బిజినెస్, ఫ్యామిలీ టూర్స్‌కు ఇదే బెస్ట్! మార్కెట్‌లోకి మరో సంచలన మోడల్.. కియా మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది
భారతదేశంలో ఒకప్పుడు మారుతీ సుజుకీ ఓమ్ని వ్యాన్ అంటే తెలియని వారు ఉండరు. చాలా మందికి ఇది ఎప్పటికీ మర్చిపోలేని వాహనంగా నిలిచిపోతుంది. రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోవడంలో దీనికి ఏది సాటిరాదు. చాలా సినిమాల్లో దీనిని విలన్లు ఎక్కువగా వాడుతుండే వారు. ప్రధానంగా కిడ్నాప్ సన్నివేశాలకు సంబంధించి ఓమ్ని వ్యాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీన్ని ప్యాసింజర్ల రావాణకు మాత్రమే కాకుండా పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే వ్యాన్‌గా, అంబులెన్స్‌గా, సరుకులను ఇతర చోట్లకు తరలించే కార్గో వ్యాన్‌గా ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నటికి చెరిగిపోని ముద్రను వేసింది. ఓమ్ని వ్యాన్ తర్వాత దాని స్థానంలో మార్కెట్లోకి చాలా రకాల వాహనాలు వచ్చినప్పటికి దేశీయ ప్రజల్లో దీనికి వచ్చినటువంటి ఆదరణను ఏ మోడల్ కూడా సంపాదించలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మార్కెట్లోకి ఒక కొత్త వ్యాన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.
అయితే ఓమ్ని వ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి మారుతీ కాకుండా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) ఒక కొత్త వ్యాన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీని పేరు 'PV5'. కంపెనీ స్పెయిన్‌లోని టరాగోనాలో ఈవీ డేను నిర్వహిస్తోంది. అయితే దీనికి ముందుగానే తన కొత్త వ్యాన్ PV5 ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ వ్యాన్‌ను CES 2024లో ప్రదర్శించిన PV5 కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా రూపొందించారు. ఇది బియాండ్ వెహికల్ (PBV) ప్లాట్‌ఫామ్ కింద వస్తున్నటువంటి ఫస్ట్ మోడల్ అవుతుంది. ఈ వ్యాన్ చూడటానికి మారుతీ సుజుకీ ఓమ్నిని పోలి ఉంది. దీని బాడీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. దీనిని అతి త్వరలో ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కియా కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది.
అయితే ఈ వ్యాన్‌ను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందా లేదా అనే దానిపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత కీలకంగా ఉంది. అంతర్జాతీయంగా ఏ మోడల్ లాంచ్ అయిన కూడా వాటిని ఇక్కడి ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి మరి విడుదల చేస్తున్నారు. ఇండియా వాహన పరిశ్రమ సానుకూలంగా ఉండటం కారణంగా కొత్త లాంచ్‌లు చాలా వరకు ఇక్కడ కూడా ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో కియాకు చెందిన PV5 వ్యాన్ ఇండియాలోకి కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికి కంపెనీ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు వేచి ఉండాల్సిందే. ఈ వాహనాన్ని కియా ప్రయాణికుల రవాణాకు అలాగే, సరుకుల రవాణాకు కూడా ఉపయోగించే విధంగా రూపొందించింది. ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త వాహనం కూడా ఇదే విధంగా ఉపయోగించవచ్చు.
రాబోయే కియా ఎలక్ట్రిక్ వెహికల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కియా ఈ కొత్త వాహనం గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకుంది. ప్రయాణికులకు అవసరమయ్యే చాలా ఫీచర్స్ ఈ వ్యాన్‌లో ఉన్నాయి. ఇది ఈవీ కాబట్టి బ్యాటరీతో పాటు శక్తివంతమైన మోటార్‌ను అందించినట్లు తెలుస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








