అమ్మకాల్లో దుమ్ములేపిన కియా.. 6 నెలల్లో లక్షల సేల్స్.. మేడ్ ఇన్ ఇండియా కార్లకు ఫుల్ డిమాండ్!
దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. 2025 ఏడాది ప్రారంభం నుంచి మొదలుకుని జూన్ వరకు మొత్తంగా ఆరు నెలల కాలంలో కంపెనీ మొత్తం 1,42,139 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో చూస్తే బలమైన వృద్ధి అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే సమయంలో 1,26,137 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 12.7 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ అమ్మకాలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. మన దేశంలో తయారైన కియా కార్లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. 2025 మొదటి అర్ధభాగంలోనే కంపెనీ 11,813 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.
ప్రపంచ మార్కెట్లలో కూడా కియా మేడ్ ఇన్ ఇండియా కార్లకు ఏవిధమైన ఆదరణ కొనసాగుతుందో ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి. ఇది కియా గ్లోబల్ విస్తరణకు సుస్థిర బలం చేకూరుస్తూ, భారత ఉత్పత్తులపై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేస్తోంది. కంపెనీ తన వాహన పోర్ట్‌ఫోలియోను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విస్తరిస్తూ, మార్కెట్ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చడంలో ముందంజలో ఉంది. కాబట్టే, ప్రతి అర్ధసంవత్సరంలోనూ బలమైన విక్రయాలను సాధిస్తోంది.

భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కియా మొత్తం ఎనిమిది వేరు వేరు వాహనాలను పరిచయం చేసింది. వీటిలో సెల్టోస్, సైరస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్ వంటి లోకల్-ఫేవరెట్ మోడళ్లతో పాటు,EV6, EV9 వంటి ఎలక్ట్రిక్ వేరియంట్లు, కొత్తగా ప్రారంభమైన కారెన్స్ క్లావిస్ ఉన్నాయి. ప్రతి మోడల్‌కి తన ప్రత్యేకత ఉండటంతో, విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చగలగడం కియాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఇంకా, కియా ఇండియాలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ఉత్పత్తి కేంద్రం నుంచి ఇప్పటివరకు దాదాపు 15 లక్షల వాహనాలను డెలివరీ చేసి, తన స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఇది కియాకు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విశేషమైన విజయంగా నిలిచింది. వీటిలో 12 లక్షల (1.2 మిలియన్) వాహనాలు దేశీయంగా అమ్ముడవగా, 3.67 లక్షలకు పైగా వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

ఈ గణాంకాలు కియా బ్రాండ్‌కు ఉన్న విస్తృత ఆదరణను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 4.5 లక్షలకు పైగా కార్లు విజయవంతంగా ఉపయోగంలో ఉండటంతో, కియా కార్ విభాగంలోనూ అగ్రగామిగా ఎదిగింది. కియా మోటార్స్ 329 నగరాల్లో 744 టచ్ పాయింట్ల విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని, వినియోగదారులకి సులభమైన సేవలను అందిస్తోంది. రాబోయే కాలంలో కియా ఇండియా మరింత విస్తరించి, డిమాండ్‌ను పెంచుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇంకా, ఇటీవల ప్రారంభించబడిన కారెన్స్ క్లావిస్ MPV కియాకు మరింత బలాన్ని చేకూర్చింది. అధునాతన భద్రతా ఫీచర్లు, రాజీలేని సౌకర్యం, విస్తారమైన ఇంటీరియర్ స్థలం ఇవన్నీ ఈ MPVను కుటుంబ వినియోగదారుల వద్ద అత్యంత ఇష్టమైన కారుగా మార్చాయి. ప్రీమియం క్వాలిటీతో కూడిన డిజైన్‌కి తోడు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి స్మార్ట్ టెక్నాలజీలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








