మార్కెట్లోకి నయా బాస్ ఎంట్రీ.. 2026లో దున్నేయడం ఖాయం.. కేవలం రూ.25వేలతో బుకింగ్స్ షురూ

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దుమ్మురేపిన కియా సెల్టోస్ (Kia Seltos) సెకండ్ జనరేషన్ మోడల్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు రూ.25,000 టోకెన్ మొత్తంతో నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. మీరు కియా అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

కారు ధరలను జనవరి 2న ప్రకటించిన తర్వాత, జనవరి 2026 మధ్య నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త సెల్టోస్ ఇటీవల లాంచ్ అయిన టాటా సియెర్రా కంటే కూడా పొడవుగా, పెద్దగా ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. కాకపోతే బూట్ స్పేస్ దాని కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

Kia Seltos 2026 Launches with Triple Screen Level 2 ADAS Bookings Open Now

న్యూ-జెన్ సెల్టోస్ డిజైన్, కియా పెద్ద ఎస్‌యూవీ అయిన టెల్యూరైడ్ నుంచి ప్రేరణ పొందింది. ముందు భాగంలో కొత్త టైగర్ నోస్ గ్రిల్, కొత్త ఐస్-క్యూబ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ దీని లుక్‌ను పూర్తిగా మార్చేశాయి. వెనుక వైపున ఉన్న కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఎక్సటర్నల్ ఫీచర్లలో నియాన్ కాలిపర్స్‌తో కూడిన 18-అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ కొత్త మోడల్ 4,460 మి.మీ పొడవు, 1,830 మి.మీ వెడల్పు, 2,690 మి.మీ వీల్‌బేస్‌తో మునుపటి కంటే మరింత పెద్దగా ఉంది. ఇది 10 మోనోక్రోమ్ కలర్స్, రెండు డ్యూయల్-టోన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Kia Seltos 2026 Launches with Triple Screen Level 2 ADAS Bookings Open Now

కొత్త సెల్టోస్ క్యాబిన్ లోపల ప్రధాన ఆకర్షణ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5.0 అంగుళాల హెచ్‌వీఏసీ డిస్‌ప్లే ఉంటాయి. ఇతర లగ్జరీ ఫీచర్లలో 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ కోసం 10-వే పవర్ అడ్జస్టబుల్ సీటు, 64 రంగుల యాంబియంట్ మూడ్ లైటింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి.

సేఫ్టీ పరంగా కియా ఈసారి మరింత మెరుగైంది. సెల్టోస్ స్టాండర్డుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ లెవెల్ 2 ఏడీఏఎస్ (ADAS) సూట్. ఇందులో 21 అటానమస్ డ్రైవింగ్ ఫీచర్లు లభిస్తాయి. అదనంగా కారు చుట్టూ వ్యూ కోసం బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Kia Seltos 2026 Launches with Triple Screen Level 2 ADAS Bookings Open Now

కొత్త సెల్టోస్‌లో పాత ఇంజన్ ఆప్షన్లే కొనసాగుతున్నాయి, కానీ అవి అత్యంత పవర్ఫుల్‌గా ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ 160 బీహెచ్‌పీ పవర్‎తో అత్యంత పవర్ఫుల్ ఆప్షన్. 1.5 లీటర్ డీజిల్ 116 బీహెచ్‌పీ శక్తితో, మంచి మైలేజీని అందిస్తుంది.

1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 115 బీహెచ్‌పీ శక్తితో, సాధారణ డ్రైవింగ్‌కు అనుకూలం. ఈ ఇంజన్లకు 6-స్పీడ్ మాన్యువల్ నుంచి 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆటోమేటిక్ వరకు అనేక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్టీ ఎక్స్-లైన్ వేరియంట్ 2026 రెండవ భాగంలో రానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 11, 2025, 15:30 [IST]
English summary
Kia seltos 2026 launches with triple screen level 2 adas bookings open now
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+