జనాలు ఇష్టపడని కారును కావాలంటున్న భారత సైన్యం.. ప్రజలు ఒప్పుకోలేని మోడల్‌ను సైన్యం ఎందుకు ఎంచుకుంది?
భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ SUVల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ నిరంతరం తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుండగా, మరిన్ని బ్రాండ్‌లు తమ హవా చూపించేందుకు చాలా కాలంగా పోటీ పడుతున్నాయి. థార్‌కు పోటీగా మారుతీ సుజుకీ 2023లో జిమ్నీని విడుదల చేసింది. అయితే జిమ్నీ కారు మార్కెట్లోకి రాకముందే థార్‌కు పోటీగా ఒక శక్తివవంతమైన ఆఫ్‌రోడర్ ఉంది. అదే ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ ఫోర్స్ మోటార్స్ నుంచి వచ్చిన గూర్ఖా వాహనం. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, పవర్‌ఫుల్ ఇంజిన్, కఠినమైన వాతావరణ పరిస్ధితులను తట్టుకునే బలమైన బాడీతో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎప్పటి నుంచో థార్‌కి పోటీ ఇస్తోంది.
ఫోర్స్ గూర్ఖా, గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. అయితే దీని ధర ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది వెనుకడుగు వేసే వారు. ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు అద్భుతమైన అనుభూతి కలిగించడంలో థార్‌కు ఇది ఏమాత్రం తీసిపోదు. ఇటీవల భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆఫ్-రోడ్ SUVలలో ఒకటైన ఫోర్స్ గూర్ఖా కు కేంద్ర ప్రభుత్వం భారీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోర్స్ గూర్ఖా వాహనాలను భారత భద్రతా దళాలలో చేర్చుకోవాలని నిర్ణయించింది.

గూర్ఖా బలమైన పనితీరు, అధునాతన టెక్నాలజీ, ఎక్స్‌ట్రీమ్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల వల్లే ఇది భారత రక్షణ దళాల్లోకి ఎంపిక అయ్యింది. భద్రతా దళాల కోసం ఏకంగా 2,978 గూర్ఖా వాహనాల తయారు చేసి అందించాలని ఫోర్స్ మోటార్, భారత రక్షణ దళాల నుంచి పెద్ద ఆర్డర్‌ను అందుకుంది. కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చిన వాహనాలను భారత సైన్యం, వైమానిక దళంలో ఉపయోగించనున్నారు. సైనికులు, అక్కడి అధికారుల అవసరాలకు వాడనున్నారు.
ఫోర్స్ మోటార్స్ గతంలోనూ డిఫెన్స్ వాహనాలను భద్రతా దళాలకు సరఫరా చేసిన అనుభం ఉంది. కంపెనీ చాలా కాలంగా భారత భద్రతా దళాల కోసం గూర్ఖా LSV (లైట్ స్ట్రైక్ వెహికల్) వాహనాలను సరఫరా చేస్తోంది. ఇప్పుడు వాణిజ్యపరంగా కఠినమైన ఆఫ్-రోడ్ ప్రయాణాల కోసం గూర్ఖా వాహనాన్ని తయారు చేసి అందిస్తుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ బలమైన ప్రదర్శన ఇవ్వడంలో ఇది సాటిలేని మోడల్.

సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న గూర్ఖా కంటే, సైనిక వినియోగానికి అనుకూలంగా అత్యుత్తమ నాణ్యతతో, అధునాతన టెక్నాలజీతో ప్రత్యేకంగా ఈ వాహనాలను తయారు చేసి అందించనున్నారు. ముఖ్యంగా అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేసే కెపాసిటీతో దీన్ని రూపొందించనున్నారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో 3-డోర్లు, 5-డోర్లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇది మల్టీ-రోల్ పనితీరుకు పెట్టింది పేరు. సైనిక కార్యాచరణ, పెట్రోలింగ్, కమాండ్ వాహనంగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. ఫోర్స్ గూర్ఖా రెండు ఆప్షన్లు కూడా 2.6-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంటర్-కూల్డ్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. దీనిని మెర్సిడెస్ సహాయంతో అభివృద్ధి చేశారు. పెర్ఫామెన్స్ విషయంలో ఈ టర్బో డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 138 BHP పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








