మిడిల్ క్లాస్ కలల కారు.. తక్కువ ఖర్చులో ఒకటి కాదు, రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది.. సేల్స్‌లో దూసుకెళ్తోంది!
భారతదేశంలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందరు కలిసి ఒకే కారులో ఆడుతూ, పాడుతూ టూర్స్ లేదా ఇతర ప్రయాణాలకు వెళ్తుంటే ఆ ఎంజాయ్ వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే దేశంలో ఏడు సీట్ల వాహనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరలో లభిస్తూ, పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూర్చే కార్లు ప్రస్తుతం మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీకి చెందిన ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు దక్షిణ కొరియాకు కియా కంపెనీకి చెందిన కారెన్స్ (Kia Carens) కూడా ఇండియాలో కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. తాజాగా కియా నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కారెన్స్ అమ్మకాల వివరాలు వెల్లడయ్యాయి.
నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం 2024-25లో కియా మొత్తం 64,609 కియా కారెన్స్ కార్లను విక్రయించింది. కానీ దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో 2023-24లో ఈ సంఖ్య 63,167 మాత్రమే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కారుకు 2 శాతం అమ్మకాల వృద్ధి నమోదవడం విశేషం. ఇది కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా వినియోగదారుల మద్దతును కూడా స్పష్టంగా తెలియజేస్తుంది.

ఈ నేపథ్యంలో, టాప్ 10 ఏడు సీట్ల వాహనాల జాబితాలో 6వ స్థానాన్ని కియా కారెన్స్ ఆక్రయించింది. తొలి ఐదు స్థానాల్లో మారుతీ సుజుకీ ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవా (క్రిస్టా, హైక్రాస్ కలిపి), మహీంద్రా బొలెరో, XUV700 ఉన్నాయి. రానున్న రోజుల్లో కారెన్స్ కారు అమ్మకాల్లో మరింత పుంజుకుని టాప్ 5 కార్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పెద్ద ఎత్తున అంచనాలు వేస్తున్నారు.
మే 8న విడుదల కానున్న కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారణంగా దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్ డిజైన్, అదనపు సేఫ్టీ ప్రమాణాలతో, ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్‌తో కొత్త కారు మార్కెట్లోకి బాగా విజయవంతమైన మోడల్ అవుతుందని తెలుస్తుంది. కొత్త వెర్షన్ వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత మోడల్ అమ్మకాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. కొత్త, పాత మోడళ్ళ కలయిక ద్వారా అమ్మకాలు మరింత రెట్టింపు పెరుగుతాయి.

కియా కారెన్స్ భారతీయ మార్కెట్లో తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 2022లో ప్రారంభించింది. రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉన్నటువంటి ఈ ఎంపీవీ ప్రారంభంలోనే చాలా మందిని ఆకట్టుకుంది. ఆ తరువాత దీని డిమాండ్ క్రమంగా పెరగడం మొదలైంది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే 2 లక్షల కార్లు అమ్ముడవడం, ఒక కొత్త మోడల్‌కు ఇది సాధించదగిన గొప్ప మైలురాయిగా చెప్పాలి.
ఇప్పుడు ఈ మోడల్‌కు కొనసాగింపుగా కియా తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది అప్‌డేట్ చేసిన ఫీచర్లు, మరింత ప్రీమియం లుక్, సాంకేతికంగా కొత్త అనుభూతిని అందించబోతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కియా కారెన్స్ అమ్మకాలలో కీలకం కానుంది. హైదరాబాద్‌లో ఈ ఎంపీవీ ప్రారంభ ధర రూ.10.60 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.70 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








