మూడు వారాల్లోనే అన్ని కార్లు అమ్ముడయ్యాయి! ఒక్కసారి చూశారంతే.. అన్ని సేల్.. ఇది కారు కాదు.. ఒక లెజెండ్!

అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ జీప్ (jeep) ఇటీవల భారతీయ మార్కెట్‌లోకి కొత్తగా అద్భుతమైన మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు 'రాంగ్లర్ విల్లిస్ 41 లిమిటెడ్ ఎడిషన్ (wrangler willys 41 limited edition)'. దీనికి ఇండియాలో మాములు డిమాండ్ లేదు, తాజాగా విడుదలైన మూడు వారాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయింది. ఇది సాదారణ SUV కాదు, నిజమైన ఆఫ్-రోడింగ్ కావాలనుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించబడిన మోడల్. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్, జీప్ ఐకానిక్ వారసత్వానికి అద్దం పడుతుంది. గతంలో యుద్ధ రంగాల్లో విస్తృతంగా ఉపయోగించిన విల్లీస్ జీప్ డిజైన్‌ను ఆధారంగా తీసుకొని, లేటెస్ట్ టెక్నాలజీని జత చేసి రూపొందించబడిన ఈ మోడల్, భారతదేశంలో డ్రైవింగ్‌ను ఒక అనుభూతిగా భావించే వారికి ఫేవరెట్ మోడల్‌గా నిలిచింది.

మార్కెట్లో రూ.73.24 లక్షల ధరతో విడుదలైన రాంగ్లర్ విల్లిస్ '41 ఎడిషన్‌కి దేశవ్యాప్తంగా కేవలం 30 యూనిట్లే ఇవ్వబడ్డాయి. ప్రత్యేకతతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే లభించడమే, దీని ప్రాధాన్యతను మరింత పెంచింది. అవన్నీ కూడా ఇప్పుుడు అమ్ముడుపోయాయి. పాత రోజుల విల్లీస్ వాహనాలను తలపించే లుక్‌తో, లేటెస్ట్ SUV శక్తిని కలిపి విడుదల కావడంతో, ఇది ట్రెడిషన్‌కు తగ్గట్టుగా ఉండటంతో జీప్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Wrangler Willys 41 Special Edition Totally Sold Out Just In 3 Weeks

మొత్తం మీద, జీప్ రాంగ్లర్ విల్లిస్ 41 లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్‌లో మంచి ఆదరణ సంపాదించింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను 1941లోని అసలు మిలిటరీ వాహనం నుంచి తీసుకోవడంతో అప్పటి కాలం ప్రత్యేకమైన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆకట్టుకునే అంశం, "41 గ్రీన్" కలర్ ఆప్షన్. మిలిటరీ గ్రీన్‌ను తలపించే ఈ రంగు, అప్పటి కాలంలోకి తీసుకెళ్తుంది. ఇది శక్తివంతమైన 4x4 వాహనం.

దీనిలో పవర్డ్ సైడ్ స్టెప్స్, కస్టమ్ ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్స్, ఫ్రంట్, అండ్ రియర్ డాష్‌క్యామ్‌లు వంటి అనేక ప్రీమియం ఫీచర్లు అందించబడుతున్నాయి. ఇవన్నీ కలిపి, జీప్‌ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. మరో విషయం ఏమిటంటే బేస్ ధర కాకుండా అదనంగా, కస్టమర్లు రూ. 4.65 లక్షలు చెల్లించి సన్‌రైడర్ రూఫ్‌టాప్, రూఫ్ క్యారియర్, సైడ్ నిచ్చెనను పొందవచ్చు.

Jeep Wrangler Willys 41 Special Edition Sold

పెర్ఫార్మెన్స్ పరంగా చూసినప్పుడు, రాంగ్లర్ విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 270 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. దీనిని 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేయగా, జీప్ సెలెక్-ట్రాక్ ఫుల్-టైమ్ 4WD సిస్టమ్ దాన్ని ఎలాంటి కఠినమైన మార్గంలోనైనా సులభంగా ప్రయాణం సాగించేలా ఉపయోపడుతుంది.

జీప్ రాంగ్లర్ స్పెషల్ ఎడిషన్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి 12-వే లెవెల్స్‌లో అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని సౌకర్యాలు కూడా ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఇది చాలా బెస్ట్ టెక్నాలజీ అంశాలను కలిగి ఉంది.

Jeep Wrangler Willys 41

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఇవి ప్రీమియం వాహనాల్లో అందే స్థాయిలో ప్రయాణికుల రక్షణను అందిస్తాయి. ఇంకా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ వంటి అత్యాధునిక ఫీచర్స్ వినియోగారులకు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడంలో సహాయపడుతాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2025, 7:20 [IST]
English summary
Jeep wrangler willys 41 special edition totally sold out just in 3 weeks more details
Read more on: #jeep #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+