రెండు ఫ్యామిలీలకు సెట్ అయ్యే కార్ల కోసం జనం క్యూ కట్టారు.. ఎన్నడూ లేని స్థాయిలో బుకింగ్స్!
కియా మోటార్స్ (Kia Motors) భారత ఆటోమొబైల్ రంగంలో తన స్థానం మరింత బలపరచుకుంటోంది. దేశీయ ప్రజలను ఆకట్టుకోవడానికి అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ తన సత్తాను చాటుతుంది. ఈ కంపెనీ కార్లు అమ్మకాల పరంగా ఆశించిన మేరకు గణంకాలను నమోదు చేస్తున్నాయి. తాజాగా కియాకు చెందిన ప్రసిద్ధ మోడళ్లు అయినటువంటి కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ EVని కస్టమర్లు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. మే నెలలో కంపెనీ కారెన్స్ క్లావిస్ స్టాండర్డ్ వేరియంట్‌ను పరిచయం చేయగా, జూలైలో దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన కారెన్స్ క్లావిస్ EVను ఆవిష్కరించింది. ఈ రెండు MPVలు ఆధునికమైన డిజైన్‌తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండటంతో మార్కెట్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ప్రస్తుతం, ఈ రెండు మోడళ్లకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కియా ప్రకటించిన ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 21,000కు పైగా బుకింగ్‌లు నమోదయ్యాయి. ఇందులో గణనీయమైన వాటా స్టాండర్డ్ వేరియంట్‌దే. దాదాపు 20,000 మంది వినియోగదారులు కారెన్స్ క్లావిస్ స్టాండర్డ్ వెర్షన్‌ను ఎంచుకోగా, సుమారు 1,000 మంది కొనుగోలుదారులు క్లావిస్ EV కోసం బుకింగ్‌లు చేశారు. ఈ బుకింగ్‌లు కియా MPVలకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ప్రత్యేకంగా, ఎలక్ట్రిక్ వెర్షన్‌పై వచ్చిన ప్రారంభ స్పందన కంపెనీకి ప్రోత్సాహం కలిగించే అంశం. ఇది కేవలం భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌ను మాత్రమే కాకుండా, కియా బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. ఈ రెండు కార్లు డిజైన్ పరంగా ఒకే విధంగా కనిపిస్తున్నాయి. త్రికోణ ఆకారపు LED హెడ్‌లైట్లు, L ఆకారంలో మెరుస్తున్న LED DRLలు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉండటంతో ఆకర్షణీయమైన రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి.
క్లావిస్ EV విషయానికొస్తే, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తోంది. ఇందులో అమర్చిన 42 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 404 కిలోమీటర్ల వరకు రేంజ్ అందుతుంది. ఈ మోడల్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 135 PS హార్స్‌పవర్, 255 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని వలన డ్రైవింగ్ అనుభవం శక్తివంతంగా, సాఫ్ట్‌గా అనిపించడమే కాకుండా, లాంగ్ జర్నీలో కూడా వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తుంది.

క్లావిస్ EV మరో 51.4 కిలోవాట్-అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న ఈ మోడల్‌లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 490 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 171 PS హార్స్‌పవర్, 255 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంగ్ జర్నీలు చచేసే వారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది.
ఐసీఈ విషయానికి వస్తే, కియా కారెన్స్ క్లావిస్ పనితీరులోనూ బలంగా నిలుస్తుంది. ఈ MPVకి మూడు రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో పెట్రోల్, అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. వినియోగదారుల అవసరానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌మిషన్ విషయంలో కూడా కారెన్స్ క్లావిస్ మరిన్ని ఆప్షన్లను కల్పిస్తోంది.

ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సౌకర్యవంతమైన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. వేరియంట్, ఇంజిన్‌ను బట్టి ఇది 15 kmpl నుండి 19 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. దీని వలన, కుటుంబ అవసరాలు, రోజువారీ డ్రైవ్‌లు లేదా లాంగ్ ట్రిప్‌లు.. ఏదైనా సరే, కియా కారెన్స్ క్లావిస్ వినియోగదారులకు సరైన కాంబినేషన్‌ను అందించే MPVగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








