తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ.. కేవలం 4లక్షలకే అదిరిపోయే మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్.. అయినా కొనేదిక్కులేదు

భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. మారుతి సుజుకి కార్లు మంచి మైలేజ్ ఇవ్వడం, ఎక్కువ సంఖ్యలో సర్వీస్ సెంటర్లు ఉండడం ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు కార్ల ధర తక్కువగా ఉండడం కూడా దాని మొదటి స్థానానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే మారుతి సుజుకికి చెందిన కొన్ని తక్కువ ధర కార్లు అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయి.

అందులో ఒకటి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso). ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ప్రారంభ వేరియంట్ ధర కేవలం 4.27 లక్షల రూపాయలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర కూడా 6.12 లక్షల రూపాయలుగానే ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. దీని ద్వారా భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా తక్కువ ధర కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒకటిగా నిలుస్తుంది.

Maruti Small Car

అయినప్పటికీ ఈ కారును కొనడానికి భారతీయ వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి నెల విడుదలయ్యే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్ల సేల్స్ రిపోర్ట్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన 2025 ఏప్రిల్ నెల సేల్స్ రిపోర్ట్ కూడా నిరాశపరిచింది. ఈ సేల్స్ రిపోర్ట్ ప్రకారం మారుతి సుజుకి కంపెనీ 2025 ఏప్రిల్‌లో కేవలం 726 ఎస్-ప్రెస్సో కార్లను మాత్రమే విక్రయించింది.

కానీ గత 2024 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2,476గా ఉంది. దీని ద్వారా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్ల అమ్మకాలు 71 శాతం పడిపోయాయి. కేవలం 2024 ఏప్రిల్‌తో పోలిస్తేనే కాదు, 2025 మార్చి నెలతో పోల్చినా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్ల అమ్మకాలు తగ్గాముఖం పట్టాయి. 2025 మార్చి నెలలో 1,788 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి.

Maruti S Presso

కానీ ఏప్రిల్‌లో ఈ సంఖ్య 726కు పడిపోయింది. ఈ విధంగా చూస్తే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్ల అమ్మకాలు 59.40 శాతం తగ్గాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు సురక్షితమైనది కాదనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉండడం కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో తక్కువ స్కోర్ చేయడంతో ఈ అభిప్రాయం ఏర్పడింది.

అందుకే మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం ఎస్-ప్రెస్సో కారులో అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అంటే ప్రారంభ స్థాయి వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు అన్నింటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కాబట్టి రాబోయే నెలల్లో అయినా భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్ల అమ్మకాలు పెరుగుతాయో లేదో చూడాలి.

ఎస్-ప్రెస్సో మాత్రమే కాకుండా మారుతి సుజుకి అరేనా షోరూమ్‌ల ద్వారా విక్రయించే అన్ని కార్లలో ఇప్పుడు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారనే విషయం ఇక్కడ గమనించాలి. ఇది భద్రతా విషయంలో మారుతి సుజుకి తీసుకున్న అతిపెద్ద చర్యల్లో ఒకటిగా చూడవచ్చు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి.

ఈ కారులోని Std MT, LXi MT వేరియంట్‌లు లీటరుకు 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. అదే సమయంలో VXi MT, VXi+ MT వేరియంట్‌లు లీటరుకు 24.76 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఇక VXi(O) AGS, VXi+(O) AGS వేరియంట్‌లు లీటరుకు 25.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఇవన్నీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వేరియంట్‌లు.

కానీ ఈ కారులోని CNG వేరియంట్‌లు దీని కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులోని CNG ఇంజిన్ కలిగిన LXI MT, VXI MT వేరియంట్‌లు ఒక కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఇవన్నీ మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ARAI మైలేజ్ గణాంకాలు.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్‌డ్ హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో కూడిన ABS మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం: చాలా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం ఎదురుచూస్తున్న భారతీయ మధ్యతరగతి వినియోగదారులకు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మొదటిసారి కొత్త కారు కొనే వినియోగదారులు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారును పరిశీలించవచ్చు.

ఎస్-ప్రెస్సో కార్ల అమ్మకాలు మందకొడిగా ఉండటంతో మారుతి సుజుకి దాని అమ్మకాలను నిలిపివేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఎస్-ప్రెస్సో కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తున్నందున మారుతి సుజుకి అలాంటి నిర్ణయాలు తీసుకోదని మేము భావిస్తున్నాము.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

FAQs
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర ఎంత?

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.4.27 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో టాప్ వేరియంట్ ధర ఎంత?

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో టాప్ వేరియంట్ ధర రూ.6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఎందుకు తగ్గాయి?

ఈ కారు సురక్షితమైనది కాదనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉండటం ప్రధాన కారణం. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో తక్కువ స్కోర్ చేయడం దీనికి దారితీసింది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ వేరియంట్ మైలేజ్ ఎంత?

సీఎన్‌జీ వేరియంట్‌లు ఒక కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్ మైలేజ్ ఎంత?

వేర్వేరు పెట్రోల్ వేరియంట్‌ల ప్రకారం మైలేజ్ లీటరుకు 24.12 కిమీ నుండి 25.30 కిమీ వరకు ఉంటుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో ఇప్పుడు ఎన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి?

మారుతి సుజుకి ఇప్పుడు ఎస్-ప్రెస్సోలోని అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది.

DriveSpark Automotive

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2025, 12:36 [IST]
English summary
Just rs 4 lakh for a 6 airbag car plus 33 kmpl mileage bikes might lose
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+