దేశంలో అందరికి బాగా ఇష్టమైన టాప్ 5 ఎస్‌యూవీలు.. బడ్జెట్ ధరలో హాట్ సెల్లింగ్ కార్లు.. అవెంటో ఓ లుక్కేయండి!
ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన కార్ల సేల్స్‌ను గమనించినట్లయితే ఎస్‌యూవీ (SUV) మోడళ్లను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకప్పుడు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు రాజ్యమేలితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కస్టమర్లు పెద్దఎత్తున ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కార్ల తయారీదారులు కూడా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా suv మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఇండియాలో దిగ్గజ కార్ల తయారీదారుల టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కంపెనీల నుంచి ప్రస్తుతం మార్కెట్లోకి ఆకట్టుకునే కార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ లవర్స్ కోసం గత నెలలో ఇండియాలో అత్యధిక కస్టమర్లను ఆకర్షించిన టాప్ 5 అత్యంత ప్రజాదరణ పొందిన SUV ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను తెలుసుకోండి.
Hyundai Creta: SUVల పోటీలో హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా ఉంది. ఎన్నో కార్లు మార్కెట్లో ఉన్నా, క్రెటాకి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అందరికీ సరిపోయే విధంగా స్టైల్, స్పేస్ లేటెస్ట్ ఫీచర్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇటీవలి ఫేస్‌లిఫ్ట్‌తో క్రెటా మరింత ఆకర్షణీయంగా మారింది. శక్తివంతమైన బాడీ లైన్లు, కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, టెయిల్ ల్యాంప్స్ కారుని పాత మోడల్ కంటే కొత్తగా అనిపిస్తుంది.

ఇది పెట్రోల్, డీజిల్, ఇంకా ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం కారణంగా కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్ 1.5 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ లభిస్తే, మరోటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇంకా, మైలేజీ కోరుకునే వారికి డీజిల్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. ఇది 17.4 నుండి 21.8 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఇది 5 సీటర్ కారు.
వీటి ప్రారంభ ధరలు రూ.11 లక్షల నుండి రూ. 20.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 17.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 24.38 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్). రెండు బ్యాటరీ ప్యాక్‌లు 42 kWh,51.4 kWh ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, ఈ క్రెటా 390 నుంచి 473 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

Maruti Suzuki Grand Vitara: మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాను టయోటాతో కలిసి అభివృద్ధి చేశారు. ఇది తేలికపాటి suv. ప్రస్తుతం 2025 గ్రాండ్ విటారా మోడల్, మరింత సరికొత్త అప్‌డేట్‌లతో, లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన పనితీరు, ఇంకా బలమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. టయోటాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడల్, మార్కెట్లోకి వచ్చిన తొలి రోజునుంచి మంచి స్పందన పొందుతోంది. ఇది 5 సీటర్ కారు.
ఇతర SUVలకంటే భిన్నంగా, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ కూడా ఇందులో ఉంది. ఇది SUV లుక్ కంటే రఫ్-అండ్-టఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రత్యేకంగా తయారైంది. ఈ కారు ప్రధానంగా 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 1.5 లీటర్ CNG వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

దీని ప్రారంభ ధర విషయానికి వస్తే, 11.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇటీవల కంపెనీ కొత్త డెల్టా+ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది మధ్యస్థ స్థాయిలో ఫీచర్స్, పనితీరును కలిగి ఉండి, ధర పరంగా కూడా కొత్త వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్, హైబ్రిడ్ ఏ ఫ్యూయల్ టైప్ కావాలన్నా, ఈ SUV అందుబాటులో ఉంది.
Kia Seltos: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా నుంచి వచ్చిన ఎస్‌యూవీ మోడల్ సెల్టోస్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇధి మొదటి నుంచే ఇది యువతలో, ఫ్యామిలీలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు విడుదలైన 2025 మోడల్ కూడా అదే స్టాండర్డ్‌ను మెరుగుపరుస్తూ, మరింత అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తోంది.

దీని ఎంట్రీ లెవెల్ వేరియంట్ ధర రూ. 11.13 లక్షల (ఎక్స్ షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. వీటిలో X-Line టాప్-ఎండ్ వెర్షన్, ప్రత్యేకంగా స్టైలింగ్, లగ్జరీ కోరే వారి కోసం డిజైన్ చేయబడింది. దాని ధర రూ. 20.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుంది. ఇందులో మొత్తం 8 కొత్త వేరియంట్‌లు యాడ్ చేశారు. కొత్త స్మార్ట్‌స్ట్రీమ్ G1.5 పెట్రోల్, D1.5 CRDi VGT డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఆకట్టుకుంటున్నాయి.
కియా సెల్టోస్ ఎస్‌యూవీ మైలేజీ విషయంలో కూడా బాగానే ఇస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీని తక్కువ మైంటెనెన్స్‌తో కలిపి చాలా మంది వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS),డ్యూయల్-డిస్‌ప్లే లే అవుట్, కంఫర్టబుల్ సీట్లు, ఇంకా పలు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ వంటివి దీనిలో ఉన్నాయి.
Tata Curvv: టాటా మోటార్స్‌కు చెందిన ప్రసిద్ధ మోడల్ కర్వ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ నెక్సాన్ కంటే కూడా వేగంగా మార్కెట్లో బాగా క్లిక్ అయింది. దీని SUV-కూపే డిజైన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. దీని ప్రారంభ ధర విషయానికి వస్తే, రూ.10 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.19.20 లక్షల వరకు కొనుగోలుకు లభిస్తుంది.
టాటా కర్వ్ SUV 1.2-లీటర్ TGDI టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ల ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్/7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. అదే ఈవీ వేరియంట్ 55 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటారు 167 PS పవర్, 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తిగా ఛార్జ్‌తో 502 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
Mahindra Thar: మహీంద్రా థార్ ఇండియాలో ఆఫ్‌రోడ్ కింగ్‌గా పేరుగాంచింది. ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీ 4X4 ఆప్షన్‌లో లభిస్తుంది. మార్కెట్లో బాగా ప్రజధారణ పొందిన కార్లలో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో వినియోగదారులను ఆకట్టుకంటుంది. దీని ఆకట్టుకునే డిజైన్, బలమైన బాడీ బిల్డప్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరును ఇది కనబరుస్తుంది.


Click it and Unblock the Notifications








