తగ్గేదేలే! భారత మార్కెట్‌లో దూసుకుపోతున్న కియా.. ఈ కంపెనీ కార్లకు కస్టమర్ల నుంచి ఊహించని డిమాండ్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రసిద్ధ కంపెనీగా అవతరించింది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు బలమైన పోటీగా ఎదిగి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తన కార్లను పరిచయం చేస్తుంది. సెల్టోస్, సోనెట్ లాంటి SUV లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కియా, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన మోడళ్లను లాంచ్ చేస్తుంది. భారత మార్కెట్లో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లు తమదైన ముద్ర వేయడానికి పోటీ పడుతున్నప్పటికీ, కియా మాత్రం ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ను దక్కించుకుంది.

తాజాగా కియా నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, 2025 మార్చిలో 25,525 యూనిట్ల దేశీయ అమ్మకాలతో మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, 19.3 శాతం వృద్ధిని సాధించిందని గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది 2024 మార్చిలో సేల్స్ 21,400 యూనిట్లుగా ఉన్నాయి. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా మొత్తంగా 2,55,207 యూనిట్ల వార్షిక అమ్మకాలను సాధించింది.

Kia Fy 2025 Sales

ప్రత్యర్థులతో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అదిరిపోయే ఫీచర్స్‌తో అధునాతన కార్లను అందించడంలో కియా విజయవంతమవుతోంది. 2025లో మరిన్ని మోడళ్ల విడుదలతో, ఈ బ్రాండ్ మరింత మైలురాళ్లను సాధించే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 2,55,207 కార్లు విక్రయించామని కియా ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 4 శాతం వృద్ధిని సూచిస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2,45,634 యూనిట్ల విక్రయాలను పరిశీలిస్తే, కియా భారత మార్కెట్లో స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని అర్థమవుతోంది. అమ్మకాల పరంగా, కియా సోనెట్ కంపెనీకి ప్రధాన బలం. మొత్తం అమ్మకాలలో ఈ SUV వాటా దాదాపు 30 శాతంగా ఉంది. దీని తర్వాతి స్థానాల్లో 26 శాతం అమ్మకాలతో సెల్టోస్, 22 శాతం అమ్మకాలతో కారెన్స్, 20 శాతం వాటాతో సిట్రోయెన్ నిలిచాయి.

Kia Reported 25525 Unit Sales

టెక్నాలజీ, డిజైన్, భద్రతలో కియా భారతీయ కస్టమర్లను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. ప్రధానంగా కియా అమ్మకాలు పెరగడానికి దోహదపడిన సోనెట్ ఈ స్థాయిలో ప్రజాదరణను సంపాదించడానికి కారణం దాని అందమైన డిజైన్, ఆకర్షణీయమైన ధర, డీజిల్ వేరియంట్‌తో పాటు ఇతర ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో లభించడం. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, కియా జనవరి-మార్చి 2025లో మొత్తం 75,576 కార్లను విక్రయించింది.

అయితే ఇది గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 65,369 యూనిట్లతో పోలిస్తే 15.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. కియా దేశీయంగా మెరుగైన విక్రయాలను సాధించడంతో పాటు అంతర్జాతీయంగా కూడా తన ప్రభావాన్ని చూపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26,892 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇండియాలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సిట్రోయెన్‌ విడుదల తరువాత అమ్మకాలు పుంజుకోవడం మొదలైంది. ఇది తక్కువ ధరకు లభించడంతో మెరుగైన అమ్మకాలను సాధిస్తుంది.

Kia Reported 25525 Unit Sales In March 2025

ఇదే సమయంలో కియా సైరోస్ విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు 15,986 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ మోడల్ కియా లైనప్‌లో సోనెట్, సెల్టోస్ మధ్య ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ కాంపాక్ట్ SUVని HTK, HTK (O), HTK+, HTX, HTX+, HTX+ (O) ఆరు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ధర విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 17.80 లక్షల(ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది.

కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ, కియా భారత మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంటూ, ప్రతి ఏడాది తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. కస్టమర్ల విశ్వాసం, కియా బ్రాండ్‌ను మరింత బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అత్యుత్తమ మోబిలిటీ సొల్యూషన్స్‌ను అందించడంలో మా నిబద్ధత స్పష్టంగా ప్రతిఫలిస్తోందని అని తెలిపారు.

Kia India Sales Report

అంతే కాదు, కియా తన వినియోగదారుల ఇష్టాలను అర్థం చేసుకుని, వారికి సరికొత్త ప్రాధాన్యతలను అందించే దిశగా నిరంతరం అభివృద్ధి చెందుతోందని, అదే తమ బ్రాండ్‌ను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోందని తెలిపారు. టెక్నాలజీ, వినియోగదారుల సంతృప్తిపై దృష్టిసారించడం ద్వారా, కియా ఇండియా ఆటోమోటివ్ మార్కెట్లో తన స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు.

కియా మోటార్స్ నుంచి విడుదలైన సోనేట్ గురించి చూసినట్లయితే, 2020లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2024 సంవత్సరంలో దీని ఫేస్‌లిఫ్ట్ వర్షన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోనెట్ ప్రారంభ ధర విషయానికి వస్తే, రూ. 7.99 లక్షల ఎక్స్ షోరూం ధరలకు అందుబాటులో ఉంటుంది. ఇది మల్టిపుల్ ఇంజిన్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఈ కారు కస్టమర్లకు అవసరాలకు అనుగుణంగా డజన్ల కొద్ది ఫీచర్స్‌ను కలిగి ఉంది.

ఎక్స్‌టీరియర్ ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తుంది. లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఇతర అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంది. కియా సోనెట్ మైలేజ్ లీటర్‌కు 18.2 నుండి 24.1 కిమీ వరకు ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2025, 10:55 [IST]
English summary
Kia reported 25525 unit sales in march 2025 sonet car has best seller this period
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+