పవర్ ఫుల్ ఇంజిన్, అద్భుతమైన మైలేజ్.. స్కోడా కైలాక్ త్వరలో కొత్త వేరియంట్లో కూడా

బడ్జెట్‌లో ఒక బెస్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే, చెక్ రిపబ్లికన్ కంపెనీ స్కోడా ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకాబోతుంది. ఫోక్స్‌వ్యాగన్తో కలిసి ప్రారంభించిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద విడుదల చేసిన కుషాక్, స్లావియా కార్లు ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వచ్చిన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కైలాక్' కూడా సక్సెస్ అయింది.

ముఖ్యంగా మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి మిడిల్ క్లాస్ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. కారణం తక్కువ ధర, యూరోపియన్ క్వాలిటీ, అదిరిపోయే మైలేజ్. స్కోడా కైలాక్ ప్రస్తుతం కంపెనీలో బాగా అమ్ముడవుతున్న మోడల్. నెలకు దాదాపు 5,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఈ కారుతో స్కోడా ఇంకా చాలా ప్లాన్ చేస్తోంది.

Skoda Kailaq

ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ మోడల్‌ను కూడా తీసుకురావాలని చూస్తున్నారు. మరిన్ని వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి మిడిల్ క్లాస్ ఎస్‌యూవీలతో పోటీ పడటానికి వచ్చిన 'కైలాక్' విజయవంతమైంది. దీనికి ప్రధాన కారణం, కాంపిటేటివ్ ప్రైజ్, యూరోపియన్ తయారీ క్వాలిటీ రెండూ ఒకేసారి లభించడం.

అంతేకాకుండా బ్రాండ్ టీఎస్‌ఐ (TSI) పెట్రోల్ ఇంజిన్ కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం, కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కూడా కైలాక్. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్ల కైలాక్ వాహనాలను హోండా డెలివరీ చేస్తోంది. తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఎస్‌యూవీని కేవలం ఇంతటితో ఆపడానికి స్కోడా ఉద్దేశించట్లేదనేది తాజా వార్త.

Skoda Kailaq

కైలాక్ ఎట్రాక్షన్ మరింత పెంచడానికి, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కింద ఉన్న వాహన తయారీదారులు మోడల్‌కు కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో కైలాక్ కొత్త వెర్షన్ రిలీజ్ చేయవచ్చు అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మీడియాకు తెలిపారు.

ఇది సామాన్యుల కోసం ఉద్దేశించిన ఎస్‌యూవీ కాబట్టి కైలాక్‌కు ఒక బేస్ వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా కైలాక్ కొనాలనుకునే కస్టమర్‌లకు మరిన్ని ఆప్షన్లను పెంచడమే కంపెనీ లక్ష్యం. ఈ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీకి ఎనిమిది నుండి తొమ్మిది నెలలు పట్టవచ్చని ఆశిష్ గుప్తా చెప్పారు. అలాగైతే, ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త వేరియంట్ స్కోడా కైలాక్ లైనప్‌లో చేరవచ్చు.

Skoda Kailaq

సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో పాటు, ఈ సెగ్మెంట్‌లో మరొక పాపులర్ ఎంపిక సీఎన్‌జీ . కైలాక్‌ను మరింత మందికి చేరువ చేయడానికి, ఎస్‌యూవీలో పెట్రోల్-సీఎన్‌జీ బై-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెట్టే ప్రణాళికను స్కోడా పరిశీలిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఉన్న వాహనం పొందడం భారతీయులకు ఎప్పుడూ సంతోషకరమైన విషయమే.

అయితే, ఈ విషయం గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన కైలాక్ ప్రస్తుతం రూ.8.25 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. అదే సమయంలో టాప్ ఎండ్ వేరియంట్ కావాలంటే రూ.13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర చెల్లించాల్సి ఉంటుంది. స్కోడా మిడ్-సైజ్ మోడల్స్ అయిన కుషాక్, స్లావియాను తయారు చేసిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పైనే కైలాక్ కూడా నిర్మించబడింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీకి శక్తిని అందించడానికి 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. కేవలం 10.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

స్కోడా కైలాక్ టాప్ స్పీడ్ 188 కిలోమీటర్లు. మ్యాన్యువల్ వెర్షన్‌కు లీటరుకు 19.68 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్‌కు లీటరుకు 19.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందించారు. కాబట్టి, ఆ విషయంలో కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: స్కోడా కైలాక్ నిజంగా బడ్జెట్ ఎస్‌యూవీ విభాగంలో ఒక స్ట్రాంగ్ కంపిటేటర్. యూరోపియన్ క్వాలిటీ, మంచి మైలేజ్, ఇప్పుడు కొత్త వేరియంట్లు, సీఎన్‌జీ ఆప్షన్లతో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది. మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Saturday, June 14, 2025, 10:15 [IST]
English summary
Is a cng option coming skoda kailaqs mileage magic is here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+