Kia Seltos : హైబ్రిడ్ ఇంజన్‌తో మార్కెట్లో దుమ్ములేపనున్న కియా సెల్టోస్.. రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
కియా సెల్టోస్ దాని స్టైలిష్ లుక్స్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్, పర్ఫామెన్స్ తో భారతీయ కొనుగోలుదారులను ఆకట్టుకుంది. ఇది కియా మోటార్స్ భారతదేశంలో స్థిరపడటానికి సాయపడింది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కియా సెల్టోస్‌లో అప్‌డేట్‌లు, ఫేస్‌లిఫ్ట్‌లు వస్తూ ఉన్నాయి. కియా సెల్టోస్ అనేది కియా మోటార్స్ భారతదేశంలో విడుదల చేసిన ఒక కాంపాక్ట్ SUV. ఇది 2019లో విడుదలైంది..తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది.
భారత మార్కెట్‌లోని పాపులర్ మిడ్-సైజ్ SUV కియా సెల్టోస్ త్వరలో కొత్త అప్‌డేట్‌తో రాబోతుంది. లాంచ్ కాకముందే, కొత్త తరం కియా సెల్టోస్‌ను భారత్‌తో పాటు విదేశీ రహదారులపై పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కొరియన్ కంపెనీ కియా 2026 మొదటి త్రైమాసికంలో నెక్స్ట్-జెన్ సెల్టోస్‌ను విడుదల చేయనుంది. ఈ రాబోయే SUV వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త తరం కియా సెల్టోస్ డిజైన్, ఫీచర్లు: కొత్త తరం కియా సెల్టోస్‌లో సరికొత్త డిజైన్‌ను చూడవచ్చు, ఇది EV9, టెల్లూరైడ్‌తో సహా పెద్ద కియా SUVల నుండి ప్రేరణ పొందింది. దీని క్యాబిన్‌లో కొత్త స్టైల్ డాష్‌బోర్డ్, సరికొత్త ఫ్రంట్ సీట్లు ఉంటాయి.
అలాగే దీని క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ సిల్వర్, గ్రే అప్హోల్స్టరీతో కాంట్రాస్ట్ ఆరెంజ్ ఇన్సర్ట్‌లు, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్రష్డ్ అల్యూమినియం ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, వెనుక ప్రయాణీకుల కోసం హెడ్‌రెస్ట్‌లు, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, డ్యూయల్-టోన్ ORVMలు, ఇంటిగ్రేటెడ్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వెనుక స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ పక్కన USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి.

రాబోయే కియా సెల్టోస్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ ఆటో AC, అన్ని వేరియంట్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సూట్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
కొత్త తరం కియా సెల్టోస్ పవర్‌ట్రెయిన్: కొత్త కియా సెల్టోస్ పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతం ఎక్కువ సమాచారం లేదు, అయితే రాబోయే సెల్టోస్‌లో ప్రస్తుత తరం పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లే కొనసాగే అవకాశం ఉంది.

అయితే, కొరియన్ ఆటోమేకర్ తన రాబోయే SUV కియా సెల్టోస్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ మోటర్‌తో పాటు 1.6 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం, కియా సెల్టోస్ భారతీయ మార్కెట్లో 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది: 1.5 లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.11.13 లక్షల నుంచి ప్రారంభమై రూ.20.51 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
హైబ్రిడ్ ఇంజన్‌తో కొత్త తరం కియా సెల్టోస్‌ను విడుదల చేస్తే, దాని ధర పెరుగుతుంది. ఇది విడుదలైన తర్వాత భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా వంటి తన సెగ్మెంట్‌లోని SUVలతో పోటీపడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








