లక్ష మంది ఈ కారును కొన్నారు.. ఇంతమంది ఎంచుకున్నారంటే దీనిలో అంత స్పెషల్ ఏముంది?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia motors) ఇండియాలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అమ్మకాల పరంగా ప్రతి ఏడాది కూడా దూసుకుపోతుంది. తాజాగా కియా ఇండియా 2025 ఆర్థిక సంవత్సరానికి తన సేల్స్ గణాంకాలను వెల్లడించింది. దాని ప్రకారం, కియా సోనెట్ (sonet) మోడల్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. డేటాను చూసినట్లయితే సోనెట్ కారు 2025 ఆర్థిక సంవత్సరంలో 99,805 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23 శాతం అమ్మకాల వృద్ధిని కూడా సూచిస్తోంది. ఈ కాంపాక్ట్ SUV మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుంచి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉంది.

ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, నమ్మకమైన పనితీరు వంటి అంశాలు ఈ విజయానికి బలమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. కియా సోనెట్ ఇప్పుడు భారతీయులకు ఇష్టమైన మోడల్‌గా మారిపోయింది. కియా ఇండియా అమ్మకాల్లో సెల్టోస్, కారెన్స్, సైరోస్ వంటి మోడళ్లు కూడా మెరుగైన గణంకాలను నమోదు చేశాయి. కియా సెల్టోస్ అమ్మకాల పరంగా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది 72,618 యూనిట్లు విక్రయించగా, గత సంవత్సరం కంటే 28 శాతం తక్కువ.

kia India Sales

అమ్మకాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ, సెల్టోస్ ఇప్పటికీ కియాకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్నది. బ్రాండ్‌కు గట్టి స్థంభంలా నిలిచినట్లు తెలుస్తుంది. ఇక దీని తరువాత మూడవ స్థానంలో కారెన్స్ నిలిచింది. మొత్తంగా 64,609 కార్ల అమ్మకాలతో ఇది గత ఏడాదితో పోల్చితే 2 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఇది ఒక లైట్ ఎంపీవీ మోడల్. కుటుంబ ప్రయాణికులకు బాగా అనువుగా ఉంటుంది. లాంగ్ జర్నీలు చేయడానికి సౌకర్యంగా అనిపిస్తుంది.

నాల్గవ స్థానంలో కియా సిరోస్ నిలిచింది. ఈ కారు 15,986 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువ సంఖ్యలో అమ్ముడైనా, కూడా తన గణంకాలను స్థిరంగా ఉంచుకుంది. కార్నివాల్ విషయానికి వస్తే, ఈ మోడల్ మొత్తం 1,361 యూనిట్ల అమ్మకంతో ఐదవ స్థానాన్ని పొందింది. ఇతర మోడళ్లతో పోలిస్తే అమ్మకాలు తక్కువగా ఉన్నా, కార్నివాల్‌కి కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నట్లు తెలుస్తుంది.

Kia Syros

ఈ లగ్జరీ MPV మోడల్‌కి ఉన్న ప్రత్యేకత, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ప్రీమియం ఫీచర్స్ వల్ల ఇది భారతీయ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది. తరువాత EV6 మోడల్ 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 810 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఆరో స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం కంటే 23 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇది దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తుంది.

అదిరిపోయే టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌ వంటి అంశాలు EV6 విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కేవలం 18 యూనిట్ల అమ్మకాలతో EV9 మోడల్ ఏడవ స్థానానికి పరిమితమైంది. కియా ఇండియా అందించే మోడళ్లలో కొన్ని అమ్మకాల్లో కాస్త తగ్గుదలని ఎదుర్కొన్నప్పటికీ, మరికొన్ని మోడళ్లకు మంచి డిమాండ్ ఉండగా, కొన్ని మరింత వృద్ధిని సాధించాయి. ఇది కియా మార్కెట్‌లో బలంగా నిలబడేందుకు బలమైన బేస్‌గా మారింది.

kia India Financial Year 2025 Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 24, 2025, 7:30 [IST]
English summary
Kia india financial year 2025 sales report sonet has top in the list
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+