కేవలం రూ.2 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. పేద-మిడిల్ క్లాస్ కుటుంబాల కోసం! ఇండియాస్ చీపెస్ట్ EV!

ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచన రానివారు ఈ రోజుల్లో చాలా అరుదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో, ముఖ్యంగా నగరాల్లో సౌకర్యంగా ప్రయాణించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కారు అంటే కనీసం రూ. 8 లక్షల బడ్జెట్ ఉండాల్సిందే అన్న భావన చాలా మందిలో బలంగా ఉంది. అందుకే చాలామంది EV మనకు కాదు అని ముందే నిర్ణయించుకుని ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చే ఒక ఆసక్తికరమైన నిజం బయటకు వచ్చింది. మన దేశంలోనే తయారైన ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కేవలం రూ.1.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది ఏ జోకో కాదు, నిజంగా జరుగుతున్న విషయం.

భారత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను అభివృద్ధి చేస్తున్న వింగ్స్ EV అనే దేశీయ బ్రాండ్ ఈ దిశగా పెద్ద అడుగు వేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ కంపెనీ రాబిన్ EV అనే చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని అధికారికంగా పరిచయం చేసింది. ఇది సంప్రదాయ కార్లలా పెద్దదిగా కాకపోయినా, నగర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన 2-సీటర్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్.

Indias Cheapest Electric Car Wings Robin Ev Set For Deliveries

రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, దగ్గరలోని పనుల కోసం తిరగడం, లేదా సిటీ ట్రాఫిక్‌లో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది చాలా ప్రాక్టికల్‌గా ఉపయోగపడే వాహనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రాబిన్ EV గురించి మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆటోమోటివ్ ప్లాట్‌ఫామ్ కార్‌టాక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కంపెనీ త్వరలోనే ఈ వాహనాల డెలివరీలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

అంటే ఇప్పటివరకు కేవలం కాన్సెప్ట్ లేదా పరిచయ దశలో ఉన్న ఈ EV, ఇక నిజంగా రోడ్లపై కనిపించబోతోందన్న మాట. ఇది భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశముంది. కేవలం రూ. 2 లక్షల ధరలో ఒక ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులోకి రావడం అనేది మధ్యతరగతి కుటుంబాలకు, యువతకు, అలాగే రెండో వాహనం కోసం చూస్తున్న వారికి పెద్ద ఆకర్షణగా మారనుంది.

Indias Cheapest Electric Car Wings Robin Ev Set For Deliveries

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న వింగ్స్ EV ప్రయత్నాల ఫలితమే రాబిన్ EV. ముందుభాగంలో ఇద్దరు పెద్దవారు కూర్చునేలా సీటింగ్, వెనుక చిన్న పిల్లవాడికి సరిపోయే అదనపు స్థలం 2+1 ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 5.6 kWh బ్యాటరీ ప్యాక్.ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 90 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. రోజూ 20-30 కి.మీ మాత్రమే ప్రయాణించే వారికి రెండు మూడు రోజులకు ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, రాబిన్ EV సాధారణ ఇంటి విద్యుత్‌నే ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీని సున్నా స్థాయి నుంచి పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. రాత్రి ఇంటికి వచ్చాక ప్లగ్ పెట్టి ఛార్జ్ చేస్తే, ఉదయానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో కొంత దూరం ప్రయాణించాల్సి వస్తే, కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తోనే దాదాపు 10 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చు.

Indias Cheapest Electric Car Wings Robin Ev Set For Deliveries

ఇది 4-డోర్లు, 2+1-సీటర్ EV 12-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. గరిష్ట వేగం గంటకు 64 కి.మీ. ఇది 5 సెకన్లలో 0-40 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. వెనుక చక్రాలకు శక్తినిచ్చే రెండు 3 kW BLDC ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగిస్తుంది. ఇవి 6 kW శక్తిని, 282 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారును మొదట బెంగళూరులో మాత్రమే అందించాలని, తరువాత ఇతర నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 25, 2025, 9:18 [IST]
English summary
Indias cheapest electric car wings robin ev set for deliveries
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+