కారు కొనాలా? దీపావళికి రూ.1.6 లక్షల తగ్గింపు ఉంది.. డిమాండ్ పెరగకముందే ఆ కంపెనీ షోరూమ్‌లకు క్యూ కట్టండి
భారతదేశంలో దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం లేదా పండుగ జరుపుకోవడం మాత్రమే కాదు, కొత్త ఆరంభాలకు సంకేతం కూడా. ప్రతి సంవత్సరం ఈ సమయంలో వాహనాల మార్కెట్‌లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయులు దీపావళి రోజున కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో కార్ల షోరూమ్‌లు కొత్త కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి శుభ సమయాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, కియా ఇండియా ఈసారి తన పాపులర్ ICE కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి స్పెషల్ సీజన్ ఆఫర్‌గా కియా సంస్థ రూ.1.6 లక్షల వరకు డిస్కౌంట్‌లు ఇస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యధిక బెనిఫిట్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.
కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది బంగారు అవకాశం. ముఖ్యంగా, ఇటీవల జరిగిన GST సంస్కరణల కారణంగా అనేక మోడళ్ల ధరలు తగ్గిన నేపథ్యంలో, ఈ డిస్కౌంట్‌లు మరింత ప్రయోజనకరంగా మారాయి. కొన్ని వాహనాలపై రూ.45,000 వరకు బెనిఫిట్ లభిస్తుండగా, మరికొన్ని హయ్యర్ వేరియంట్ మోడళ్లపై రూ.1.15 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ పండుగ ఆఫర్‌లో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు, లాయల్టీ ఆఫర్‌లు ఉన్నాయి.

కియా సోనెట్: ఈ కారుపై రూ.1.03 లక్షల వరకు పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 7.30 లక్షల నుండి రూ.14.09 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది మంచి డిజైన్‌ను కలిగి ఉంది. 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. 24 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇది 5 సీట్లకు సరిపోతుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
కియా సెల్టోస్: పండుగ సమయంలో ఈ కారుపై రూ.1.47 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. దీని ధర రూ.10.79 లక్షల నుండి రూ.19.81 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, 21 kmpl వరకు అందిస్తుంది. దీనికి 5-సీట్ల ఎంపిక ఉంది. మిడియం బడ్జెట్‌లో కావాలనుకునే వారికి బెస్ట్.

కియా సిట్రోయెన్: ఈ SUV పై రూ.1,60,400 వరకు ప్రయోజనాలు అందించబడుతున్నాయి. బేస్ వేరియంట్ ధర రూ.8.67 లక్షలు. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.15.94 లక్షలు. సిట్రోయెన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 118 bhp, 172 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 114 bhp, 250 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 17.65 kmpl నుండి 20.75 kmpl మైలేజీని ఇస్తుంది.
కియా కారెన్స్: ఈ MPV రూ. 83,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. దీని ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 12.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 12.6 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇది 7 సీట్ల కారు. పెద్ద కుటుంబం గల వారు దీనిని హాయిగా కొనచ్చు.

కియా కారెన్స్ క్లావిస్: కియా కారెన్స్ క్లావిస్ MPVపై రూ. 1.42 లక్షల వరకు పండుగ ఆఫర్లు ఉన్నాయి. మార్కెట్లో దీని కనీస ధర రూ. 11.08 లక్షలు. అదే గరిష్ట ధర రూ. 20.71 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్,1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 20 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








