మహిష్మతి ఊపిరిపీల్చుకో బహుబలి కార్లు వచ్చేశాయ్! శక్తివంతమైన SUVలు మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధం!
జీప్ ఇండియా (Jeep India) మరోసారి తన అసలైన ఆఫ్-రోడ్ పనితనాన్ని ప్రదర్శిస్తూ, తన ప్రముఖ SUV మోడళ్లైన జీప్ కంపాస్ (Jeep Compass), జీప్ మెరిడియన్ (Jeep Meridian) ట్రయల్ ఎడిషన్ (Trial Editions) లను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లు, జీప్ ట్రస్ట్ అనే కొత్త ప్రోగ్రామ్ కింద అందుబాటులోకి తీసుకొచ్చినవి. ఈ ట్రయల్ ఎడిషన్‌లలో జీప్ క్లాసిక్ ఆఫ్-రోడింగ్ ఫోకస్‌కు తోడు, బోల్డ్ స్టైలింగ్ అప్‌డేట్లు, ప్రత్యేక ఎక్స్‌టీరియర్ టచ్‌లు, ఎక్స్క్లూజివ్ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం లుక్స్ పరంగా మాత్రమే కాకుండా, యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా కూడా ఓ కొత్త స్థాయిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆఫ్-రోడ్ SUV విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన జీప్ బ్రాండ్, ఈ ట్రయల్ ఎడిషన్‌లతో మరింతగా ఆ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
జీప్ ఇండియా తన ట్రైల్ ఎడిషన్ SUVలను భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, వీటి ధరలను కూడా అధికారికంగా ప్రకటించింది. జీప్ కంపాస్ ట్రైల్ ఎడిషన్ ధర రూ.25.41 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, అలాగే మెరిడియన్ ట్రైల్ ఎడిషన్ ధర రూ.31.27 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్లు శక్తివంతమైన ఆఫ్-రోడ్ పరిస్థితులను గట్టిగా తట్టుకుంటాయి.

ఇంకా ముఖ్యంగా, ఈ ప్రత్యేక ఎడిషన్ వాహనాలు జులై 15, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో వచ్చాయి. జీప్ ఇండియా తన ట్రైల్ ఎడిషన్ల విలువను మరింతగా పెంచేలా, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీప్ ట్రస్ట్ అనే ప్రత్యేక యాజమాన్య ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఆఫర్ కేవలం కొత్త ఎడిషన్‌లలో అందించే స్టైలింగ్ మార్పులకే పరిమితం కాకుండా, వినియోగదారులకు మూడింతల ప్రయోజనం అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
ఈ ప్రోగ్రామ్ కింద, జీప్ కంపాస్ ట్రైల్ ఎడిషన్ కొనుగోలుదారులకు 3 సంవత్సరాల ఉచిత వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్(AMC) లభిస్తుంది. దీంతో పాటు, 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ అందించబడుతోంది. ఇంకా, వినియోగదారులకు రూ.20,000 విలువైన ప్రత్యక్ష నగదు ప్రయోజనం కల్పించబడుతోంది. ఇవన్నీ కలిపి చూస్తే, కేవలం కారు కొనుగోలు సమయంలోనే కాక, దాని నిర్వహణలోనూ మునుపటి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాన్ని అందించడమే ఈ ప్రయోజనాల ఉద్దేశం.

అలాగే, జీప్ మెరిడియన్ ట్రైల్ ఎడిషన్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ప్రయోజనం అందుబాటులో ఉంది. ఇందులో 3 సంవత్సరాల ఉచిత AMC వాహన ధరలోనే చేర్చబడి లభిస్తుంది. అదనంగా ఏమీ ఖర్చు లేకుండా, వినియోగదారులు మూడు సంవత్సరాల పాటు వాహన సేవల్ని పొందవచ్చు. ఇలా చూస్తే, జీప్ ట్రస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సంస్థ కేవలం స్టైల్, పనితీరుకే పరిమితం కాకుండా, వినియోగదారులకు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్అందించే దిశగా అడుగులు వేస్తోంది.
ట్రయల్ ఎడిషన్ SUVలు మాదిరిగా కాకుండా, ప్రత్యేకతను చాటేలా రూపొందించబడ్డాయి. వాటి డిజైన్‌లో ఆడ్వెంచర్ భావన దాగి ఉంటుంది. హుడ్, బాడీపై ఉన్న డెకాల్స్ కారుకు దృఢత్వాన్ని తెచ్చిపెడతాయి. గ్రిల్‌పై న్యూట్రల్ గ్రే యాక్సెంట్‌లు, రూఫ్ రెయిల్స్, ORVMలు, ప్రత్యేక ట్రైల్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు అన్ని కలిపి, దీనికి ఒక రఫ్ & టఫ్ లుక్‌ను అందిస్తాయి. కారులోకి అడుగుపెడితే ఇంటిరీయర్ అందరికి ఆకట్టకుంటుంది.



Click it and Unblock the Notifications








