కొరియా పవర్ చూపించేందుకు కియా సిద్ధం..డిసెంబర్ 10 నుంచి ఇక మారుతి, టాటాకు చుక్కలే

భారతీయ కారు మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ భారతదేశంలో 2019లో మొదటగా విడుదల చేసిన కారు ఇదే. అప్పటినుంచీ ఈ సెగ్మెంట్‌లో సెల్టోస్ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కియా సంస్థ సెల్టోస్ యొక్క కొత్త తరం మోడల్ (Next-Generation) తయారీలో చాలా చురుగ్గా ఉంది.

ఈ కొత్త మోడల్ టెస్ట్ డ్రైవ్‌లు పూర్తి చేసుకుని, లాంచ్‌కు సిద్ధమైంది. దీని రాకతో మార్కెట్‌లో మారుతి సుజుకి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల కార్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కియా సెల్టోస్ న్యూ జనరేషన్ మోడల్ (All-New Seltos) ఫస్ట్ టీజర్‌ను కియా ఇండియా ఈ రోజు (డిసెంబర్ 1, 2025) విడుదల చేసింది. ఈ టీజర్ ఈ కారు బోల్డ్ ఎవల్యూషన్ (Bold Evolution)ను స్పష్టంగా చూపుతోంది. ఇది మరింత డైనమిక్‌గా, ప్రీమియం లుక్‌తో సిద్ధమైందని కంపెనీ ప్రకటించింది.

Kia Seltos New Generation Launch Date Revealed Ready to Challenge Maruti and Tata Rivals

ఈ కొత్త లుక్‌తో మిడ్-ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మళ్లీ లీడ్ చేయడానికి సెల్టోస్ సిద్ధంగా ఉందని కియా ధీమా వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన కొత్త సెల్టోస్ వరల్డ్ ప్రీమియర్ డిసెంబర్ 10, 2025 న జరగనుంది. కియా ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో దీని లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు. కియా సెల్టోస్ 2019లో ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశించింది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.19.81 లక్షల వరకు ఉంది. అయితే, అనేక అప్‌డేట్‌లు ఉన్నందున కొత్త తరం మోడల్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.

2019లో విడుదలైనప్పటి నుంచి మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెల్టోస్, ఇప్పుడు పూర్తిగా రీడిజైన్ చేయబడింది. కియా ఆపోజిట్స్ యునైటెడ్ అనే డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా దీనిని రూపొందించారు. కొత్త సెల్టోస్ షార్పర్ లైన్స్, మస్కులర్ స్టాన్స్ తో కూడిన ప్రామాణిక ఎస్‌యూవీ స్టైలింగ్‌ను కలిగి ఉంది.

Kia Seltos New Generation Launch Date Revealed Ready to Challenge Maruti and Tata Rivals

ముందు భాగంలో కొత్త కియా డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, దానితో పాటు సిగ్నేచర్ స్టార్ మ్యాప్ లైటింగ్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుకవైపు కూడా ఇదే లైటింగ్ డిజైన్ ఉండటం వలన కారుకు ఏకరీతిగా, ఫ్యూచరిస్టిక్ ఐడెంటిటీ వచ్చింది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి చిన్న వివరాలు కూడా కారుకు మరింత సొగసును, ప్రాక్టికాలిటీని జోడించాయి.

కొత్త సెల్టోస్‌లో వినియోగదారులకు అనేక రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌తో పాటు, అధిక మైలేజీని అందించే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా కియా అందించే అవకాశం ఉంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో మాన్యువల్, ఐఎమ్‌టి (Intelligent Manual Transmission), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

Kia Seltos New Generation Launch Date Revealed Ready to Challenge Maruti and Tata Rivals

కొత్త తరం సెల్టోస్ డిజైన్, ఫీచర్ల విషయంలో మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ముందు భాగంలో నిలువుగా ఉండే ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు కనిపిస్తాయి. వెనుక భాగంలో కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, రీ-డిజైన్ చేసిన టెయిల్‌గేట్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి.

ప్రస్తుతం ఉన్న మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, 4 చక్రాలలో డిస్క్ బ్రేకులు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త మోడల్‌లో వీటితో పాటు మరిన్ని అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు అదనంగా లభించచే అవకాశం ఉంది.

Kia Seltos New Generation Launch Date Revealed Ready to Challenge Maruti and Tata Rivals

ప్రస్తుత సెల్టోస్ 26.03 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఫీచర్లతో ఉంది. కొత్త మోడల్‌లో వీటిని మరింత అప్‌గ్రేడ్ చేసి మరిన్ని కొత్త ఫీచర్లను జోడిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొత్త తరం కియా సెల్టోస్ రాకతో భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ తారాస్థాయికి చేరుకోనుంది. ఈ కొత్త మోడల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి విక్టోరిస్, టాటా కర్వ్, టాటా సియెరా, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు అమ్మకాల విషయంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సెల్టోస్ పటిష్టమైన ఫీచర్లు, డిజైన్, ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 1, 2025, 12:04 [IST]
English summary
Kia seltos new generation launch date revealed ready to challenge maruti and tata rivals
Read more on: #kia motors #kia seltos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+