ఇక పాత కార్లన్నీ తుక్కు కిందకే.. ఫోన్ కంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది.. అదిరే ఫీచర్లతో దుమ్ములేపనుంది
కియా కార్లు అంటేనే అదిరిపోయే ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. కార్నివాల్ తర్వాత కియా ఇండియాలో విడుదల చేసిన మరో సంచలనం ఈ కియా EV9 ఎలక్ట్రిక్ SUV. దాదాపు రూ. 1.30 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన ఈ భారీ కారు చాలా మంది కళ్లలో మెదలుతుంది అనడంలో సందేహం లేదు.
బ్లాంక్-ఆఫ్ డిజైన్, లైట్-ఇన్ఫ్యూజ్డ్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్‌తో ముందు భాగం చూడగానే ఆకట్టుకుంటుంది. నిలువుగా అమర్చిన హెడ్‌లైట్లు, మధ్యలో వెళ్లే ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు ఎవరినైనా సరే చూడగానే లవ్‌లో పడేలా చేస్తాయి. ఈ మోడల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈ కారు ముందు బంపర్ దిగువ భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, దాని కింద ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌కి వస్తే కొరియన్ కార్ల తయారీదారులు దీన్ని కూడా చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఫెండర్‌లు, వీల్ ఆర్చీల షార్ప్ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ సెక్షన్ చాలా నీట్‌గా ఉన్నాయి. దీనికి పెద్ద 20-ఇంచుల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ తోడవ్వడంతో లుక్ అదిరిపోతుంది.
ఇంటీరియర్‌లో 12.3-ఇంచుల డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలు పక్కపక్కనే ఉన్నాయి. HVAC కంట్రోల్స్ కోసం 5 ఇంచుల స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 14-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ కీ, యూఎస్‌బి-సి పోర్ట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, OTA అప్‌డేట్‌లు, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు వంటి సూపర్ ఫీచర్లు ఈ కియా EV9లో ఉన్నాయి.

కియా EV9 కారు రెండవ వరుసలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. కావలసినంత స్పేస్ ఉండటంతో వెనుక కూర్చునేవారికి కూడా చాలా స్పేసియస్‌గా, సౌకర్యంగా ఉంటుంది. మూడవ వరుస సీట్లు కూడా రిక్లైనింగ్ ఫంక్షన్‌ను కలిగి ఉండటంతో పెద్దవాళ్లు కూడా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు.
ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఇది చాలా పెద్దది. ఈ ఎలక్ట్రిక్ SUV 5,015 మిమీ పొడవు, 1,980 మిమీ వెడల్పు, 1,780 మిమీ ఎత్తు, 3,100 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బరువు ఏకంగా 2,664 కిలోలు అని కంపెనీ చెబుతోంది. ఈ భారీ ఎలక్ట్రిక్ వాహనానికి 99.8kWh బ్యాటరీ ప్యాక్ పవర్ ఇస్తుంది.

ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ARAI ప్రకారం 561 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను గరిష్టంగా 350kW ఛార్జింగ్ వేగంతో చార్జ్ చేయవచ్చు. DC ఛార్జర్ ద్వారా కియా EV9 బ్యాటరీని కేవలం 24 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు నింపవచ్చు. అంటే ఒక టీ బ్రేక్ తీసుకునే టైమ్‌లో కారు ఛార్జ్ అయిపోతుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కార్లను కూడా వెనక్కి నెట్టేస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు 384 bhp పవర్‌ను, 700 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.3 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








