ఈ కారును కేవలం 62 మంది మాత్రమే కొన్నారు! అంతా బాగానే ఉన్నప్పుడు ఎందుకు ఈ తక్కువ సేల్స్?

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కియా కార్నివాల్ (carnival) కారుకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. లగ్జరీ టచ్‌తో పాటు పెద్ద కుటుంబాలకు అనువైన ఈ కారుకు ఎప్పటినుంచో ఒక స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే జూలై 2025 అమ్మకాల గణాంకాలు చూసినప్పుడు కొంత ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కంపెనీ తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం, జూలై నెలలో కేవలం 62 యూనిట్ల కియా కార్నివాల్ మాత్రమే అమ్ముడైంది. ఇది చూసినప్పుడు కొంత నిరాశ కలిగించినా, గత నెల జూన్‌తో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య కొంచెం మెరుగైనదే అని చెప్పాలి. జూన్ నెలలో కేవలం 47 యూనిట్ల కార్నివాల్ మాత్రమే అమ్ముడైంది.

అంటే జూలైలో 62 యూనిట్లు రికార్డ్ కావడంతో గత నెలతో పోలిస్తే కొంత వృద్ధి కనిపించినా, మొత్తానికి ఈ కారుకు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు. ధర, దాని సెగ్మెంట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఇది ఒక ప్రీమియం కారు. అలాంటి కేటగిరీలో వందల సంఖ్యలో సేల్స్ రాకపోవడం సహజమే అయినా, ఒక్కోసారి అమ్మకాలు ఒక్క అంకెల వృద్ధితో మాత్రమే కొనసాగుతుండటం మార్కెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Kia Carnival Luxury Mpv July 2025 Sales Recorded Only 62 Units

ప్రస్తుతానికి కస్టమర్లు ఎక్కువగా బడ్జెట్ SUVలు, కాంపాక్ట్ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లడం కూడా కార్నివాల్ సేల్స్‌పై ప్రభావం చూపుతున్న అంశం. అయినా, కియా కార్నివాల్ తన లగ్జరీ ఇంటీరియర్, విశాలమైన కేబిన్ స్పేస్, సౌకర్యవంతమైన ఫీచర్ల వల్ల కొన్ని ప్రత్యేకమైన కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది. రాబోయే నెలల్లో కొత్త అప్‌డేట్‌లు, ఆఫర్లు ఉంటే ఈ కారుకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

గత మూడు నెలలుగా కార్నివాల్ అమ్మకాలు రెండంకెలలోనే పడిపోతున్నాయి. ఫిబ్రవరి 2025లో ఈ కారును మొత్తం 239 మంది కొనుగోలు చేయగా, మార్చిలో ఈ సంఖ్య 230 యూనిట్లకు చేరింది. ఏప్రిల్‌లో కొంత తగ్గుదలతో 161 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే, అసలు షాక్ మే నెలలో వచ్చింది. ఆ నెలలో కార్నివాల్ అమ్మకాలు ఒక్కసారిగా కేవలం 44 యూనిట్లకు పడిపోయాయి.

Kia Carnival Luxury Mpv July 2025 Sales Recorded Only 62 Units

జూన్‌లో కూడా పెద్ద మార్పు లేకుండా 47 యూనిట్లు మాత్రమే రికార్డ్ కాగా, జూలైలో మాత్రం కొంత మెరుగై 62 యూనిట్ల వరకు చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ఒకప్పుడు స్థిరమైన డిమాండ్ ఉన్న కార్నివాల్, ఇప్పుడు స్థాయిగా తగ్గుతూ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమ నిపుణులు చెబుతున్నదేమిటంటే, కార్నివాల్ ఒక ప్రీమియం MPV కావడం, దాని అధిక ధర దాని అమ్మకాలపై నేరుగా ప్రభావం చూపుతోందని.

అయినా, ఆటోమొబైల్ మార్కెట్లో సీజనల్ డిమాండ్ అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ, కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు, అప్‌డేట్‌లు వస్తే కార్నివాల్ అమ్మకాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. లగ్జరీ ఇంటీరియర్, విశాలమైన స్పేస్, ప్రీమియం కంఫర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో కొంతమంది కస్టమర్లను ఆకర్షిస్తున్నా, దాని అధిక ధర కారణంగా సేల్స్ సాధించడంలో వెనుకబడి పోతోందని చెప్పాలి.

Kia Carnival Luxury Mpv July 2025 Sales Recorded Only 62 Units

ఈ కారు 2.2-లీటర్ ఇన్‌లైన్ 4-సిలిండర్ e-VGT CRDi ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 193 PS పవర్, 441 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇది లీటరుకు 14.85 కి.మీ మైలేజీని ఇవ్వగలదు. ప్రస్తుతం దీని ధర వచ్చేసి రూ.63.91 లక్షల నుంచి ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 20, 2025, 12:30 [IST]
English summary
Kia carnival luxury mpv july 2025 sales recorded only 62 units more details inside
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+