టాటా-మారుతికి షాక్! కొత్త ఛాలెంజ్ విసిరిన కియా.. అదిరిపోయే కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్లు వచ్చేశాయ్
ఇండియాలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే, దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ (Kia Motors) తమ ప్రత్యేక స్థానం సంపాదించింది. కంపెనీ తక్కువ సమయంలోనే భారతీయ SUV, EV మార్కెట్లలో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రధాన ఆటోమొబైల్ బ్రాండ్లకు ధీటుగా ఎదుర్కొని నిలబడింది. వినియోగదారుల వద్ద తన ఉత్పత్తులను త్వరగా ఆహ్వానించుకోవడం, మార్కెట్‌లో వేగంగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న విజయాన్ని మరింత పెంచడానికి, కియా తన కారెన్స్ క్లావిస్ EV కోసం రెండు ప్రత్యేక వేరియంట్లను HDX E, HDX E (ER) ఇండియాలో ప్రవేశపెట్టింది. క్లావిస్ EV కొత్త వేరియంట్లు వినియోగదారుల కోసం సౌకర్యం, శక్తి, రేంజ్ పరంగా విభిన్న ఎంపికలను అందిస్తున్నాయి.
HTX E స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 19.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండగా, ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షలుగా ప్రకటించబడింది. ఈ ధరలు, EV సెగ్మెంట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లలో ఒకటిగా నిలుస్తాయి. ఈ వేరియంట్ల ఆధునిక ఇన్నోవేటివ్ ఫీచర్లు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, ఆకర్షణీయ డిజైన్ మార్కెట్‌లో కియాకు మరింత బలమైన స్థానాన్ని అందించనున్నాయి. పండుగ టైంలో ఇవి కియా సేల్స్ పెరగడానికి దోహద పడుతాయి.

కియా క్లావిస్ EV కొత్త వేరియంట్లు వినియోగదారులకు ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నాయి. HDX E వేరియంట్ 42 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది సింగిల్ చార్జ్‌లో 404 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. మరొక వైపు, HDX E(ER) వేరియంట్ 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, 490 కి.మీ. రేంజ్ అందిస్తుంది, అంటే ఈ SUVలు దూర ప్రయాణాలకు కూడా సులభంగా సర్దుబాటు అవుతాయి.
ఇంటీరియర్ అంశాలను చూస్తే, కార్లలో అత్యాధునిక సౌకర్యాలు, లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అన్ని విండోలకు వాయిస్-ఆపరేటెడ్ ఆటో అప్/డౌన్ ఫీచర్, 64-రంగుల యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెథరెట్ అప్హోల్స్టరీ, లెథరెట్-వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి. డ్రైవర్ కోసం టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తుండటంతో, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కలుగుతుంది.

ప్రయాణికుల కోసం రిట్రాక్టబుల్ సీట్‌బ్యాక్ టేబుల్, LED ఇంటీరియర్ లైట్లు, యాంటీ-గ్లేర్ IRVM(ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్), ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ డ్యూయల్-టోన్ లేత గోధుమ, నేవీ బ్లూ థీమ్‌లో పూర్తిగా రూపొందించబడింది, ఇది SUVకి ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. HDX E (ER) ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇది వాహనానికి మరింత స్పోర్టీ లుక్ ఇస్తుంది.
కియా క్లావిస్ EV HDX E, HDX E (ER) వేరియంట్లు ఆధునిక ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యంతో వస్తున్నాయి, దీని ద్వారా వాహనాన్ని 39 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది రోజువారీ డ్రైవింగ్‌లో సమయాన్ని ఆదా చేయడంలో దూర ప్రయాణాల్లో వాహనాన్ని త్వరగా సిద్ధం చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. భద్రత పరంగా, ఈ EVs వినియోగదారుల కోసం అత్యంత సమగ్రంగా రూపొందించబడ్డాయి.

ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, మరిన్ని ఫీచర్లతో మొత్తం 18 భద్రతా లక్షణాలు ఉన్నాయి. వీటిలో ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సాంకేతికతలు SUVను ప్రతి పరిస్థితిలో సురక్షితంగా, నమ్మకంగా డ్రైవ్ చేయడానికి సహాయపడతాయి.


Click it and Unblock the Notifications








