టయోటాకు వణుకు మొదలైంది! ఈ కారు వస్తే ఫార్చ్యూనర్‌ను ఎవరైనా కొంటారా?

టయోటా ఫార్చ్యూనర్‌ అంటే భారత ఆటో మార్కెట్లో ఒక బ్రాండ్‌లా మారిపోయింది. పూర్తి-పరిమాణ SUVల్లో దానికి సరైన పోటీదారు ఇప్పటివరకు కనిపించలేదు. ఆ సైజ్‌, ఆ రోడ్ ప్రెజెన్స్‌, ఆ పవర్.. ఈ మూడు కలిసే ఫార్చ్యూనర్‌ను ఇంకా బలంగా నిలబెడతాయి. అయితే, ఈ ఏకపక్ష రాజ్యానికి త్వరలో ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కియా సిద్ధం చేస్తోన్న భారీ SUV సోరెంటో, ఇప్పుడు నిజంగా భారత్‌లోకి అడుగుపెట్టబోతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌బేస్ ఉన్న కియా సోరెంటో (kia Sorento) భారత మార్కెట్లో కూడా విడుదలకానుందనే ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఊహాగానాలగానే ఉన్నా... తాజాగా ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. మొదటిసారి కియా సోరెంటో భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది

ఈ విషయాన్ని ప్రముఖ ఆటో మీడియా హౌస్ MotorOctane వెల్లడించింది. టెస్టింగ్ దశలో కనిపించిన ఈ SUV, సైజ్ పరంగా ఫార్చ్యూనర్‌కు దగ్గరగా ఉంది. పైగా, కియా ప్రత్యేకమైన శార్ప్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు,ఆధునిక టెక్నాలజీ కలిసినప్పుడు ఇది భారత మార్కెట్లో ఒక భారీ వేవ్ సృష్టించే అవకాశం ఉంది. కియా ఇప్పటికే సెల్టోస్, కారెన్స్, సోనెట్ మోడళ్లతో భారత కార్ మార్కెట్లో రుజువు చేసుకున్న బ్రాండ్.

Kia Sorento First Time Spotted Testing On Indian Roads

ఇప్పుడు సోరెంటో రూపంలో ఒక పూర్తి-పరిమాణ SUV తీసుకువస్తే, ఫార్చ్యూనర్ ఆధిపత్యంపై మొదటిసారి నిజమైన సవాలు ఏర్పడనుంది. ఈ టెస్టింగ్ స్పై షాట్స్ బయటపడటంతో, ఆటో ప్రేమికులలో కూడా భారీ ఆసక్తి పెరిగింది. ఫార్చ్యూనర్‌కు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న పలువురు కొనుగోలు దారులు ఇప్పటికే దీనిపై దృష్టిసారించారు. ఫీచర్ల పరంగా, డిజైన్ పరంగా, సేఫ్టీ పరంగా కియా ఎలాంటి బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తుందో అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

కియా సోరెంటో అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఒక మెచ్యూర్‌, ఫీచర్-రిచ్, పవర్-ప్యాక్డ్ SUVగా తనదైన గుర్తింపును సంపాదించుకుంది. అక్కడ ఇది మూడు రకాల ఇంజిన్ ఎంపికలతో 1.6 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్, 2.5 లీటర్ నేచురల్ పెట్రోల్, మరింత శక్తివంతమైన 2.5 లీటర్ టర్బో పెట్రోల్‌లో అందుబాటులో ఉంది . అయితే ఇవన్నీ భారత మార్కెట్లో కూడా వస్తాయా? ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

Kia Sorento First Time Spotted Testing On Indian Roads

భారత మార్కెట్ ప్రాధాన్యతలు, ఇంధన విధానాలు, అలాగే పన్నుల నిర్మాణం దృష్ట్యా కియా కొంతమేరకు వేరే కాంబినేషన్‌ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నదనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఇంజిన్ ఎంపికలలో అనిశ్చితి ఉన్నా... ఫీచర్ల విషయానికి వస్తే మాత్రం సోరెంటో భారత వినియోగదారులను ఆకట్టుకునే విధంగా పూర్తి పరిధిలో వస్తుందనే నమ్మకం ఉంది. ఈ కారులో పెద్దదైన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు.

అలాగే, అదే పరిమాణంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇప్పటికే అంతర్జాతీయ మోడల్‌లో భాగంగా ఉన్నాయి, ఇవే ఫీచర్లు భారత వెర్షన్‌లో కూడా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా, Level 2 ADAS ఉండే అవకాశం ఉందని ఆటో వర్గాలు చెబుతున్నాయి. సేఫ్టీ పరంగా బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.

Kia Sorento First Time Spotted Testing On Indian Roads

భారత మార్కెట్లో వినియోగదారులు ఇష్టపడే కీలక అంశాలను కూడా కియా ఖచ్చితంగా చేరుస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వెంట్‌లేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్.. ఇవన్నీ ప్రస్తుతం భారత SUV కొనుగోలు దారుల అత్యంత ప్రాధాన్య ఫీచర్లు. కియా ఇవన్నింటినీ సోరెంటోలో ఇవ్వడం ద్వారా ఈ మోడల్‌ను నిజమైన ప్రీమియం లక్షణాలతో కూడిన ఫుల్-సైజ్ SUVగా మలచే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 20, 2025, 18:32 [IST]
English summary
Kia sorento first time spotted testing on indian roads ahead of possible launch
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+