ఫ్యామిలీ టూర్స్‌కు సరికొత్త EV కార్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 490 కి.మీ.లు.. రెండు కుటుంబాలకు సరిపోద్ది!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఇతర తయారీదారులకు పోటీగా దూసుకుపోతుంది. దేశంలో ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు కూడా ఇప్పుడు కియా కార్లు కనిపిస్తున్నాయంటే , కంపెనీ ఇండియాలో ఏ రేంజ్‌లో ఆదరణ సంపాదించిందో తెలిసిపోతుంది. ఇప్పటికే ఇంధన ఆధారిత పలు మోడళ్లను విక్రయిస్తున్న కియా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈవీలపై కూడా ఫోకస్ చేసింది. అందుకే తన ఐసీఈ వెర్షన్లను ఎలక్ట్రిక్ మోడళ్లుగా మార్చి తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో కియా ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎలక్ట్రిక్ MPV కారెన్స్ క్లావిస్ ఈవీ (Carens Clavis Ev) ని, చివరికి భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.
మొదటి నుంచీ సక్సెస్‌ఫుల్ MPVగా గుర్తింపు పొందిన కారెన్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో ప్రీమియమ్ ఫీచర్లతో, శక్తివంతమైన రేంజ్‌తో లభిస్తోంది. దీని ప్రారంభ ధరను రూ.17.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించిన కియా, EV మార్కెట్‌ను ఆకర్షించేందుకు ఉత్సాహంగా దీన్ని తీసుకొచ్చింది. ఆన్‌రోడ్ ధర వచ్చేసి మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయినప్పటికి మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి అన్ని అంశాలను ఇది కలిగి ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ కారు కావాలని చూసే వారు కారెన్స్ క్లావిస్ ఈవీని ఎంచుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్, దాని ICE వేరియంట్‌లతో పోలిస్తే అలాగే డిజైన్‌ను కొనసాగించినప్పటికీ ఇందులో EV-స్పెసిఫిక్ డిజైన్ టచ్‌లు కనిపిస్తాయి. సిల్హౌట్ కారెన్స్ మాదిరిగానే కనిపించినా, బంపర్ డిజైన్, బాడీ లైన్స్, షార్ప్ ఎలిమెంట్స్, సిలెంట్ డ్రైవ్ షార్ట్ కట్ కొత్తగా అనిపిస్తాయి. బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ చూసినట్లయితే, కారెన్స్ క్లావిస్ EV రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది.
దీనిలో 42 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ARAI ప్రకారం 404 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు. అదే మరింత ఎక్కువ రేంజ్ కావాలని అనుకునే వారికి పెద్దదైన 51.4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపుగా 490 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. ఈ రెండు వేరియంట్‌లకు వేర్వేరు పవర్‌ఫుల్ మోటార్లు జతచేయబడ్డాయి.

ఒకటి 99 kW అవుట్‌పుట్‌తో పనిచేస్తే, మరొకటి 126 kW అవుట్‌పుట్‌తో రన్ అవుతుంది. కారెన్స్ క్లావిస్ EV ఎలక్ట్రిక్ కారు HTK ప్లస్, HTX, HTX ప్లస్ అనే మూడు వేరియంట్లలో వినియోగదారుల అవసరాల మేరకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది 7 సీటర్ కారు. రెండు కుటుంబాలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణించవచ్చు. ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, సైలెంట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్.
కియా కారెన్స్ క్లావిస్ EV ఎలక్ట్రిక్ MPVగా మాత్రమే కాదు, ఒక ఫ్యూచురిస్టిక్ లగ్జరీ క్యాబిన్ అనుభూతిని కూడా అందిస్తోంది. ఈ కారులో అడుగుపెట్టగానే ఎదురయ్యే ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. లోపల 26.62 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కలిపేలా డిజైన్ చేయబడింది. విజువల్‌గా ఇది కేవలం ప్యానెల్ కాదు, ఒక ఇంటిగ్రేటెడ్ టెక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది.

సౌండ్ అనుభూతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా, కియాలో 8-స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అమర్చబడింది. ఇది క్యాబిన్‌ను హోమ్ థియేటర్ మాదిరిగా మారుస్తుంది. ఇక ఇంటీరియర్ అంబియన్స్ విషయానికి వస్తే, 64-రంగుల యాంబియంట్ లైటింగ్, ఫుట్‌వెల్ లాంప్స్,సరౌండ్ లైటింగ్‌తో కూడిన ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ కారును మరింత ప్రీమియంగా అనిపించేలా చేస్తాయి.


Click it and Unblock the Notifications








