కంప్లీట్ ఫ్యామిలీ కార్! మీకు కావాల్సిన స్టైల్, కంఫర్ట్, స్పేస్.. పెద్ద కుటుంబంతో హాయిగా ట్రిప్‌కు వెళ్లచ్చు!
ఇండియాలో ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పెద్ద కుటుంబం అంతా కలిసి ఒకే కారులో హాయిగా వెళ్లడానికి ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్‌కు చెందిన కారెన్స్ (carens) బాగా ప్రసిద్ది చెందిన మోడల్. ఎంపీవీ (mpv) విభాగంలో ఇతర కంపెనీలకు చెందిన కార్లతో పోలిస్తే, ఆదరణ పరంగా ఒక మెట్టు పైనే ఉంటుంది. కియా సోనెట్, సెల్టోస్ ఎస్‌యూవీల మాదిరిగానే ఇంండియాలో కారెన్స్ మోడల్ అమ్మకాల పరంగా దూసుకెళ్తుంది. దీనికి ప్రజల నుంచి ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం దాని ఆకట్టుకునే డిజైన్, బడ్జెట్ ధర, మంచి మైలేజ్, ప్రీమియం ఫీచర్లు కలిగి ఉండటం.
అందుకే ఇటీవల కంపెనీ విడుదల చేసిన సేల్స్ డేటా ప్రకారం, కారెన్స్ కొద్ది రోజుల క్రితం 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటడం విశేషం. ఇదిలా ఉంటే కారెన్స్‌కు వస్తున్న డిమాండ్‌ను గమనించిన కియా త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త దానిలో మరిన్ని అదిరిపోయే ఫీచర్స్‌ను అందించడంతో పాటు, ఇది కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇవ్వనుంది.

ప్రస్తుతం భారత రోడ్లపై కియా కారెన్స్ MPV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరీక్షిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. కస్టమర్లు ఈ మోడల్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీనిని బట్టి కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తున్న కొత్త కారు వచ్చే నెలలో అనగా ఏప్రిల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండనప్పటికి ఫీచర్స్‌ను మాత్రం మరింత అడ్వాన్స్‌డ్ వాటిని అందిస్తున్నారు. 2-టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతాయి. పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా కొత్త అనుభూతి కలుగుతుంది. సేఫ్టీ కోసం చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లెవెల్ 2 ABS మొదలగు లేటెస్ట్ సదుపాయాలు ఈ కారులో ఉండబోతున్నాయి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న కారెన్స్ ఇంజిన్ ఆప్షన్లే దీనిలో కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం మోడల్ విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో రన్ అవుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డీసీటీ, ఆటోమేటిక్ టార్క్ కన్వర్ట్‌తో సహా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఎంపీవీ 6-సీటర్,7-సీటర్‌లలో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం దేశీయంగా కియా కారెన్స్ ప్రారంభ ధర రూ.10.60 లక్షల నుండి మొదలై, టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి రూ.19.70 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. ఈ కారుపై పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి ఇది న్యాయం చేస్తుంది. అందుకే భారతీయులు దీన్ని తెగ కొంటున్నారు. నెలకు ఈ మోడల్‌ను దాదాపు 5,000 నుంచి 6000 మంది కొంటున్నారు.

అందుబాటులో ఉన్న కారెన్స్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ABS,బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్ (BAS),టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








