పేకాట పేకాటే.. ఎన్ని గొడవలున్నా చైనా కంపెనీ కార్లను తెగ కొనేస్తున్నారు..ఇప్పటికే 10000దాటిన డెలివరీలు

చైనాకు చెందిన BYD (Build Your Dreams) ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ. ఈ కంపెనీ దేశీయ మార్కెట్‌లో అనేక రకాల కార్లను విజయవంతంగా అమ్ముతోంది. ఈ కార్లు మంచి డిజైన్‌తో పాటు ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందుకే కస్టమర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా BYD కంపెనీ భారతదేశంలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది.

BYD కంపెనీ భారతదేశంలో 10,000 ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు డెలివరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ 2021లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత, 2022 నవంబర్‌లో తన మొదటి కారు అట్టో 3ను విడుదల చేసింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో సీల్, సీలియన్ 7, ఇమాక్స్ 7 కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Indians Are Impressed with Chinese Company Cars Rushing to Buy 10 000 Units Delivered

ప్రస్తుతం, BYD ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా ఎదిగింది. ఈ సంవత్సరం జూలై నెలలో 458 కార్లను అమ్మి, అమ్మకాలలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, 2025 ఫస్ట్ హాఫ్‎లో మొత్తం 2,449 యూనిట్లను అమ్మగలిగి, గత ఏడాదితో పోలిస్తే 137 శాతం వృద్ధిని సాధించింది.

అంతా అనుకున్నట్లే జరిగితే, ఈ సంవత్సరం చివరినాటికి BYD కంపెనీ దాదాపు 5,000 కార్లను అమ్మవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, దేశంలోని ప్రధాన నగరాలలో ఈ కంపెనీకి 44 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ఇవి కస్టమర్లకు మంచి సేవలను అందిస్తున్నాయి.

Indians Are Impressed with Chinese Company Cars Rushing to Buy 10 000 Units Delivered

BYD కార్ల వివరాలు
BYD eMAX 7: ఇది ఒక ఎలక్ట్రిక్ ఎంపీవీ (MPV). దీని ధర రూ. 26.90 లక్షల నుండి రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు అందమైన డిజైన్‌ను కలిగి ఉంది. కాస్మాస్ బ్లూ, క్రిస్టల్ వైట్ మరియు హార్బర్ గ్రే వంటి రంగులలో లభిస్తుంది. ఇందులో 6 లేదా 7 సీట్లు ఉంటాయి, ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ఈ కారు 55.4 kWh, 71.8 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 420 నుండి 530 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Indians Are Impressed with Chinese Company Cars Rushing to Buy 10 000 Units Delivered

BYD Atto 3: ఈ కారు ధర రూ. 24.99 లక్షల నుండి రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇందులో 49.92 kWh, 60.48 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేస్తే 468 నుండి 521 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఇందులో 5 సీట్లు ఉంటాయి.

BYD సీల్ (Seal): ఇది ఒక సెడాన్ కారు. దీని ధర రూ. 41 లక్షల నుండి రూ. 53.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 61.44 kWh, 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 510 నుండి 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో 5 సీట్లు ఉన్నాయి.

Indians Are Impressed with Chinese Company Cars Rushing to Buy 10 000 Units Delivered

BYD సీలియన్ 7 (Sealion 7): ఇది ఒక ఎస్‌యూవీ. దీని ధర రూ. 48.90 లక్షల నుండి రూ. 54.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులో 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 567 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి.

BYD వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో విజయం సాధించడం, దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో సూచిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను, లేటెస్ట్ టెక్నాలజీని BYD పరిచయం చేస్తుందనడంలో సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 7:22 [IST]
English summary
Indians are impressed with chinese company cars rushing to buy 10 000 units delivered
Read more on: #india #auto news #byd
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+