సేల్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న బ్రాండ్ రాతను ఈ ఒక్క కారు మార్చేసింది.. ఎక్కడ చూసినా ఇదే మోడల్!
JSW MG మోటార్ ఇండియా ఇటివలీ కాలంలో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు ధీటుగా సేల్స్‌లో దూసుకుపోతుంది. మే నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన అమ్మకాల డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, మే 2025లో కంపెనీ 6,304 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది అదే నెలలో నమోదైన 4,510 యూనిట్లతో పోలిస్తే సుమారు 40 శాతం వృద్ధిని సాధించింది. ఇది కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు 'MG విండ్సర్' వల్లే ఈ బలమైన లాభం సాధ్యమైంది. ఇంధన ఆధారిత కార్ల విభాగంలో MG మోటార్‌కు పెద్దగా స్పందన రాకపోయినా, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించడం సంస్థకు మంచి లాభం అయింది.
MG విండ్సర్ లాంచ్‌తో కంపెనీ ఓ కొత్త దశను ప్రారంభించింది. భారతీయ వినియోగదారులకు సరిపోయే డిజైన్, శ్రేణి, టెక్నాలజీ కలగలిసిన ఈ ఈవీ, మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మంచి గుర్తింపు సంపాదించింది. విండ్సర్‌తో పాటు అందుబాటులో ఉన్న ఇతర వేరియంట్లు కూడా పనితీరు పరంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీమియమ్ ఫీచర్లు, మోడ్రన్ ఇంటీరియర్, ఆచరణాత్మక బ్యాటరీ రేంజ్ వంటి అంశాలు వినియోగదారులకు ఆకర్షణగా మారాయి.

విండ్సర్ కారణంగా JSW MG మోటార్ ఇప్పుడు భారతదేశంలో అత్యంత నమ్మకమైన ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్‌లలో ఒకటిగా ఎదుగుతోంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించిన టాటా ఎలక్ట్రిక్ కార్లతో పోటీకి దిగేందుకు MG ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. మార్కెట్లో కొత్త ప్రాజెక్టులతో, మరిన్ని ప్రాంతాలకు విస్తరణతో కంపెనీ పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉంది.
ఇటీవల JSW MG మోటార్ ఇండియా తన విజయవంతమైన విండ్సర్ PROతో మరో కీలక అడుగు వేసింది. కంపెనీ, ఇప్పటికే మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన MG విండ్సర్ ఎలక్ట్రిక్ కారుకి రెండు కొత్త వేరియంట్లను జోడిస్తూ, భారతీయ ఈవీ మార్కెట్‌ను మరింత ఉత్సాహంగా మార్చింది. ఈ రెండు కొత్త వేరియంట్లు, ఎసెన్స్ ప్రో (Essence Pro), ఎక్స్‌క్లూజివ్ PRO(Exclusive Pro) వినియోగదారుల అభిరుచులను మరింత బలంగా తాకేలా రూపొందించబడ్డాయి.

ఈ వేరియంట్లు డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మరింత ప్రీమియమ్ అనుభూతిని కలిగించేలా తయారు చేయబడ్డాయి. ముఖ్యంగా, ఎక్స్‌క్లూజివ్ PRO వెర్షన్‌లో అధునాతన ఇంటీరియర్ డిజైన్, పెరిగిన ఇంటెలిజెంట్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు, మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఎసెన్స్ ప్రో వేరియంట్‌ను, ఒక ఎంట్రీ లెవెల్ ప్లస్ అనుభూతి కోసం స్టైల్, పనితీరు, ధరల కలయికగా చూడొచ్చు.
MG విండ్సర్ EV ప్రో భారతదేశంలో రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ ధరను పరిశీలిస్తే, ఇది తన సిరీస్‌లో ఉన్న ఇతర ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వగల స్థాయిలో ఉంది. అంతేకాకుండా, కొత్త విండ్సర్ మూడు కొత్త కలర్స్ సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ కలర్స్‌లలో అందుబాటులో ఉంది. ఇది రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది.

MG విండ్సర్ EV ప్రో 52.9 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌లో 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మరొకటి 38 kWh బ్యాటరీ ప్యాక్, ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఈ రెండు వేరియంట్లు కూడా శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో, రోజువారీ ప్రయాణాల నుంచి దూర డ్రైవ్‌ల వరకూ బాగా ఉపయోగపడతాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.


Click it and Unblock the Notifications








