రూ.6 లక్షల్లో 32 కి.మీల మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఫ్యామిలీ కార్స్! పెట్టిన ప్రతి రూపాయికి లాభం పక్కా!

పండుగల సమయంలో చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఈ సారి పండుగలు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం GST రేట్లను సవరించగా, అది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో వాహన తయారీదారులు తమ కార్ల ధరలను భారీగా తగ్గించారు. ఈ నేపథ్యంలో కొత్తగా తక్కువ ధరలో తమకు నచ్చిన కారును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడానికి జనాలు ఈ మధ్య రోజుల్లో షోరూమ్‌లకు ఎగబడుతున్నారు. కస్టమర్లు మంచి మైలేజ్, పనితీరు, తక్కువ ధర, ఫీచర్స్ అందించే వాటిని ఎక్కువగా సొంత చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మారుతి సుజుకి కంపెనీకి చెందిన మంచి మైలేజ్, పెర్ఫామెన్స్, తక్కువ ధరలో లభించే కార్ల గురించి ఈ కథణంలో మీ కోసం ఇస్తున్నాము.

Maruti Suzuki Celerio: సెలెరియో తక్కువ ధరలో అత్యంత ఉపయోగకరమైన హ్యాచ్‌బ్యాక్‌. రూ. 4.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే కారు 1.0-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. నగర డ్రైవింగ్‌లో లీటరుకు 18.42 కిలోమీటర్లు, హైవేపై 23.18 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. CNG వేరియంట్లు 34Km మైలేజీని అందిస్తాయి. 313 లీటర్ల విస్తృతమైన బూట్ స్పేస్ ఈ కారు ప్రత్యేకత. ఫ్యామిలీ ట్రిప్స్, రోజువారీ ప్రయాణాలకు ఇది బెస్ట్.

India Top Mileage Family Cars Maruti Suzuki Celerio Dzire Wagonr Alto k10

Maruti Suzuki Dzire: మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ రూపకల్పనలోనే లగ్జరీ, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ధర రూ.6.26 లక్షల నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్). పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.77 కి.మీ, Cng 33.65 కిమీ మైలేజీని ఇస్తుంది. కొత్త తరం డిజైర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అదేవిధంగా, ఇది BNCAP, GNCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ భద్రత రేటింగ్‌ను సాధించి తన సేఫ్టీ ప్రమాణాలను నిరూపించింది.

Maruti Suzuki WagonR: మారుతి వ్యాగన్‌ఆర్ భారతీయ కుటుంబాల ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్‌గా దశాబ్దాలుగా నిలిచింది. విస్తృతమైన ఇంటీరియర్, హై రూఫ్ డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్ వలన ఇది ప్రతి తరానికి సరిపోతుంది. రూ.4.99 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ కారు 1.2-లీటర్ AMT పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. నగర డ్రైవింగ్‌లో లీటరుకు 19.31 kmpl, హైవేపై 22.34 kmpl మైలేజీని, Cng లో 34.05 కి.మీల వరకు ఇస్తోంది.

India Top Mileage Family Cars Maruti Suzuki Celerio Dzire Wagonr Alto k10

Maruti Suzuki Alto k10: మారుతి ఆల్టో కె10 గురించి మాట్లాడితే, ఇది తక్కువ ధరలో లభించే అత్యంత ఆదరణ పొందిన ఎంట్రీ లెవల్ కారు. రూ.3.70 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉన్న కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 24.9 కి.మీ మైలేజీని అందించే ఈ కారు చిన్న కుటుంబాలకు సరైన ఎంపిక. దీని Cng మోడల్ దాదాపు 33.85 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది.

పైన పేర్కొన్న కార్లు అన్నీ దాదాపు రూ.6 లక్షల పరిధిలోనే లభ్యమవుతున్నాయి. కొన్ని మోడళ్లు అయితే రూ.5 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే కార్లుగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా మారుతి సుజుకి కంపెనీ ఎప్పటినుంచీ భారతీయ కుటుంబాల అవసరాలను అర్థం చేసుకుని, వారి ఆర్థిక స్థితికి సరిపోయే మోడళ్లను అందిస్తోంది.

India Top Mileage Family Cars Maruti Suzuki Celerio Dzire Wagonr Alto k10

పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బ్రాండ్‌గా మారుతి పేరు నిలిచింది. మారుతి కార్లు ధర తక్కువగా - విలువ ఎక్కువగా అనే మాటకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే, కొత్తగా కారు కొనాలనుకునే వారు లేదా తమ కుటుంబ అవసరాలకు సరిపోయే బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాన్ని వెతుకుతున్నవారికి మారుతి సుజుకి సెలెరియో, డిజైర్, వ్యాగన్ ఆర్, ఆల్టో కె10 వంటి కార్లు బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 14, 2025, 9:11 [IST]
English summary
India top mileage family cars maruti suzuki celerio dzire wagonr alto k10 details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+