ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ.. రెండు కుటుంబాలకు సరిపోతుంది! అందుకే జనాలు ఎంచుకుంటున్నారు!

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీకంపెనీ కియా మోటార్స్ (Kia Motors) భారత్‌లో దూసుకుపోతుంది. ఇక్కడ అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే దేశీయ దిగ్గజ కంపెనీలు అయినటువంటి మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి వాటికి ధీటుగా అదిరిపోయే డిజైన్లతో, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో భారతీయ ప్రజలను తన వైపు తిప్పుకుంటుంది. ఇదిలా ఉంటే కియా మోటార్స్ జూన్ 2025లో తన అమ్మకాలతో ఒక వైవిధ్యమైన ఫలితాన్ని ఎదుర్కొంది. మొత్తం 20,625 యూనిట్లు దేశీయంగా విక్రయించినప్పటికీ, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం తగ్గుదల. అయినప్పటికీ, కంపెనీ రాబోయే నెలల్లో మరింత గరిష్టంగా ప్రదర్శించేందుకు ఆశాభావంగా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మకాల్లో కియా కారెన్స్ క్లావిస్ MPV (Kia Carens Clavis) ఎడిషన్‌కు ప్రత్యేకత నెలకొంది.

ఈ మోడల్ జూన్ నెలలో 7,921 యూనిట్ల అమ్మకాలతో మెరిసింది. ఇదే మోడల్ గత సంవత్సరం అంటే 2024 జూన్‌లో 5,154 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది ఏకంగా 2,767 యూనిట్ల పెరుగుదల, దాదాపు 54 శాతం గ్రోత్ అని చెప్పొచ్చు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కేవలం నెల రోజుల వ్యవధిలోనే కారెన్స్ 7-సీటర్ వేరియంట్ భారీ పెరుగుదల చూపింది.

Kia Carens Clavis Mpv

కియా కారెన్స్ క్లావిస్ సేల్స్ మే 2025లో 4,524 యూనిట్లుగా ఉండగా, జూన్‌లో అది 75 శాతం పెరిగి పెద్ద గణాంకంగా మారింది. సాధారణంగా భారత్‌లో పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరు కలిసి ప్రయాణించే వాటికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. కారెన్స్ క్లావిస్ రెండు కుటుంబాలు కూడా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండటంతో కుటుంబాల మద్దతుతో ఈ MPV మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.

కియా కారెన్స్ క్లావిస్ జూన్ 2025లో విజయవంతమైన సేల్స్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో దాని ధర ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది మార్కెట్‌లోని ప్రముఖ MPV మోడళ్లతో గట్టి పోటీ ఇస్తుంది. రూ.11.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లభించే ఈ 7-సీటర్, మారుతి ఎర్టిగా వంటి వాహనాలను లక్ష్యంగా చేసుకుని తన స్థిరతను నిలబెట్టుకుంది. ఈ కారును ప్రయాణికుల కోసం 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందిస్తున్నారు.

Kia Carens Clavis Sales

ఇది వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక, HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+ వంటి విభిన్న వేరియంట్‌లు అందుబాటులో ఉండటంతో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకునే సౌలభ్యం లభిస్తోంది. ఇంకా, ఇటీవల క్లావిస్ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను జోడించడం మరో కీలక అడుగు. ఎలక్ట్రిక్ కార్లకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త వేరియంట్ అమ్మకాలను మరింత వేగవంతం చేసే అవకాశముంది.

డీజిల్, పెట్రోల్ మోడళ్లతో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎంపిక కూడా ఉండటం వలన, కారెన్స్ క్లావిస్ సిరీస్ మరింత సమగ్రంగా మారింది. ఈ కారులో అత్యాధునిక ఇంటీరియర్ సదుపాయాలు ఉన్నాయి. 26.62-అంగుళాల పనోరమిక్ స్క్రీన్‌, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా,కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, రెండవ వరుస సీట్ల కోసం స్లైడింగ్ వంటివి దీనిలో ఉన్నాయి.

Kia Carens Clavis Ev

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2025, 11:14 [IST]
English summary
Kia carens clavis mpv june 2025 sales reported 7921 units more details inside
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+