జనాలకు బాగా నచ్చుతున్న ఆ కంపెనీ కార్లు.. ఒక్క నెలలోనే 22 వేల మంది ఎగబడ్డారు
ఇటీవల జూలై నెల ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు వరుసగా తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణకొరియాలో పుట్టి ఇండియాలో సత్తా చాటుతున్న దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. గణంకాల ప్రకారం, భారత మార్కెట్‌లో ప్రీమియం కార్ల విభాగంలో కియా ఇండియా తన స్థిరమైన ప్రదర్శనతో మరోసారి తన ప్రభావాన్ని చాటింది. జూలై 2025లో కంపెనీ 22,135 యూనిట్ల విక్రయాలతో మంచి గణాంకాలు నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 20,507 యూనిట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధిగా నిలిచింది. ఈ సంఖ్యలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
కేవలం ఒక్క నెల ప్రదర్శనతోనే కాదు, ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కియా మంచి ఊపుతెచ్చుకుంది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ 1,63,439 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1,46,644 యూనిట్లతో పోలిస్తే 11.45 శాతం వృద్ధిని సూచిస్తోంది. అంటే, మారుతున్న ఆర్ధిక పరిస్థితులు, పెరుగుతున్న పోటీ మధ్య కూడా కియా తన మార్కెట్ పరంగా మంచి స్థానం కొనసాగిస్తోంది.

ఈ వృద్ధికి వెనుక ఉన్న ప్రధాన కారణాలు.. ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, అధునాతన ఫీచర్లు, కస్టమర్ ఫోకస్‌డ్ ఆఫ్టర్ సేల్స్ సేవలు. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో కియా తీసుకొచ్చిన మోడళ్లకు మంచి స్పందన రావడం, బ్రాండ్ విలువ పెరగడం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గణాంకాలు చూస్తే, కియా ప్రీమియం కార్ల విభాగంలో తన సేల్స్‌ను మున్ముందు ఇంకా వేగంగా కొనసాగించే అవకాశం ఉంది.
కియా ఇండియా సక్సెస్ ప్రయాణంలో తాజాగా అడుగుపెట్టిన రెండు కీలక మోడళ్లు.. కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ EV మార్కెట్‌లో మంచి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెండు వాహనాలు, కంపెనీకి కొత్త ఊపు తెచ్చిపెట్టడమే కాకుండా, కస్టమర్లలోనూ విశేష ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకుని రూపొందించిన ఈ మోడళ్లు, కియా బ్రాండ్‌ను మరింత ఎక్కువ స్థాయిలో ప్రజలకు చేరువ అయ్యాయి.

ఇంధన ఆధారిత వాహనాలను విక్రయిస్తూనే ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్లో సేల్ చేయడం కంపెనీకి బాగా కలిసివచ్చింది. దేశీయ మార్కెట్లో విజయం సాధించడం మాత్రమే కాక, కియా ఇండియా జూలై 2025లో 2,590 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా అంతర్జాతీయ విస్తరణ కూడా చేస్తుంది. భారత్‌లో తయారైన కార్లను ఇతర దేశాలకు సరఫరా చేయడం ద్వారా, గ్లోబల్ మార్కెట్‌లో భారత తయారీకి నాణ్యతా గుర్తింపును మరింత బలోపేతం చేస్తోంది.
కియా మోటార్స్ భారతదేశంలోని తన ప్రయాణాన్నిమొదలుపెట్టడానికి, 2017 ఏప్రిల్‌లో ఒక కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, అనంతపురం జిల్లాలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసి ఆగస్టు 2019లో తన భారీ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే ఇది అత్యాధునిక సాంకేతికతతో, నాణ్యత ప్రమాణాలతో పని చేసే ప్లాంటుగా నిలిచింది.



Click it and Unblock the Notifications








