ఓనం పండుగలో పూల బదులు కార్లు.. దూరం నుంచి చూస్తే పూల రంగోలి అనిపిస్తుంది.. రికార్డు బద్దలు కొట్టిన MG
కేరళలో ఓనం పండుగ అనగానే అక్కడి ప్రజలలో ఎంత ఉత్సాహం ఉంటుందో చెప్పనక్కర్లేదు. పువ్వుల అంకరణలు, సాంప్రదాయ వంటకాలు, నృత్యాలు, ఉత్సవాలు.. అన్నీ కలిసి ఆ రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. అలాంటి సమయంలో ఆటోమొబైల్ మార్కెట్ కూడా ఉత్సాహంతో కళకళలాడుతుంది. పండుగ సీజన్‌లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి వచ్చే వినియోగదారులతో అక్కడి కార్ షోరూమ్‌లు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తాయి. ఈసారి ఆ పండుగ ఉత్సవాలను మరో స్థాయికి తీసుకెళ్లింది JSW MG మోటార్. ఓనం సందర్భంగా పూలతో చేసే పువ్వుల రంగోలికి బదులుగా, MG మోటార్ కార్లతో ఓ విశేషమైన రంగోలి ఆకారాన్ని రూపొందించింది. కేరళలో అతిపెద్ద పండుగను తమ వినియోగదారులకు మరింత గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది.
ఆసియాలోనే అతిపెద్ద కర్కలంగా (కార్లతో తయారు చేసిన రంగోలీ) గుర్తింపు పొందిన ఈ అద్భుత సృష్టి కేరళలోని కొచ్చి, గ్రాండ్ హయత్ బోల్గట్టిలో ఆవిష్కరించబడింది. అందమైన డిజైన్‌లో సరిగ్గా అమర్చిన 306 MG కార్లు కలిపి ఓనం రంగోలీని ప్రతిబింబించేలా ఒక మహా విస్తృత రంగోలి లాగా తీర్చిదిద్దబడ్డాయి. ఇది కేవలం ఓనం పండుగను ఘనంగా జరుపుకోవడమే కాకుండా, ఆటోమొబైల్ రంగంలో సృజనాత్మకతకు, బ్రాండ్ వినూత్నతకు నిదర్శనంగా నిలిచింది.

ఈ విశేష ఘనత ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా నమోదు కావడం MG మోటార్‌కు మరొక మైలురాయిగా నిలిచింది. పెద్ద పూల పార్క్‌లను చూసిన వారు ఈ కార్ల రంగోలిని చూసి ఆశ్చర్యపోయారు. పండుగ ఆనందాన్ని సాంకేతికతతో, సృజనాత్మకతతో మిళితం చేస్తూ వినియోగదారులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించడమే MG మోటార్ లక్ష్యమని కంపెనీ తెలిపింది. కళాత్మకతను ఆటోమోటివ్ ఎక్సలెన్స్‌తో కలిసి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్నది కేవలం MG మోటార్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న MG డీలర్ నెట్‌వర్క్, కస్టమర్లు, ఉద్యోగుల సమిష్టి కృషి కూడా. కేరళ సాంస్కృతిక వారసత్వానికి గౌరవప్రదంగా నిలిచేలా ఓనం సందర్భంగా ఈ విశేష రికార్డును చేపట్టినట్లు MG మోటార్ వెల్లడించింది. ఈ సందర్భంగా కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, కస్టమర్ల కోసం ప్రత్యేక ఓనం పండుగ ఆఫర్లను కూడా ప్రకటించింది.
కొత్త వాహనం కొనుగోలు చేయదలిచిన వారికి ఆకర్షణీయమైన నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, MG హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్, కామెట్, ZS EV వంటి ప్రముఖ మోడళ్లపై ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. పండుగ సమయంలో MG వాహనాన్ని ఎంచుకున్న కస్టమర్లకు అదనంగా ప్రత్యేక బహుమతులు కూడా అందజేయబడుతున్నాయి. దీంతో ఓనం పండుగ సంబరాలను MG మరింత ముందుకు తీసుకెళ్లింది.
భారతదేశ వ్యాప్తంగా 90 శాతం భౌగోళిక పరిధిని కవర్ చేస్తూ, 270 నగరాల్లో 543కి పైగా సేల్స్, ఆఫ్టర్‌సేల్స్ టచ్‌పాయింట్లతో MG మోటార్ తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా కేరళలో, ఈ బ్రాండ్ తన ఉనికిని మరింత బలపరుస్తూ, లేటెస్ట్ సాంకేతికతతో కూడిన వాహనాలను, విశ్వసనీయమైన ఆఫ్టర్‌సేల్స్ సపోర్ట్‌ను, సరికొత్త బ్రాండ్ అనుభవాలను వినియోగదారులకు అందిస్తోంది.
కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లు, ఎప్పటికప్పుడు 30 నిమిషాల వ్యవధిలోనే సాయం అందించేలా పనిచేస్తున్నాయి. దీని వల్ల ప్రతి MG యజమానికి వేగంగా సేవలు అందుతున్నాయి. ఇటీవల కొచ్చిలో ప్రారంభమైన MG SELECT ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా ఈ దిశలోని మరో కీలక అడుగు. కస్టమర్లకు అత్యాధునిక సదుపాయాలు, ప్రత్యేకమైన షాపింగ్, బ్రాండ్ అనుభవాలను కల్పిస్తూ, MG తన వినూత్నతను మరొకసారి చాటుకుంది.


Click it and Unblock the Notifications








