సేఫ్టీలో టాప్.. కళ్లు చెదిరే లుక్స్.. కేవలం రూ. 6.89 లక్షలకే టాటా ఆల్ట్రోజ్.. బాలెనో, i20లకు గట్టి షాక్
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మారుతి సుజుకి బాలెనో లాంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలని అనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. టాటా మోటార్స్ తన పాపులర్ ఆల్ట్రోజ్ కారుకు కొత్త అప్‌డేట్‌లు ఇచ్చి, ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పాత మోడల్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్ది, సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు.
ముఖ్యంగా, ఇది దేశంలోనే ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో చాలా మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మారుతి సుజుకి బాలెనోతో పోటీ పడేందుకు టాటా మోటార్స్, తమ టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది.

పాత మోడల్‌తో పోలిస్తే, ఇందులో అన్ని లోపాలను సరిదిద్దారు. ముఖ్యంగా, ఇది దేశంలోనే ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో దీనికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఆల్ట్రోజ్ ధరలను కూడా టాటా చాలా బాగా నిర్ణయించింది.
బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89లక్షలుగా ఉంది. ఇక అన్ని ఫీచర్లు ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 11.29లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలను చూస్తుంటే టాటా కొత్త డీజిల్ కారు మార్కెట్‌లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ప్యూర్ (Pure), క్రియేటివ్(Creative), అకంప్లిష్డ్ S(Accomplished S), అకంప్లిష్డ్ ప్లస్ S(Accomplished Plus S) అనే నాలుగు ట్రిమ్ లెవెల్స్‌లో అందుబాటులో ఉంటుంది.

ఇక రంగుల విషయానికొస్తే, డ్యూన్ గ్లో (Dune Glow), ప్రిస్టీన్ వైట్ (Pristine White), రాయల్ బ్లూ (Royal Blue), ఎంబర్ గ్లో (Ember Glow), ప్యూర్ గ్రే (Pure Grey) వంటి రంగుల్లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
వేరియంట్ల వారీగా ధర (ఎక్స్-షోరూమ్)లను పరిశీలిస్తే.. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ 1.2 పెట్రోల్ (బేస్ మోడల్) రూ. 6.89 లక్షలు, ప్యూర్ 1.2 పెట్రోల్ రూ. 7.69 లక్షలు, క్రియేటివ్ 1.2 పెట్రోల్ రూ. 8.69 లక్షలు, అకంప్లిష్డ్ S 1.2 పెట్రోల్ రూ. 9.99 లక్షలు, ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సీఎన్‌జీ (CNG) వేరియంట్ రూ. 7.89 లక్షల నుంచి రూ. 11.09 లక్షలుగా నిర్ణయించారు.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డీజిల్ మోడల్స్ ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 11.29 లక్షల వరకు ఉంటుంది. కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కోసం అధికారిక బుకింగ్‌లు 2025 జూన్ 2 నుండి ప్రారంభమవుతాయి. డిజైన్ విషయానికి వస్తే, దీన్ని ఎవరైనా ఇష్టపడే విధంగా మార్చారు.
ముందు భాగంలో ఉన్న స్లీకర్ LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ లైట్లు చాలా బాగున్నాయి. LED DRLలు ఇప్పుడు హెడ్‌లైట్లలో భాగంగా ఉన్నాయి. బంపర్‌పై మందపాటి బ్లాక్ ఇన్సర్ట్‌తో హౌసింగ్‌లు కనెక్ట్ అయి ఉండడం కూడా చూడటానికి అందంగా ఉంది.

పక్క నుంచి చూస్తే, కొత్తగా డిజైన్ చేసిన 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఇల్యూమినేటెడ్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఆల్ట్రోజ్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో ఆధునిక స్టైల్‌లో ఉన్న కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కారు లోపల కూడా చాలా మార్పులు చేశారు. కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్ ఆధారిత ఏసీ కంట్రోల్ ప్యానెల్, షైనింగ్ లోగోతో కూడిన కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇవి కాకుండా, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, iRA కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా కొత్త ఆల్ట్రోజ్ విలువను పెంచుతాయి.
సేఫ్టీ విషయంలో టాటాను అనుమానించాల్సిన అవసరం లేదు. అన్ని ట్రిమ్ లెవెల్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ESP(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ABS(యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 5-స్టార్ క్రాష్ రేటెడ్ బాడీషెల్ వంటివి కూడా స్టాండర్డ్‌గా లభిస్తాయి. క్రాష్ టెస్టులలో 5 స్టార్ రేటింగ్ పొందిన భారతదేశంలో ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఇంజిన్ ఆప్షన్లు పాత మోడల్‌లో ఉన్నవే ఉన్నాయి. కానీ ఈసారి AMT గేర్‌బాక్స్ను కూడా అందించారు. 1.2లీటర్ 3-సిలిండర్ NA పెట్రోల్, 1.5లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్, పెట్రోల్ ఇంజిన్‌తో డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన CNG, గేర్‌బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ DCA (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్) ఉన్నాయి. బాలెనోతో పాటు, ఈ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ i20 మోడల్‌కు కూడా ఆల్ట్రోజ్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








