అన్ని సక్సెస్ కానీ నిరాశ పరుస్తున్న ఆ మోడల్ కొత్త వేరియంట్ లాంచ్ చేసిన జీప్.. ధర కూడా చాలా తక్కువ

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్.. భారత మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్యూవీలను లాంచ్ చేస్తోంది. జీప్ ఇండియా ది బెస్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ మాత్రమే నిర్మించే ప్రీమియం బ్రాండ్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే మన దేశంలో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి చిన్న మోడల్ లైనప్ విడుదల చేయగా.. అవన్నీ బాగా అమ్ముడవుతున్నాయి.

గతంలో కంపాస్ మోడల్ సృష్టించిన సక్సెస్ సునామీని ఇతర మోడల్స్ చేయలేకపోయాయని అమెరికన్ ఆటోమేకర్స్ కు నిరాశ ఉంది. అయితే, కంపెనీ ప్రజలకు అనేక ఆఫర్లు, బెనిఫిట్స్ అందించి వారిని ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఆ బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి జీప్ కంపాస్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

Compass Sandstorm Edition

శాండ్‌స్టార్మ్ ఎడిషన్ అనే పేరుతో ఈ మోడల్ నేటి నుంచి ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్, మిడ్-స్పెక్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ (O) వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర కంపాస్ సంబంధిత స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే రూ. 50వేలు ఎక్కువ.

Take a Poll

కంపాస్ శాండ్‌స్టార్మ్ ధర రూ. 19.49 లక్షల నుండి రూ. 27.33 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. జీప్ కంపాస్ సాండ్‌స్టార్మ్ ఎడిషన్ స్పోర్ట్స్ ధర రూ. 19.49 లక్షలు, లాంగిట్యూడ్ రూ. 22.83 లక్షలు, లాంగిట్యూడ్ (O) రూ. 25.33 లక్షలు, లాంగిట్యూడ్ (O) ఆటోమేటిక్ రూ. 27.33 లక్షలు.

Sandstorm Edition Seats

శాండ్ స్టార్మ్ డిజైన్ విషయానికి వస్తే కొత్త కంపాస్ కస్టమ్ స్పోర్ట్స్, బోనెట్, వైపులా శాండ్స్ స్టార్మ్ థీమ్ డెకాల్స్, ఫ్రంట్ ఫెండర్ పైన శాండ్ స్టార్మ్ బ్యాడ్జ్‌ ఉంటుంది. ఈ ఎడిషన్ ఇంటీరియర్ కూడా అప్ గ్రేడ్ అయింది. కొత్త సీట్ కవర్లు, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ బ్యాక్ డాష్ క్యామ్‌లు, కొత్త ఫ్లోర్ మ్యాట్స్, ఎక్స్ ట్రా సాండ్‌స్టార్మ్ బ్యాడ్జ్ SUVకి కూల్ లుక్ ఇస్తాయి.

స్పోర్ట్స్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్లలో 8.4-ఇంచుల టచ్‌స్క్రీన్, 17-ఇంచుల అల్లాయ్ వీల్స్, LED రిఫ్లెక్టర్ హెడ్‌లైట్స్ ఉంటాయి. జీప్ కంపాస్ సాండ్‌స్టార్మ్ ఎడిషన్ లాంగిట్యూడ్‌లో పెద్ద 10.1-ఇంచుల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఇన్-కార్ కనెక్టివిటీ సూట్ లభిస్తాయని జీప్ కంపెనీ తెలిపింది.

Sandstorm Edition Inner

కంపాస్ SUV పవర్ ఫుల్ 2.0-లీటర్ మల్టీజెట్ II డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 170 bhp పవర్, 350 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్‎తో లభిస్తుంది. డిఫరెంట్ డ్రైవింగ్ ప్రయారిటీలకు అనుగుణంగా అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

కంపాస్ పెట్రోల్ ఇంజన్ మోడల్స్ ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే. వెహికల్ ఆయిల్ బర్నర్ యూనిట్‌తో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. జీప్ కంపాస్ స్టాండర్డ్ మోడళ్ల ధర సెలెక్టెడ్ వేరియంట్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ బట్టి మారుతుంది.

మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ ధర రూ. 18.99 లక్షల నుంచి రూ. 28.33 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ.24.33 లక్షల నుండి రూ.32.41 లక్షల మధ్య ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కంపాస్ అమ్మకాలు కేవలం 120 యూనిట్లు మాత్రమే. కొత్త వెర్షన్ విడుదలతో రాబోయే నెలల్లో మరిన్ని అమ్మకాలు సాధించాలని కంపెనీ భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 18, 2025, 12:13 [IST]
English summary
Jeep launches new variant of compass with exciting features and affordable pricing
Read more on: #jeep #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+