సెగలు పుట్టించేలా జీప్ కంపెనీ ఆఫర్లు..7 సీటర్ ఎస్యూవీ మీద ఏకంగా రూ.3.60 లక్షల తగ్గింపు!

అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్.. ప్రస్తుతం భారతీయ వాహన మార్కెట్లో ఎలాగైనా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని అద్భుతమైన ఎస్యూవీలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది. కాంపస్, మెరిడియన్ మోడల్స్ కొంతవరకు బాగానే అమ్ముడవుతున్నాయి.

ఫోర్డ్ కంపెనీ లాంటి పరిస్థితి తమకు రాకూడదని ఎంతో పట్టుదలగా ఉన్న ఈ కంపెనీ ఎలాగైనా కస్టమర్లను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి నెలా తమ మోడల్ శ్రేణిపై భారీ ఆఫర్లు, ప్రయోజనాలను అందిస్తోంది. 2025 మే నెల కోసం జీప్ ప్రకటించిన డిస్కౌంట్లు వింటే ఎవరికైనా వెంటనే కొనాలనిపిస్తోంది.

Jeep Discount India

కాంపస్, మెరిడియన్ లేదా జీప్ ప్రీమియం గ్రాండ్ చెరోకీ కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం. ఇలాంటి భారీ ఆఫర్ మళ్లీ వస్తుందో రాదో తెలియదు. మే నెల కోసం జీప్ ఏకంగా రూ.3.60 లక్షల వరకు తగ్గింపులను రెడీ చేసింది. అయితే, ఈ మొత్తం మోడల్, వేరియంట్, ఇతర అర్హతా ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, ఖచ్చితమైన సమాచారం కావాలంటే మీ దగ్గర్లోని జీప్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి. ఈ నెలలో కాంపస్‌పై రూ.2.80 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విభాగంలో రూ.1.70 లక్షల వరకు నగదు డిస్కౌంట్ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. డాక్టర్లు, లీజింగ్ సంస్థలు, బ్యాంక్ ఉద్యోగులు, జీప్ బ్రాండ్‌తో సంబంధం ఉన్న ప్రత్యేక వర్గాల వారికి అదనంగా రూ.1.10 లక్షల వరకు ఆఫర్ లభిస్తుంది.

Jeep

ఈ ఆఫర్లు ప్రధానంగా జీప్ కాంపస్ 2024 మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా, డీలర్లు, రాష్ట్రం, ప్రాంతం, స్టాక్ లభ్యతను బట్టి పైన పేర్కొన్న మొత్తంలో మార్పులు ఉండవచ్చు. ఇక జీప్ మెరిడియన్ ఎస్యూవీ విషయానికి వస్తే 2025 మే నెల కోసం సిద్ధం చేసిన అత్యధిక డిస్కౌంట్ ఈ ఎస్యూవీ మీదనే లభిస్తుంది.

అమెరికన్ కార్ల తయారీదారుల త్రి లైన్ ఎస్యూవీ ఇప్పుడు రూ.3.60 లక్షల వరకు విలువైన బెనిఫిట్లతో విక్రయించబడుతోంది. కొనుగోలుదారుల ప్రొఫైల్, స్టాక్ లభ్యతను బట్టి మెరిడియన్‌లో రూ.2.30 లక్షల నగదు తగ్గింపుతో పాటు అదనంగా రూ.1.30 లక్షల స్పెషల్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మెరిడియన్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షల నుంచి రూ.38.79 లక్షల వరకు ఉంది.

Jeep Discount

ఈ ధర నుంచి పెద్ద మొత్తంలో తగ్గింపు లభిస్తున్నందున మెరిడియన్ కొనడానికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు. భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్, స్కోడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్, నిస్సాన్ X-ట్రైల్ వంటి పెద్ద పోటీదారులతో జీప్ 7-సీటర్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం పోటీ పడుతోంది. ఇటీవల ఈ మోడల్ 5-సీటర్ వెర్షన్‌ను కూడా బ్రాండ్ భారతదేశంలో రిలీజ్ చేసింది.

జీప్ ఇండియా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గ్రాండ్ చెరోకీ కొనాలనుకునే వారు కూడా హ్యాపీగా ఫీల్ కావొచ్చు. టాప్-ఎండ్ వేరియంట్ అయిన లిమిటెడ్ (O) మాత్రమే విక్రయించబడే గ్రాండ్ చెరోకీ ఇప్పుడు రూ. 3 లక్షల వరకు ఆఫర్లతో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ ఎస్యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.67.50 లక్షలు. అయితే, ఆఫ్-రోడ్ కింగ్ అయిన రాంగ్లర్‌ను డిస్కౌంట్ ఆఫర్ల నుంచి మినహాయింపునిచ్చారు.

Jeep Discount India

ఇటీవల రాంగ్లర్ విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ అనే లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. లిమిటెడ్ నంబర్లలో మాత్రమే ఉత్పత్తి చేయబడే ఈ వాహనం 30 యూనిట్లు మాత్రమే ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. 1941 నాటి ఒరిజినల్ మిలిటరీ విల్లీస్ వారసత్వం నుండి ఇన్‎స్పైర్ అయిన విల్లీస్ 41ని తయారు చేశారు.

ఈ మోడల్ కోసం రూ.73.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాంగ్లర్ రూబికాన్ వేరియంట్ కంటే దాదాపు రూ.1.51 లక్షలు ఎక్కువ. రూబికాన్ భారతదేశ ఎక్స్-షోరూమ్ ధర రూ.71.65 లక్షలు. రాంగ్లర్ విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్‌కు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ శక్తినిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 270 bhp పవర్, 400 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 7:02 [IST]
English summary
Jeep goes all out to empty stock massive rs 3 60 lakh discount on 7 seater suv
Read more on: #jeep #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+