ఫ్యామిలీకి బెస్ట్ కారు.. రూ.25 వేలు చెల్లిస్తే చాలు.. అదిరిపోయే కియా కారెన్స్ క్లావిస్ వచ్చేసింది
దక్షిణ కొరియాకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాప్ ఆటోమేకర్ కంపెనీలో స్థానం సంపాదించుకుంది. భారత వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా కియా కొత్తగా కారెన్స్ క్లావిస్ (carens clavis) కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పటికే దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉన్నటువంటి కారెన్స్ ఇప్పుడు కొత్త ఫీచర్స్, డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వచ్చింది. ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కంపెనీ గొప్ప గుడ్‌న్యూస్‌ను అందించింది. తాజాగా కారెన్స్ క్లావిస్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కారును కావాలనుకున్న వారు రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది.
దీని డిజైన్ చూసినట్లయితే, ముందు భాగంలో బ్రాండ్‌కు ప్రత్యేకమైన డిజిటల్ టైగర్ ఫేస్ కనిపిస్తుంది, దీనికి ఐస్ క్యూబ్ MFR LED హెడ్‌ల్యాంప్స్ కర్షణీయమైన LED DRLs తో కూడిన నూతన ఫేసియా జతవుతోంది. వెనుక భాగంలో స్టార్‌మ్యాప్ LED కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు కొత్త లుక్‌ను తీసుకొచ్చాయి. లోపల సీటింగ్, ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి.

మూడు వరుసల సీటింగ్ ఈ కారును ఫ్యామిలీ SUVగా మరింత స్పష్టంగా సూచిస్తుంది. రెండవ వరుస సీట్లు స్లైడ్ చేయగలిగేవి, మడతపెట్టగలిగేవిగా ఉండడంతో, దూర ప్రయాణాలు చేసే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా అనిపిస్తుంది. అంతేకాదు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ ఫంక్షన్ ద్వారా ప్రయాణికులు మూడవ వరుస సిట్లకు కూడా ఈజీగా ప్రవేశించవచ్చు. విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. కియా క్లావిస్ లోపలి భాగాన్ని చూస్తే, లగ్జరీ అనుభూతిని మరింత పెంచుతుంది.
లోపల 26.62-అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ దాని మెరుగైన ఇంటర్ఫేస్‌తో పాటు, డ్రైవర్, ప్రక్కను కూర్చున్న వారికి ఒకే స్క్రీన్ మీద రెండు విభిన్న అంశాలను చూడవచ్చు. ఇది కారెన్స్ మునుపటి మోడల్‌తో పోలిస్తే అదిరిపోయే టెక్నాలజీ అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ క్లావిస్‌ను అట్రాక్ట్ చేసే మరో అంశం. లోపల మెరుగైన వెలుతురు, సరిపడినంతా స్థలం ఉంటుంది.

దీనిలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అంశాలు ఉన్నాయి. కియా కారెన్స్ క్లావిస్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారులకు అవసరాల మేరకు నచ్చిన దానిని ఎంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇది 1.5-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, .5-లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా ఈ కారులో మెరుగైన అంశాలు అందించారు.
ఇది లెవల్ 2 ADAS(Advanced Driver Assistance Systems)తో కూడిన 20కి పైగా ఆటోనమస్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనంగా కారు చుట్టూ చూడటానికి పార్కింగ్, యు-టర్న్ వంటి పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండటానికి 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంది. ముందు వాహనాల లేదా ఆబ్జెక్ట్స్‌ను తాకే సమయంలో హెచ్చరించడానికి ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ (FCA), లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ వంటివి ఉన్నాయి.

కియా కారెన్స్ క్లావిస్ ఇప్పుడు 7 వేరియంట్లలో, HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+ లభిస్తుంది. కలర్స్ విషయానికి వస్తే స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్, ఐవరీ సిల్వర్ గ్లోస్, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








