ఇండియాలో అత్యంత సేఫ్టీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. భయపడాల్సిన పనిలేదు.. ధైర్యంగా కుటుంబంతో కలిసి వెళ్లచ్చు
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ ఏ మేరకు ఉందో ఇటీల కాలంలో జరుగుతున్న సేల్స్‌ను చూస్తేనే తెలిసిపోతుంది. ఒకప్పుడు బ్యాటరీలు పేలిపోతాయని, ఎక్కువ దూరం ప్రయాణించవని, రోజంతా ఛార్జింగ్ పెట్టాలని వంటి కారణాల వల్ల ఎవరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవు. ప్రజలు ఇప్పుడు మార్కెట్లోకి ఏ కొత్త ఈవీ విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం నాణ్యత కలిగిన బ్యాటరీలతో, సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉండటం వలన చాలా మంది వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ప్రస్తుతం క్రమంగా ఛార్జింగ్ సమస్య కూడా సర్దుకుంటుంది.
ముఖ్యంగా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయి. CNG వాహనాలు ఉన్నప్పటికి కూడా వీటికి అంతంత మాత్రంగానే ఆదరణ ఉంది. ఇలాంటి సమయంలో వాహనాలను కొనుగోలు చేయాలనుకును వారికి ఎలక్ట్రిక్ వాహనాలు మంచి అవకాశంగా ఉన్నాయి. దీంతో దేశంలో వీటి అమ్మకాలు భారీగా నమొదవుతున్నాయి. భారతీయ వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తయారీదారులు కూడా వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు.

దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా బాగా పేరున్న ఈవీ తయారీదారులంతా కూడా భారత్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కీలక నగరాలకు దగ్గరగా తయారీ ప్లాంట్‌లను సైతం ఏర్పాటు చేసి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కిడి ప్రజలకు విక్రయిస్తూనే అదే సమయంలో తమకు మంచి మార్కెట్ కలిగిన ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దీంతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
దేశీయంగా చాలా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికి వినియోగాదారులు ఎక్కువగా మంచి సేఫ్టీ అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. అలాంటివి ప్రస్తుతం మార్కెట్లో చాలానే ఉన్నాయి. BNCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) కింది నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మంచి పెర్ఫామెన్స్ అందించే వాటిని రేటింగ్ ఆధారంగా కొంటున్నారు. కారు కొనే ముందు ఈ రేటింగ్‌ను చూసిన తరువాతే కస్టమర్లు ఒక అభిప్రాయానికి వస్తున్నారు.

మీరు కూడా BNCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) కింద మంచి రేటింగ్ సాధించిన సురక్షితమైన, నమ్మకమైన ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా? అయితే అలాంటి కార్లలో కొన్నింటిని మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారిని కాపాడటంలో మెరుగైన సేఫ్టీని అందిస్తాయి. మరి ఆ కార్లు ఎంటో ఒకసారి చూడండి.
Tata Nexon Ev: టాటా మోటార్స్ తన నెక్సాన్ EV మోడల్‌ను మరింత శక్తివంతంగా మార్చింది. భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ SUV, భద్రతా ప్రమాణాల్లో అత్యుత్తమంగా నిలిచింది. ఇది పెద్దల రక్షణకు సంబంధించి నిర్వహించిన టెస్ట్‌లో 32కి 30.81 పాయింట్లు సాధించింది. అలాగే. పిల్లల రక్షణలో 49కి 44.83 పాయింట్లు సాధించి అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో స్థానం పొందింది.

టాటా నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి రూ.17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుంది. ప్రయాణికుల రక్షణ కోసం ఇది ఆరు ఎయిర్‌బ్యాగులతో లభిస్తుంది. ఇంకా హైడ్రాలిక్ బ్రేక్ ఫేడింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పానిక్ బ్రేక్ అలర్ట్, ఆఫ్టర్-ఇంపాక్ట్ బ్రేకింగ్, బ్రేక్ డిస్క్ వైపింగ్ , సెకండరీ కొలిషన్ మిటిగేషన్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది.
Tata Punch EV: టాటా మోటార్స్ అందించే అత్యుత్తమ సురక్షితమైన కార్లలో పంచ్ ఈవీ కూడా ఒకటి. ఇది భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి అందరని ఆశ్చర్యానికి గురిచేసింది. భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కారుగా పంచ్‌ను పేర్కొంటున్నారు. టెస్ట్‌లో ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV పిల్లల రక్షణకు సంబంధించి 49 పాయింట్లకు 45 పాయింట్లను సాధించడం విశేషం.
అదే పెద్దల రక్షణకు సంబంధించి 32 పాయింట్లకు 31.46 పాయింట్లను నమోదు చేసి భద్రత పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ.. 9.99 లక్షల నుండి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.14.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. సేఫ్టీ కోసం ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగులు, ESP,హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS వంటి మొదలగు అంశాలను కలిగి ఉంది.
mahindra XUV400: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ400 భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది పెద్దల రక్షణకు సంబంధించి 32 పాయింట్లకు 30.38 పాయింట్లను నమోదు చేసి భద్రత పరంగా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, పిల్లల రక్షణకు సంబంధించి 49 పాయింట్లకు 43 పాయింట్లను సాధించింది. ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమమైన సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది.
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం దీని ధర రూ. 15.49 లక్షల నుండి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 19.39 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ప్రమాద సమయంలో ఈ ఎలక్ట్రిక్ మెరుగైన రక్షణ అందిస్తుంది. లోపల 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. అలాగే, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), వెనుక పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి అంశాలు ఉన్నాయి.
mahindra BE 6: మహీంద్రా తన BE 6 ఎలక్ట్రిక్ SUV తో సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. కొద్ది నెలల క్రితం మార్కెట్లోకి ఘనంగా విడులదలైన ఈ కారు BNCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) కింది నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సంచలనం క్రియేట్ చేసింది. టెస్ట్‌లో పెద్దల రక్షణకు సంబంధించి 32 పాయింట్లకు 31.97 పాయింట్లను నమోదు చేసింది.
అలాగే పిల్లల రక్షణకు సంబంధించి 49 పాయింట్లకు 45 పాయింట్లను సాధించడం విశేషం. దేశీయంగా దీని ధర రూ.18.9 లక్షల నుండి ప్రారంభమై రూ.26.90 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు, వల్-2 ADAS, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ కారుతో పాటు మహీంద్రా XEV 9E కూడా భారత్ NCAP టెస్ట్‌లో మంచి పెర్ఫామెన్స్ అందించింది.


Click it and Unblock the Notifications








