ఫ్యామిలీ కోసం తక్కువ ధరకే కియా కొత్త కారు.. రెండు కుటుంబాలకు బెస్ట్.. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!
దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు బలమైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కస్టమర్లు కోరుకునే విధంగా అన్ని ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్స్‌తో అమ్మకాల పరంగా ఆశించిన మేరకు లక్ష్యాన్ని సాధిస్తుంది. కుటుంబ ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం గతంలో కారెన్స్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ కారుగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా కారెన్స్ క్లావిస్ (carens clavis) మోడల్‌ను దేశీయ మార్కెట్లో కియా ఇప్పుడు విడుదల చేసింది. రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త MPV, కేవలం ఫ్యామిలీకి మాత్రమే కాకుండా, వినియోగదారుల అవసరాలను అందుబాటులోనే తీర్చే బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.
ఇది ఆరు, ఏడు సీట్ల లేఅవుట్‌లలో లభిస్తుండటం వల్ల, చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాల వరకు సరిపడే విధంగా ఉంటుంది. ప్రామాణిక కారెన్స్ మోడల్‌తో పోల్చినప్పుడు, ఈ వెర్షన్ లోపల, బయట రెండింటిలోనూ అనేక విధాలుగా అప్‌డేట్స్ పొందింది. డిజైన్ పరంగా కాస్త స్పోర్టీ టచ్‌తో మరింత మెరుగైన రూపాన్ని అందించగా, ఇంటీరియర్‌లో ఫంక్షనాలిటీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా, రెండవ వరుసలో వున్న సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు నిజంగా ఆకట్టుకుంటాయి.

మూడవ వరుస సీట్లకు సులభంగా యాక్సెస్ పొందేందుకు వాక్-ఇన్ లివర్‌ను, ఎలక్ట్రిక్ వన్-టచ్ టంబుల్ ఫంక్షన్‌ను అందించడం ఈ MPVకి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇవి ప్రయాణికులకు ఎంట్రీ, ఎక్సిట్ మరింత సౌకర్యవంతంగా మార్చేస్తాయి, ముఖ్యంగా పెద్దవారికి, చిన్నపిల్లలకు అనుకూలంగా ఉంటుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.21.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ MPV మొత్తం ఏడు ట్రిమ్‌లలో లభిస్తుంది.
HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+ వేరియంట్లలో వినియోగదారులు తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్‌ను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. కియా కారెన్స్ క్లావిస్ మరింత శక్తివంతమైన, టెక్నాలజీతో అభివృద్ధి చెందిన రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఎమ్‌పీవీ మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు అందుబాటులో ఉంది. ఇది 1.5-లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఇది గరిష్టంగా 113 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ డ్రైవింగ్‌కు సరిపోయే ఈ ఇంజిన్‌కి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. ఇది మంచి మైలేజీతో పాటు సాఫ్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మరింత డైనమిక్ రైడ్ కోసం, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ GDi పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 158 bhp పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్‌కి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్(DCT) వంటి మూడు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా లభిస్తున్నాయి. మరోటి 1.5-లీటర్ డీజిల్ వేరియంట్ 113 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ కోసం అనేక అత్యుత్తమ ప్రమాణాలు ఉన్నాయి. లెవల్ 2 ADAS సిస్టమ్ అందించబడింది. అలాగే, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC) వంటివి ఉన్నాయి.

ఈ కారులో ఏర్పాటు చేసిన 360-డిగ్రీ కెమెరా వ్యవస్థ, పార్కింగ్ లేదా చుట్టు ప్రక్కల చూడటానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటీరియర్‌కు వస్తే, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు , డ్యూయల్- పనోరమిక్ సన్‌రూఫ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి పలు అంశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








