ఇక సీట్ల మధ్య ముడుచుకు కూర్చోవాల్సిన పని లేదు.. కియా కారెన్స్ క్లావిస్ కొత్త 6-సీటర్ వేరియంట్స్ రిలీజ్

భారత మార్కెట్లో ఏడు సీట్ల ఎంపీవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న మోడల్ కియా కారెన్స్. ఇటీవల మరింత స్టైలిష్‌గా క్లావిస్ అనే పేరును జోడించుకున్న ఈ కారు, మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి ఇష్టమైన ఎంపికగా ఉంది. ఇందులో అనేక రకాల వేరియంట్లు, ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండడం మరో విశేషం. వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుని, తమ మోడళ్లలో అవసరమైన మార్పులు చేసే అలవాటు కియాకు ఉంది.

వినియోగదారులు చాలా కాలంగా కోరుతున్న ఒక అంశాన్ని కియా ఇప్పుడు ఈ మోడల్‌లోకి తీసుకొచ్చింది. కారెన్స్ క్లావిస్ మోడల్ శ్రేణిలోకి కొత్త వేరియంట్‌లను జోడించడం ద్వారా ఎంపీవీని మరింత ఆకర్షణీయంగా మార్చింది. కారెన్స్ క్లావిస్ ఇప్పుడు కొత్త HTX (O) వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.27 లక్షలు. ఈ మోడల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లను చేర్చారు.

Kia Carens Clavis Gets More Flexible New HTX O Trim and Wider 6-Seater Options Launched

అంతేకాకుండా, హెచ్‌టీకే+, హెచ్‌టీకే+ (ఓ),హెచ్‌టీఎక్స్ (ఓ) అనే ట్రిమ్‌లలో ఆరు సీట్ల ఆప్షన్లను కూడా చేర్చినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ కొత్త ట్రిమ్‌లు, వేరియంట్లు 2025 అక్టోబర్ 13 నుండి అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయి.

కొత్త కియా కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఎక్స్ (ఓ) వేరియంట్‌లో 8 స్పీకర్లు గల ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ప్రయాణాలు మరింత హ్యాపీగా సాగుతాయి. ఈ ఫీచర్ ఇంతకు ముందు కేవలం హెచ్‌టీకే+ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో పాటు, ఎంపీవీ 7-స్పీడ్ డీసీటీ మోడల్‌లో ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవ్ మోడ్ ఆప్షన్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. కొత్త కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఎక్స్ (ఓ) వేరియంట్ దానిపై ఉన్న హెచ్‌టీఎక్స్+ ట్రిమ్ కంటే కొంచెం తక్కువ స్థానంలో ఉంటుంది.

Kia Carens Clavis Gets More Flexible New HTX O Trim and Wider 6-Seater Options Launched

ఈ కొత్త వేరియంట్లు ఆరు, ఏడు సీట్లతో కొనుగోలుకు వీలుగా ఉంటాయి. ఇది ప్రత్యేకంగా 7-స్పీడ్ డీసీటీతో జత చేసిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇప్పుడు హెచ్‌టీకే+,హెచ్‌టీకే+(ఓ) ట్రిమ్‌లలో కూడా ఆరు సీట్ల వేరియంట్లు అందుబాటులో ఉండటంతో, వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్‎ను సెలక్ట్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

కియా కారెన్స్ క్లావిస్లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లలో, రెండవ వరుసలో స్లైడింగ్, రీక్లైనింగ్, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ సీట్లు ఉన్నాయి. ఇవి మూడవ వరుసలోకి సులువుగా ప్రవేశించడానికి సహాయపడతాయి. ఇంకా, 26.6 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, 64-రంగుల లైటింగ్, ఇన్ఫోటైన్‌మెంట్- టెంపరేచర్ కంట్రోల్ స్వాప్ స్విచ్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎంపీవీలో ఉన్నాయి.

Kia Carens Clavis Gets More Flexible New HTX O Trim and Wider 6-Seater Options Launched

మెకానికల్‎గా ఎటువంటి మార్పులూ లేకపోవడంతో, కారెన్స్ క్లావిస్ మునుపటిలాగే 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. సేఫ్టీ విషయంలో కూడా ఈ కారు ముందుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, రోల్‌ఓవర్ సెన్సార్లు వంటి సేఫ్టీ అంశాలను కియా అందించింది. ఎంపీవీ టాప్ వేరియంట్‌లలో 20 అటానమస్ ఫీచర్లు గల లెవల్ 2 ఏడీఏఎస్ కూడా లభిస్తుంది.

కారెన్స్ క్లావిస్ ఇప్పుడు హెచ్‌టీఈ, హెచ్‌టీఈ (ఓ), హెచ్‌టీకే, హెచ్‌టీకే+, హెచ్‌టీకే+ (ఓ), హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్+ తో సహా మొత్తం 8 ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ ఏడు సీట్ల మోడల్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.08 లక్షల నుంచి రూ. 20.71 లక్షల వరకు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2025, 15:48 [IST]
English summary
Kia carens clavis gets more flexible new htx o trim and wider 6 seater options launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+