మొత్తం ఫ్యామిలీ ట్రిప్స్‌కి నెంబర్ వన్ ఎంపిక.. 2 లక్షల ఇళ్లకు ఆనందాన్ని ఇచ్చిన 7 సీటర్ మోడల్
భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే దిగ్గజ వాహన తయారీదారుగా ఎదిగిన దక్షిణ కొరియా బ్రాండ్ కియో మోటార్స్ (Kia Motors) ఇక్కడి దేశీయ కంపెనీలకు బలమైన పోటీగా నిలుస్తూ, సేల్స్‌లో దూసుకుపోతుంది. ఒకవైపు సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేస్తూనే మరోవైపు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా మంచి అమ్మకాలను సాధిస్తుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మంది కలిసి ప్రయాణించే పెద్ద ఎంపీవీ కార్లను తీసుకొస్తూ కియో చాలా కాలంగా తన విజయపరంపరను కొనసాగిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టీగా (Ertiga) వంటి కాంపాక్ట్ ఎంపీవీలకు పోటీగా కియా గతంలో విడుదల చేసిన ప్రసిద్ధ మోడల్ కారెన్స్ (carens) ఎంపీవీ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చిన కారుగా అవతరించింది. కియా మోటార్స్ వెల్లడించిన దాని ప్రకారం, కారెన్స్ మోడల్ ఇప్పటి వరకు 2 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది.
దీని ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, ఇంటీరియర్‌లో విశాలమైన స్థలం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించడం కారణంగా మార్కెట్లోకి విడుదలైన మూడేళ్ల తరువాత కారెన్స్ ఎంపీవీ ఈ ఘనతను సాధించడం విశేషం. ఇది మారుతీ ఎర్టీగా, ఇన్నోవా వంటి మోడళ్ల నుంచి బలమైన పోటీని ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నింటిని తట్టుకునే ఏకంగా 2 లక్షల ఇళ్లకు కారెన్స్ చేరుకుంది. ఇది 7 సీటర్ ఆప్షన్‌లో పెద్ద కుటుంబానికి అత్యంత అనువుగా ఉంటుంది.

కియా కారెన్స్ కారు వేరియంట్‌లలో టాప్ ఎండ్‌ను చాలా మంది ఇష్టంగా కొనుగోలు చేశారు. మొత్తం ఈ మోడల్ నమోదు చేసిన అమ్మకాల్లో 24 శాతం వాటా టాప్ వేరియంట్ ఉంది. కరోనా తర్వాత కాలంలో కుటుంబ ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. సెలవుల సమయాల్లో మొత్తం ఫ్యామిలీతో కలిసి టూర్స్ వంటి వాటికి వెళ్లడానికి ఆసక్తి చూపించడం కారణం మార్కెట్లో ఎక్కువ సీటింగ్ కార్లకు డిమాండ్ పెరిగింది.
అయితే ఇదే సమయంలో కారెన్స్ మోడల్ వారిని అట్రాక్ట్ చేసింది. పైగా ఈ కారులో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం కారెన్స్ అమ్మకాల్లో కస్టమర్లు 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్ ఉన్న వేరియంట్‌లను ఎంచుకున్నారు. ఇక ఇంజిన్ల వారీగా చూసినట్లయితే పెట్రోల్ వేరియంట్లను కస్టమర్లు అధికంగా కొన్నారు. దీని వాటా దాదాపు 58 శాతంగా ఉంది. అదే డీజిల్ ఇంజిన్ల వాటా 42 శాతంగా ఉంది.

ఇక టాన్స్‌మిషన్ విషయానికి వస్తే, మొత్తం కస్టమర్లలో 32 శాతం మంది ఆటోమేటిక్ లేదా IMT వెర్షన్లను ఎంచుకున్నారు. కియా కారెన్స్ ఇండియాలో తన హవాను చూపించడం మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాగా ఆదరణ సంపాదించింది. ఈ కాలంలో మొత్తం 24,064 కారెన్స్ కార్లను కియా మోటార్స్ వాహనాలకు బాడా డిమాండ్ ఉన్న 70కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది.
మూడేళ్ల కాలంలో 2 లక్షల కుటుంబాలకు చేరిన కియా కారెన్స్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ. 10.60 లక్షల ప్రారంభ ధర నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.19.70 లక్షల వరకు కొనుగోలుకు లభిస్తుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్ ఉన్నాయి.

10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, మల్టీ-డ్రైవ్ మోడ్స్, వైర్‌లెస్ ఛార్జర్, ప్రయాణికుల రక్షణకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో ABS,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








