చిన్న ఉద్యోగాలు చేసేవారి కోసం ఎలక్ట్రిక్ కారు! 500km రేంజ్.. చిన్న ఫ్యామిలీలకు సరిగ్గా సెట్ అవుద్ది!

ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరుగుతున్నా, సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండే చిన్న EVల కొరత ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధికి అడ్డంకిగా నిలుస్తోంది. పెద్ద SUVలు, క్రాసోవర్‌లు, ప్రీమియం సెగ్మెంట్ EVలు ఎక్కువగా లభిస్తుండటంతో, బడ్జెట్‌ ఫ్రెండ్లీ చిన్న కార్లను కోరుకునే కొనుగోలుదారులకు ఎంపికలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలోనే దక్షిణ కొరియా దిగ్గజం కియా చిన్న, కానీ శక్తివంతమైన కొత్త ఎలక్ట్రిక్ కారును సిద్ధం చేస్తోంది.. అదే కియా ఈవీ2 (Kia EV2). ఈ ఏడాది జరిగిన ప్రత్యేకమైన కియా EV డే కార్యక్రమంలో కంపెనీ ఈ మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. బయటకు చిన్నగా కనిపించినా, డిజైన్ స్టాన్స్ మాత్రం పూర్తిగా futuristic-EV2ను చిన్నతనంతో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కు కావాల్సిన ఆధునిక టెక్నాలజీ సూటిగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు, EV2ను టెస్ట్ రన్స్ చేస్తూ రోడ్-రెడీనెస్, డ్రైవింగ్ స్టెబిలిటీ, రేంజ్ పనితీరును పరిశీలిస్తున్నారు. ప్రొడక్షన్‌కి సిద్ధమవుతున్న ఈ వెర్షన్‌ గతంలో చూపిన కాన్సెప్ట్ EV2కి చాలా దగ్గరగా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా, ఇది కియా ఆధునిక E-GMP ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడటం ఆకర్షణ. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న EV6, EV9 లాంటి పెద్ద మోడళ్లతో పాటు EV2 కూడా అద్భుత పనితీరును అందించగలదని అంచనాలు ఉన్నాయి.

Kia Ev2 Small Electric Suv To Make World Premiere In January 2026

రేంజ్ విషయానికి వస్తే, ఒకే ఛార్జ్‌పై 450-500 కిలోమీటర్ల పరిధిని అందించగలదన్న అంచనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇది చిన్న కార్ సెగ్మెంట్‌కు గణనీయమైన బలం. అంతేకాకుండా, ఆధునిక ఫాస్ట్-చార్జింగ్ టెక్నాలజీతో ఇది సుమారు 18 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుందని సమాచారమొస్తోంది. ఈ వేగం ఇప్పటి వరకు భారత మార్కెట్లో ఉన్న చిన్న EVల్లో దాదాపు కనిపించని స్పెసిఫికేషన్.

గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని, ఈ మోడల్‌ను జనవరి 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కంపెనీ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఆసక్తిని మరింత పెంచుతూ, కొరియన్ ఆటోమేకర్ ఇటీవల EV2 అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. సింపుల్‌గా, కానీ ఫ్యూచరిస్టిక్ షాడోస్‌తో చూపించిన ఈ టీజర్ చూసిన క్షణానికే ఈ మోడల్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తన ప్రపంచవ్యాప్త అరంగేట్రాన్ని బ్రస్సెల్స్ మోటార్ షోలో చేయబోతోంది.

Kia Ev2 Small Electric Suv To Make World Premiere In January 2026

జనవరి 9, 2026 నుంచి ప్రారంభమయ్యే ఈ మోటార్ షో యూరప్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటో ఎగ్జిబిషన్‌లలో ఒకటి. ఈ అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం ద్వారా EV2పై కియా పెట్టుకున్న నమ్మకం, దాని గ్లోబల్ పొటెన్షియల్ రెండూ స్పష్టమవుతున్నాయి. కియా EV2 చిన్న కార్ అయినప్పటికీ, అందించే ఫీచర్లు మాత్రం పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్‌ స్థాయిలో ఉండబోతున్నాయని తాజా సమాచారంతో స్పష్టమవుతోంది.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్‌లో ఇంటీరియర్ స్పేస్‌ను అత్యంత వినియోగించే డిజైన్ ఉంటుంది. ప్రత్యేకంగా, వెనుక భాగంలో ఇచ్చే మడతపెట్టగల రెండవ వరుస సీట్లు పెద్ద ప్లస్ పాయింట్. ఇవి అవసరాన్ని బట్టి కార్గో స్పేస్‌ను గణనీయంగా పెంచి, చిన్న కుటుంబాల కోసం ఈ EVను మరింత ప్రయోజనకరంగా మారుస్తాయి. చిన్న కార్ అయినా పెద్ద కార్ల సౌకర్యం ఇవ్వడం EV2 లక్ష్యం అని చెప్పొచ్చు.

Kia Ev2 Small Electric Suv To Make World Premiere In January 2026

కేవలం స్థలం మాత్రమే కాదు, భద్రతా ఫీచర్లలో కూడా కియా ఎలాంటి రాజీ పడలేదని కనిపిస్తుంది. EV2లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి స్మార్ట్ సిస్టమ్‌లు లభిస్తాయి. ఇవి సాధారణంగా ఉన్నత స్థాయి కార్లలో మాత్రమే కనిపించే టెక్నాలజీలు. ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా అంచనా వేసి డ్రైవర్‌కు సహాయం చేసే ఈ వ్యవస్థలు ప్రయాణాన్ని మరింత సురక్షితం, సరళం చేస్తాయి.

ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును అనంతపురం ప్లాంట్‌లోనే స్థానికంగా ఉత్పత్తి చేసే అవకాశం బలంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లాంచ్ విషయానికి వస్తే, అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు కానీ చిన్న ఉద్యోగస్తులు కొనే ధరలో 2026 చివరి నాటికి EV2 భారత రోడ్లపైకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కియా ఇప్పటికే EV2 పేరు, సంబంధిత అంశాలకు ట్రేడ్‌మార్క్ ఫైలింగ్ చేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, December 4, 2025, 14:54 [IST]
English summary
Kia ev2 small electric suv to make world premiere in january 2026
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+