మార్పు మంచిదే..క్రెటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన కియా..2026లో మార్కెట్ మొత్తం సెల్టోస్ దే
భారతీయ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ (Kia Seltos), ఇప్పుడు పూర్తిగా కొత్త జనరేషన్ (2026 మోడల్) అవతార్‌లో విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ కొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించారు. ఈ కొత్త మోడల్ చూడటానికి చాలా బాగుండటమే కాకుండా అనేక అప్డేటెడ్ లగ్జరీ ఫీచర్లతో నింపేసింది.
ఇది అందుబాటు ధరలోనే వినియోగదారులకు లభించే అవకాశం ఉంది. ఈ కొత్త అప్‌డేట్‌తో కియా తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.

కొత్త కియా సెల్టోస్ కోసం బుకింగ్‌లు రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తిగల వినియోగదారులు రూ.25,000 ముందస్తు చెల్లింపుతో ఆర్డర్ చేయవచ్చు. ధరలను మాత్రం జనవరి 2న అధికారికంగా ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది.
మార్కెట్ అంచనా ప్రకారం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.60 లక్షల వరకు ఉండవచ్చు. ఈ కొత్త సెల్టోస్ మొత్తం 9 వేరియంట్‌లలో లభిస్తుంది: HTE, HTE(O), HTK, HTK(O), HTX, HTX(A), GTX, GTX(A), X-Line. ఇది 5 సీట్లను కలిగి ఉంటుంది. సుదూర ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది. ఎక్కువ లగేజీ కోసం 447 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

కొలతల పరంగా, ఈ కారు మరింత విశాలంగా ఉంది: 4,460 ఎంఎం పొడవు, 1,830 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. వీల్‌బేస్ 2,690 ఎంఎం ఉంది. ఇది 10 సింగిల్-టోన్ రంగులలో, రెండు డ్యూయల్-టోన్ రంగులలో (Glacier White Pearl + Aurora Black Pearl, Magma Red + Aurora Black Pearl) కూడా లభిస్తుంది.

ఈ కారులో శక్తివంతమైన మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి:
1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్: ఇది 115 PS పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ (CVT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: ఇది 160 PS పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అత్యంత పవర్‌ఫుల్ ఆప్షన్. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.
1.5-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 116 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.

కొత్త సెల్టోస్ ఎస్‌యూవీ క్యాబిన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. ఇతర లగ్జరీ ఫీచర్లలో 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-పెన్ పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ట్రాక్షన్ మోడ్‌లు వంటివి ఉన్నాయి.
ప్రయాణికులకు సేఫ్టీ అందించడానికి ఈ కారు అత్యుత్తమ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








