స్కూటర్ లాగా మహిళలు ఈజీగా ఈ కార్లను డ్రైవింగ్ చేయచ్చు.. స్టీరింగ్ చేతిలో పడితే స్మూత్ రైడ్!

గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధిస్తున్నారు. ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు, పెద్ద సంస్థలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికి డ్రైవింగ్ వంటి రంగంలో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడు వారిలో కూడా కొంత మార్పులు వచ్చాయి. మహిళలు కూడా డ్రైవింగ్‌లో రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. పురుషాధిక్య డ్రైవింగ్‌లో క్రమంగా వారు కూడా అడుగులు పెడుతున్నారు. చాలా ప్రాంతాల్లో మహిళ డ్రైవర్లు కనిపిస్తున్నారు.

మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లు కూడా వారు డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగానే ఉన్నాయి. కంపెనీలు కూడా మహిళలు ఈజీగా నడపడానికి అనువుగా ఉండే మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా డ్రైవర్లకు అనువైన కొన్ని కార్లను కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

International Womens Day 2025 Best Suitable Cars

Tata Punch: భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన ప్రమాణాలు కలిగిన టాటా పంచ్ కారు మహిళలకు బెస్ట్ మోడల్. మార్కెట్లో ఇది రూ.7.60 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పంచ్ ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌‌మిషన్(AMT)ను ఎంచుకున్నట్లయితే డ్రైవింగ్‌లో కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మహిళలు ఈ కాంపాక్ట్ SUVని చాలా సులభంగా, సౌకర్యవంతంగా నడపవచ్చు. కారులో డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Maruti Swift: బడ్జెట్ ధరలో కార్లను అందించడంలో దేశీయంగా ప్రసిద్ధి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ (maruti Suzuki Swift) హ్యాచ్‌బ్యాక్ మహిళలు నడపడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని సీటింగ్ మహిళ రైడర్లకు అనుకూలంగా అనిపిస్తుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)‌‌లో లభించడం ద్వారా మహిళలకు ఈజీ డ్రైవింగ్‌ను ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.75 లక్షల నుంచి రూ.9.45 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

International Womens Day 2025 Best Suitable Cars

Kia Sonet: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ప్రసిద్ధ మోడల్ సోనెట్ SUV డిజైన్ మహిళలను అట్రాక్టి‌వ్‌ చేస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో రూ.12.51 లక్షల నుండి రూ.15.77 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. మహిళలకు అనువుగా ఉండటానికి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (IMT) అనే రెండు రకాల గేర్‌బాక్స్‌ ఆప్షన్‌‌లో లభిస్తుంది.

Hyundai Venue: ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌కి చెందిన వెన్యూ మోడల్ కూడా మహిళా డ్రైవర్లకు సులభమైన రైడింగ్‌ను అందిస్తుంది. S (O) వేరియంట్ శక్తివంతమైన 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)‌ను ఇంజిన్‌కు జత చేశారు. దీని ధర రూ.14.75 లక్షల వరకు ఉంటుంది.

Best Suitable Cars for Women Drivers

Maruti Baleno: మారుతీ సుజుకీ ప్రసిద్ధ మోడల్ బాలెనో ఆటోమేటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభించే వాటిలో మహిళలకు చాలా అనువుగా ఉంటుంది. మాన్యువల్‌ను కావాలనుకునే వారు దాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. లోపల ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.7.95 లక్షల నుంచి రూ.9.83 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ బడ్జెట్ ధరలో మహిళా డ్రైవర్లకు అనుకూలంగా ఉండే కార్లలో కీలకమైంది. దీని ధర రూ. 7.43 లక్షల నుండి రూ.8.56 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్‌ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మహిళలకు బెస్ట్ డ్రైవింగ్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2025, 14:47 [IST]
English summary
International womens day 2025 best suitable cars for women drivers
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+