ఇంత తక్కువ ధరకు 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు రాబోతుందా! కస్టమర్ల డ్రీమ్ నిజం కాబోతోంది!

భారత మార్కెట్లో దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా (Kia) తన సరికొత్త ఎంపీవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే పనిలో పడింది. ఈ ప్రయత్నంలో భాగంగా, ఇటీవలే కారెన్స్ క్లావిస్ (Carens Clavis) అనే కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కారెన్స్, కారెన్స్ క్లావిస్ రెండూ కలిసే అందుబాటులో ఉన్నాయి, రెండు వేరియంట్లుగా వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తూ కియా ముందుకు సాగుతోంది. తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా కియా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లు వెలుగులోకి వచ్చాయి. కేవలం డిజైన్ మార్పులతో కాదు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పర్యావరణానికి అనుకూలంగా ఉండే పవర్‌ట్రెయిన్‌పై కూడా కియా దృష్టి సారించింది.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో రానున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి 51.4 kWh, మరొకటి 42 kWh బ్యాటరీ ప్యాక్. ఇదే బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఇటీవల జనవరిలో విడుదలైన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో కూడా కనిపించాయి. అందువల్ల, Carens EV కూడా ఇదే ప్లాట్‌ఫాంపై రూపొందించబడుతున్నదనే ఊహనకు బలమిస్తోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ ఎలక్ట్రిక్ MPV గరిష్ఠంగా 473 కి.మీ. వరకు ప్రయాణించగలదని అంచనా.

Kia Carens Clavis Electric Car

కియా ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌ ద్వారా భారత ఎంపీవీ మార్కెట్‌లో గట్టి పోటిని కలిగించనుందని, ఇప్పటికే ఉన్న ఆటోమేకర్లకు ఇది బలమైన సవాల్‌గా మారనుంది. ప్రత్యేకించి, ఫ్యామిలీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కారు, డిజైన్, టెక్నాలజీ, ప్రాక్టికాలిటీ పరంగా వినియోగదారులకు నచ్చే అన్ని అంశాలు కూడా దీనిలో అందించనున్నారు. కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ కారు 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించనుంది.

పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త కారు సాంకేతికత, డిజైన్, సౌకర్యం అన్నింటిలోనూ ఆధునికతను ప్రతిబింబించేలా ఉంది. ఈ ఎలక్ట్రిక్ MPV ముందువైపు పూర్తి-LED లైటింగ్, ఆకర్షణీయమైన LED లైట్‌బార్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి స్టైలిష్ హైలైట్‌లతో రాబోతుంది. ఈవీగా ఉన్నప్పటికీ, స్పోర్టీ, మోడరన్ లుక్‌కు ఏ మాత్రం తగ్గలేదు. ఇంటీరియర్‌లో కూడా అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఇందులో రెండు 12.25 అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి.

Carens Clavis Electric

ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌. అలాగే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అంశాలు ఈ కారును స్మార్ట్, కంఫర్టబుల్‌గా మార్చుతున్నాయి. ధర విషయానికి వస్తే, కియా ఇప్పటికే భారత్‌లో EV6, EV9 వంటి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసింది. అవి ప్రీమియం సెగ్మెంట్‌లో ఉండగా, కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ మాత్రం మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది.

అందుకే దీని ధర వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించబోతోంది. ప్రాథమికంగా, ఈ మోడల్ ధర సుమారు రూ.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుందని అంచనా. ఇక అత్యధిక ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.26 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ధర రేంజ్‌లో, ఇది మెరుగైన సామర్థ్యం, ప్రయోజనాలు కలిగిన ఎలక్ట్రిక్ ఎంపీవీ కావడంతో మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Carens Clavis Electric Range

ఇప్పటికే భారతీయ ఆటోప్రేమికులలో మంచి అంచనాలను కలిగించిన కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ కారు జులై 2025లో అధికారికంగా మార్కెట్లోకి రానుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కియా తన ఉనికిని మరింత బలపరిచే దిశగా ఇది ఒక కీలకమైన అడుగు కావడం విశేషం. రానున్న వారాల్లో కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టీజర్ వీడియోలు, టీజర్ ఇమేజులు కూడా విడుదలయ్యే అవకాశముంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 4, 2025, 10:50 [IST]
English summary
Kia carens clavis electric car will launch on july 2025 expected price range details
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+