60 రోజుల్లో 15,000 మంది కొన్న కారు.. 20 కి.మీ మైలేజ్.. ఇకపై దీన్ని కొనాలంటే మీకు ధైర్యం కావాలి!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) సోనెట్, సెల్టోస్ వంటి పలు మోడళ్లతో పాటు ప్రసిద్ధ సిరోస్ (syros)ను కూడా విక్రయిస్తుంది. తాజాగా విడుదల చేసిన సిరోస్ SUV మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతుంది. గత ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉండగా, బాక్సీ డిజైన్‌తో పాటు, ప్రాక్టికల్ ఫీచర్లతో చాలామంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. సోనెట్, సెల్టోస్ మధ్య స్థానం కలిగి ఉన్న ఈ మోడల్, మార్కెట్లో తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించి, మార్చి నెలలో మాత్రమే 5,000కు పైగా కార్లు అమ్ముడుపోవడం దీనికి నిదర్శనం.

అయితే, మార్కెట్లో విజయవంతంగా అమ్ముడుపోతున్న కియా కంపెనీ తన సిరోస్ SUV ధరల్లో మార్పులు చేసింది. తాజాగా V3Cars నివేదించిన దాని ప్రకారం, ఈ SUV కొన్నివేరియంట్ల ధరలు 5.56 శాతం వరకు పెరిగాయి, అంటే కొన్ని మోడళ్లపై రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది అన్ని వేరియంట్లకు వర్తించదు. ఇది కస్టమర్లకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.

Kia Motors Syros Suv

ముఖ్యంగా టాప్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ధర పెంపు అనేక కారణాలు ఉండవచ్చు. ముడిసరుకు ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, లేదా మారుతున్న మార్కెట్ డైనమిక్స్ వంటివి అంశాల కారణంగా కంపెనీ సిరోస్ కొన్ని వేరియంట్ల ధరల్లో పెంపుదల చేసింది. అయితే, మధ్య తరగతి SUV కొనుగోలుదారులకు ఇది ఆలోచించాల్సిన అంశమే. ధరల పెరుగుదల ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే.

ఈ SUV 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన HTK వేరియంట్‌పై రూ. 50,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకప్పుడు రూ. 8,99,900 వద్ద అందుబాటులో ఉన్న బేస్ వేరియంట్, ఇప్పుడు రూ. 9,49,900కి చేరుకుంది. ఇక HTK(0) వేరియంట్ విషయానికి వస్తే, దీని ధర రూ. 30,000 పెరిగి, రూ. 10,29,900కి మారింది, ఇది మొదట రూ. 9,99,900కు లభించేది.

Kia Syros Price Hike

అంతేకాదు, HTK Plus వేరియంట్ ధర కూడా రూ. 11,49,900 నుండి రూ. 11,79,900కు పెరిగింది. ఇది సగటు కొనుగోలుదారుడి ఖర్చుపై మ‌రింత భారం వేసేలా ఉంది. అయితే HTX వేరియంట్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ కారు,1.0-లీటర్ టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్, 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్, 1.5-లీటర్ డీజిల్ TC ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా ఎంపిక చేసుకోవచ్చు.

1.0-లీటర్ టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉన్న వేరియంట్లలో HTK ప్లస్ ధర రూ. 30,000 పెరిగింది. ఒకప్పుడు రూ. 12,79,900 వద్ద లభించిన ఈ వేరియంట్, తాజా ధరల ప్రకారం రూ. 13,09,900కి చేరుకుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక కీలక విషయమే. అయితే, ఈ పెంపు HTX, HTX Plus, HTX Plus (O) వేరియంట్లపై ప్రభావం చూపలేదు.

Kia Syros Details

ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే మాన్యువల్ వేరియంట్లకు వస్తే HTK (O), HTK Plus వేరియంట్లు రెండూ రూ.30,000 పెరిగాయి. HTK (O) వేరియంట్ ధర రూ.10,99,900 నుండి రూ.11,29,900కి చేరగా, HTK Plus ధర రూ.12,49,900 నుండి రూ.12,79,900కి పెరిగింది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ HTX Plus, HTX Plus (O) వేరియంట్లకు మాత్రం ఎలాంటి ధర మార్పులు చేయలేదు.

ప్రస్తుతం, HTX Plus వేరియంట్ ధర రూ. 16,99,900, అలాగే అత్యుత్తమ ఫీచర్లతో అందించే HTX Plus (O) వేరియంట్ ధర రూ. 17,79,900గా కొనసాగుతున్నాయి. ఇది 18.2 కి.మీల నుంచి దాదాపుగా 20.75 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ మోడల్స్ లీటర్ కు 17.65 కి.మీల వరకు మైలేజ్ ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 9, 2025, 17:41 [IST]
English summary
Kia motors syros suv price hiked by up to rs 50000 on selected variants more details
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+