16,317 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడుపోయాయి.

ఇక నాల్గవ స్థానంలో మారుతీకి చెందిన ప్రసిద్ధ మోడల్ స్విఫ్ట్ (Swift) ఉంది. ఫిబ్రవరి 2025లో ఈ కారు 16,269 మంది కొత్త కస్టమర్లను సంపాదించుకోవడం విశేషం. ఐదవ స్థానంలో మారుతీ ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (baleno) 15,480 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తరువాత 15,392 యూనిట్ల సేల్స్‌తో మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా (Brezza) ఆరవ స్థానంలో నిలిచింది.
ఏడవ స్థానం విషయానికి వస్తే, భారతీయ దిగ్గజ కార్ల తయారీదారు అయిన టాటా మోటార్స్‌కు చెందిన ప్రసిద్ధ మోడల్ నెక్సాన్ (Nexon) 15,349 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ లిస్ట్‌లో మారుతీ ఎర్టిగా (Maruti Ertiga) 14,868 యూనిట్ల సేల్స్‌ను సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. తొమ్మిదవ స్థానంలో మారుతీ సుజుకీ డిజైర్ 14,694 సేల్స్‌తో నిలవగా, చివరగా టాటా పంచ్ 14,559 యూనిట్లతో పదో స్థానం పొందింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








