ప్రభుత్వం నుంచి ట్యాక్సీ సర్వీసులు.. ఓలా, ఊబర్లకు చెక్ పడ్డట్లేనా ?

ఓలా, ఊబర్‌ వంటి ప్రైవేట్ కంపెనీలు ప్రస్తుతం ట్యాక్సీ సర్వీసుల్లో ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం 'సహకార్ ట్యాక్సీ'ని విజయవంతంగా అమలు చేస్తే, డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. పట్టణాల్లో ఉద్యోగం చేసే వారికి సొంత వాహనం తప్పనిసరి అయింది. ఒకవేళ లేకపోతే బస్సులో పడుతూ లేస్తూ ఆఫీసుకు చేరాలంటే చాలా కష్టం. సొంత వాహనాలు లేని వాళ్లు.. ప్రైవేట్ ట్రాన్స్‎పోర్టు వాహనాల మీద ఆధారపడుతుంటారు. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా ఓలా, ఉబర్ వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.

Sahakar Taxi

ఈ యాప్స్‎లో కారు, బైక్, ఆటో బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇక ఈ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల నుంచి ఆయా కంపెనీలు కొంత మేర కమీషనగా వసూలు చేస్తాయి. దీని వలన డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి డ్రైవర్లకు మేలు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగబోతుంది.

ఓలా, ఉబర్ ఆధిపత్యానికి బ్రేకులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. 'సహకార్ టాక్సీ' అనే యాప్ ఆధారిత టాక్సీ సేవను త్వరలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రయాణీకులకు తక్కువ ధరలకు బైక్, కారు, ఆటో సర్వీసులకు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఇది డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీ ప్రయోజనాలను తెస్తుందని భావిస్తున్నారు.

Indian Government to Launch Sahakar Taxi

సహకార్ టాక్సీ సర్వీసును తర్వాతో ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, టాక్సీ సర్వీసులను అందించే క్యాబ్ డ్రైవర్లు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు. దీని వల్ల లాభం కూడా నేరుగా డ్రైవర్లకు వెళ్తుందని అమిత్ షా అన్నారు.

ద్వి చక్ర వాహనదారులు , టాక్సీలు, ఆటోలు ఈ యాప్‎లో రిజిస్టర్ చేసుకోవచ్చని మంత్రి అమిత్ షా తెలిపారు. అంతేకాక ఈ సహకార్ టాక్సీ యాప్... ఓలా, ఉబర్‌లా మాదిరి డ్రైవర్స్ దగ్గర నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయదని.. కస్టమర్లు చెల్లించిన మొత్తాన్ని డ్రైవర్లకే చెల్లిస్తామని తెలిపారు. ఓలా, ఉబర్‌ల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు దీనిని తెస్తున్నామన్నారు.

Indian Government Taxi

సాధారణ డ్రైవర్లను ఆర్థికంగా సాధికారపరచడం ఈ సహకార్ టాక్సీ ముఖ్య ఉద్దేశం. అదేసమయంలో ప్రయాణీకులకు సరసమైన ధరలకు, విశ్వసనీయమైన సర్వీసులను అందించడం దీని లక్ష్యం. ఈ యాప్ ఆధారిత టాక్సీ సేవ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక వివరాలు అందుబాటులో లేవు. కానీ అమిత్ షా రాబోయే నెలలో సహకార్ టాక్సీ సర్వీస్ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై టాక్సీ సర్వీసులను అందించే డ్రైవర్లు తాము సంపాదించే ఛార్జీలో కొంత భాగాన్ని కమీషన్‌గా చెల్లించాలి. దీంతో వారి మొత్తం ఆదాయం తగ్గుతుంది. కానీ సహకార్ టాక్సీలలో, పూర్తి మొత్తాన్ని డ్రైవర్‌కు ఇస్తారు. దీనివల్ల టాక్సీ సేవలను అందించే ప్రైవేట్ కంపెనీలు గట్టి పోటీని ఎదుర్కోవలసి రావచ్చు.

Indian Government to Launch Sahakar Taxi

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'యాత్రి సాథి' పేరుతో టాక్సీ సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా కోల్‌కతాతో సహా ప్రధాన ప్రదేశాలలో సరసమైన టాక్సీ సర్వీసులను అందిస్తోంది. 2022లో కేరళ ప్రభుత్వం 'కేరళ సవారీ' పేరుతో టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. అయితే, వివిధ కారణాల వల్ల దానిని నిలిపివేశారు. త్వరలోనే దానిని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు అర్థమైంది.

ఇండియాలో టాక్సీ మార్కెట్ రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మోర్డర్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. ఇది ఇప్పుడు 23.40 బిలియన్ డాలర్ల మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2030 నాటికి ఇది 44.18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ కారణంగా అనేక కంపెనీలు దేశ టాక్సీ మార్కెట్‌ను ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

వాస్తవానికి ఓలా, ఉబర్ యాప్స్‎లో ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మనం ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి కూడా రైడ్ ఛార్జీలు ఛేంజ్ అవుతుంటాయి. తాజాగా రైడ్ బుకింగ్ అంశం.. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా ఈ యాప్స్ రైడ్ ఛార్జీలను మారుస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీనితో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.

ఈ సమయంలో ఆరోపణలను ఓలా ఖండించింది. ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ధరలు మారతాయనే దానిని తోసిపుచ్చింది. ఓలో ఓ ప్రకటనలో.. మా కస్టమర్లందరికీ ఒకే విధమైన ధరలు అందజేస్తున్నాం. సెల్‌ఫోన్ ఏ మోడలో దాని ఆధారంగా ధర నిర్ణయించడం లేదని వెల్లడించింది. అలాగే ఉబర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఇప్పుడు ఏకంగా కేంద్రం ఒక ప్రత్యేక యాప్‌ను తీసుకురానుండడం పై ఉబర్‌, ఓలాలకు షాక్ తగలనుందని చెప్పొచ్చు.

Taxi

మొత్తంమీద, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ కంపెనీలు టాక్సీ సర్వీసులను అందించడంలో అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 'సహకార్ టాక్సీ' అనే యాప్ ఆధారిత టాక్సీ సర్వీసును విజయవంతంగా అమలు చేస్తే, అది డ్రైవర్లకు మాత్రమే కాకుండా ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సహకార ట్యాక్సీ సర్వీసు ద్వారా వచ్చే లాభాలు ఏ పెద్ద పారిశ్రామికవేత్తకు వెళ్లవు, వాహనాల డ్రైవర్లకు మాత్రమే వెళతాయి. ఈ 'సహకార్ ట్యాక్సీ' సర్వీసు విజయవంతమైతే, భారతదేశంలో ట్యాక్సీ రంగంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఈ సర్వీసును సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 28, 2025, 17:45 [IST]
English summary
Indian government to launch sahakar taxi service to benefit drivers and passengers
Read more on: #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+