పుట్టి ఏడాది కాలేదు.. అప్పుడే మార్కెట్ దున్నేస్తున్నాడు.. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కు పోటీ ఇస్తున్నడు

మహీంద్రా ఎక్స్‎యూవీ 3XO భారతీయ ఆటో మార్కెట్లో తన మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 29న విడుదలైన ఈ మోడల్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయింది. విడుదలైనప్పటి నుంచి ఇది అద్భుతమైన అమ్మకాల సంఖ్యలను నమోదు చేస్తోంది.

హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి ఇతర ఎస్యూవీలతో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అనేక ఆకర్షణీయమైన కారణాల వల్ల ఇది బాగా అమ్ముడవుతోంది. ఈ కారు గురించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్‎యూవీ 3XO అనేక రకాల ఆప్షన్లను అందిస్తూ.. వివిధ రకాల కస్టమర్లను ఆకర్షించడానికి తొమ్మిది వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV 3XO

పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో సమా వినియోగదారులు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా పవర్ ఎంచుకునే సౌలభ్యం ఇందులో ఉంది. ఈ ఎస్‎యూవీ ధర కూడా మారుతూ ఉంటుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ ధర రూ.15.56 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్యూవీ ప్రధాన ఎట్రాక్షన్లలో ఒకటి దాని లేటెస్ట్ టెక్నికల్ ఫీచర్ల సముదాయం.

ఇందులో 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అదే సైజులో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కలిగి ఉంది. ఈ సెటప్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కలిసి పనిచేసేలా రూపొందించారు. ఇది డ్రైవర్, ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లను మెరుగుపరుస్తుంది.

Mahindra XUV 3XO Front

లోపలి భాగం కూడా చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. డ్రైవింగ్, ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరిచే అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ అనేది కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ప్రత్యేకంగా నిలిచే మరో విభాగం. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది.

అంతేకాకుండా, ఈ ఎస్యూవీ లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్నాలజీ, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఒక ఫ్రంట్ రాడార్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇవన్నీ మంచి సేఫ్టీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO పవర్ట్రెయిన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్, 115 బీహెచ్పీ పవర్, 300పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డీజిల్ వేరియంట్లను కలిగి ఉంటుంది.

Mahindra XUV 3XO Side

అంతేకాకుండా, మహీంద్రా వినియోగదారులకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. ఇది వివిధ డ్రైవర్ ప్రిపరెన్స్‎లను తీరుస్తుంది. ఇండియాలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది ఈ కారును ఎక్కువగా సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది.

ప్రస్తుత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారు తయారు చేయడంతో ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కారు దీర్ఘకాలికంగా కూడా బాగా అమ్ముడయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మంచి ఫీచర్ల కలయిక, ఇంజిక్ కెపాసిటీ, సేఫ్టీ, టెక్నాలజీ, పోటీ ధర, వేరియంట్లలో వివిధ రకాలు భారతీయ మార్కెట్‌లో దాని ప్రజాదరణ గురించి వివరిస్తాయి. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి పోటీదారులతో పోటీ పడుతున్నప్పటికీ, దాని ప్రత్యేకమైన ఫీచర్లు, ఆప్షన్లు SUV కొనుగోలుదారులలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్‎గా నిలబెడుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 5, 2025, 14:01 [IST]
English summary
Just 1 year old already a hit why everyones buying the mahindra xuv 3xo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+