టయోటా సరికొత్త రికార్డు.. ఇన్నోవా డీజిల్ మోడల్‌ను పక్కన పెట్టి హైబ్రిడ్ వైపు పరుగులు పెడుతున్న జనం!

కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్ మళ్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గత రెండు సంవత్సరాల నుంచి ఇండియాలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న టయోటా, ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025) భారీ వృద్ధి సాధించింది. ఈ సమయంలో కంపెనీ ఏకంగా 80,432 కార్లను అమ్మింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 18% ఎక్కువ.

ఈ అమ్మకాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది మాత్రం ఇన్నోవా కార్లే. అయితే, ఇప్పుడు ఇన్నోవా కొనేవాళ్లు డీజిల్ మోడల్‌ను కాకుండా హైబ్రిడ్ మోడల్‌ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారో చూద్దాం.

Innova Hycross

గత కొన్నేళ్లుగా భారతదేశంలో లగ్జరీ ఎంపీవీ సెగ్మెంట్‌ను ఏలుతున్న టయోటా ఇన్నోవాలో ఇప్పుడు ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం డీజిల్ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఇప్పుడు తగ్గి, హైబ్రిడ్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ వైపు కస్టమర్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం ఇన్నోవా కార్లలో ఇన్నోవా క్రిస్టా వాటా కేవలం 39% మాత్రమే ఉంది.

కానీ, ఇన్నోవా హైక్రాస్ వాటా ఏకంగా 61%కి పెరిగింది. దీనికి ముఖ్య కారణం, హైక్రాస్ అందించే అద్భుతమైన మైలేజ్. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ సాంకేతికతతో వస్తుంది. నవంబర్ 2022లో లాంచ్ అయిన ఈ కారు, టయోటా అడ్వాన్సుడ్ హైబ్రిడ్ టెక్నాలజీకి నిదర్శనం. ఇందులో 2.0-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఐదవ తరం స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఇది 184 హార్స్‌పవర్, 188 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Innova Hycross

మరో ఆప్షన్‌గా 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది, ఇది 173 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. దీని విశాలమైన ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లు పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి. సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కూడా ఎంతో ఇష్టమైన కారు ఇది.

ఇన్నోవా క్రిస్టా : ఇందులో 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 150 హార్స్‌పవర్ ఇస్తుంది. దీనికి లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెబుతున్నప్పటికీ, నిజానికి 9 నుండి లీటరుకు 13 కి.మీ మాత్రమే వస్తుంది. ఇది ఇప్పుడు డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Innova Hycross

ఇన్నోవా హైక్రాస్ : హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఈ కారు దాదాపు 60% సమయం ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తుంది. దీనివల్ల నగరంలో 13.1 కి.మీ/లీ, హైవేపై 16.1 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది.

ధరల విషయానికొస్తే, ఇన్నోవా హైక్రాస్ ధర రూ.26.31 లక్షల నుంచి రూ.31.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఇన్నోవా క్రిస్టా ధర అయిన రూ.19.09 లక్షల నుంచి రూ.21.30 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే చాలా ఎక్కువ. అయినా సరే, కస్టమర్లు ఎక్కువ మైలేజ్ ఇచ్చే, అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్న హైక్రాస్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో హైక్రాస్ ఇప్పుడు ఇన్నోవా బ్రాండ్‌కు కొత్త ఆధునిక గుర్తింపుగా మారింది.

More from DriveSpark

Article Published On: Friday, August 1, 2025, 15:18 [IST]
English summary
Innova hycross high price but customers prefer its hybrid technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+