2024లో కస్టమర్స్‌తో "మైనే ప్యార్ కియా" అనిపించిన కంపెనీ!.. ఇక 2025లో మామూలుగా ఉండదు!
కియా ఇండియా... ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనదైన బ్రాండ్‌ను సృష్టించుకున్న దిగ్గజ సంస్థ. మాస్- ప్రీమియం వెహికిల్స్‌లో తన మార్క్ స్టైల్‌ని చూపెట్టి సేల్స్‌లో దూసుకెళ్తుంది. 2024లోనూ ఈ సంస్థ తన జోరుని ప్రదర్శించింది. మునుపెన్నడూ లేనంతగా ఈ ఒక్క ఏడాదిలోనే.. 2,50,038 వాహనాలను విక్రయించింది సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇది అంతకుముందు సంవత్సరం 2023తో పోలిస్తే 6 శాతం అధికం కావడం గమనార్హం. 2023లో ఈ సంస్థ 2,40,919 యూనిట్లను మాత్రమే సేల్ చేసింది. ఇంతకీ ఈ కొత్త సంవత్సరంలో కియా ప్లాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు ఏ ఏడాదిలోనూ కియా సంస్థ 2024 స్థాయిలో సేల్స్‌లో రాబట్టలేదు. ఈ 2025లో కూడా.. అమ్మకాలతో తన సత్తా చూపెట్టి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 2025లో కియా సంస్థ ప్రధానంగా టైర్-2, టైర్-3 సిటీల్లో తమ అమ్మకాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్‌పై పూర్తిగా దృష్టిసారించింది.

2025లోనూ సేల్స్ సాధించడంపై ఆ సంస్థ స్పందించింది. భారత్‌లో ప్రతి మూలలో ఉన్న వినియోగదారులకు చేరేందుకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. 2024లో మా సంస్థ నుంచి 126 కొత్త డీలర్ షిప్స్, 36 సర్టిఫైడ్ ప్రి- ఓన్డ్(CPO)లను తెరిచాము. దేశవ్యాప్తంగా మా సంస్థ 301 నగరాల్లో 700 టచ్‌పాయింట్స్‌కు విస్తరించామని వివరించింది.
కియా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించిన మోడల్ కియో సోనెట్. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సంస్థ తమ కార్ల అమ్మకాలతో.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఎస్‌యూవీ ఇప్పటివరకు 1,02,337 యూనిట్లను సేల్ చేసింది. సోనెట్‌తో దక్కిన పాపులారిటీతో.. తమ కొత్త మోడళ్లైన సెల్టోస్ (Seltos), కారెన్స్ (Carens) మోడళ్ల అమ్మకాలతోనూ మార్కెట్లో హీటు పెంచింది.

అంతేగాకుండా.. తమ సంస్థ నుంచి లగ్జరీ కారు అయిన Kia Carnival Limousine తో మార్కెట్లో కొత్త బెంచ్ మార్క్‌ని సృష్టించింది కియా సంస్థ. ఈ కారు విడుదలైన రెండు నెలల్లోనే ఏకంగా.. 563 యూనిట్లను అమ్మింది. అలానే విదేశాల్లోనూ కియా ఇండియా తన జోరు చూపెట్టింది. 2024లో ఈ సంస్థ నుంచి 25,404 యూనిట్ల కార్లను ఈ సంస్థ ఎగుమతి చేసింది.
విదేశాల్లోనూ కియా బ్రాండ్‌కు ఉన్న వ్యాల్యూ ఏంటో చెబుతోంది. 2024 సంవత్సరం తమకు కీలకమైన సంవత్సరమని కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాధిపతి అయిన హర్‌దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు. సమయానికి వాహనాలను డెలివరీ చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. వినియోగదారులకు నచ్చిన కియా మోడళ్లను వారికి అందించేందుకు తాము కట్టుబడి పని చేస్తున్నామని అన్నారు.

తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని, భవిష్యత్‌లో అమ్మకాల్లో వృద్ధి సాధించడం కోసం దేశవ్యాప్తంగా టచ్‌పాయింట్లను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. తక్షణ లాభాలను సాధించడం తమ వ్యూహం కాదని, భారత్‌లో మా ఉనికిని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. తమ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లను పరిచయం చేసి, మా రికార్డులను కొనసాగిస్తామని ఆయన అన్నారు.
"2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో మేం చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాం. ఈ ఏడాది మా సంస్థ నుంచి కొత్త సైరస్ మోడల్‌ను డెలివరీలు చేయనుంది. ఇది కచ్చితంగా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన కంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. అంతేగాకుండా మార్కెట్‌లో లీడర్‌షిప్ స్థానాన్ని మాకు అందిస్తుంది" అని హర్‌దీప్ సింగ్ బ్రార్ చెప్పారు. 2025లో ఇక కియా ఏం మ్యాజిక్ చేస్తుందో? చూద్దాం.


Click it and Unblock the Notifications








