కియా కొత్త కారును ధైర్యంగా కొనేయండి.. తక్కువ ధరతో సేఫ్టీలో 5 స్టార్‎తో టాటాకే సవాల్ విసురుతోంది

ప్రస్తుతం భారతదేశ కార్ మార్కెట్‌లో వినియోగాదారులు సేఫ్టీకి పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. కియా మోటార్స్ తన పాపులర్ SUV 'సైరస్' ఇప్పుడు సేఫ్టీ విషయంలో టాటాలకే సవాల్ విసురుతోంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది. అతితక్కువ ధరతో లభిస్తున్న ఈ సురక్షితమైన SUV గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కియా మోటార్స్ (Kia Motors) విక్రయిస్తున్న 'సైరస్' SUV భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ఈ మార్చి నెలలో ఏకంగా 5,425 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అందుబాటు ధరలో లభించడంతో పాటు మంచి ఫీచర్లను కలిగి ఉంది. తాజాగా, దేశీయ వాహనాలకు సేఫ్టీ టెస్టులు నిర్వహించే సంస్థ భారత్ NCAP (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో కియా సైరస్ బెస్ట్ సేఫ్టీ కారుగా నిరూపితమైంది.

Kia Syros

భారత్ NCAP నిర్వహించిన సేఫ్టీ టెస్టుల్లో కొత్త కియా సైరస్ SUV పెద్దల రక్షణ (Adult Occupant Protection) విభాగంలో 32కి 30.21 పాయింట్లు సాధించింది. అలాగే పిల్లల రక్షణ (Child Occupant Protection) విభాగంలో 49కి 44.42 పాయింట్లు పొందింది. ఈ అద్భుతమైన స్కోర్‌తో కియా సైరస్ ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దీంతోపాటు, కియా సైరస్ కారును ముందువైపు నుంచి నేరుగా ఒక అడ్డంకిని ఢీకొట్టి పరీక్షించారు. ఈ ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో అది 16కి 14.21 పాయింట్లు సాధించింది. అదేవిధంగా, కారు రెండు వైపులా కూడా అడ్డంకిని ఢీకొట్టించి సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ టెస్టులో సైరస్ 16కి 16 పాయింట్లు సాధించడం విశేషం.

Kia Syros Bharat NCAP

కియా సైరస్ SUV ప్రయాణికుల సేఫ్టీ కోసం అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), HSA (హిల్ స్టార్ట్ అసిస్ట్), VSM (వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్), ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు మరియు 360-డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో కియా సైరస్ కారు రూ. 8.99 లక్షల నుంచి డి రూ. 17.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇది HTK, HTK (O), HTK Plus, HTX, HTX Plus వంటి వివిధ వేరియంట్‌లలో లభిస్తుంది. స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్ వంటి అనేక ఆకర్షణీయమైన రంగుల్లో కూడా ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

Kia Syros Bharat NCAP

ఈ కారు 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 17.65 నుండి 20.75 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. కొత్త సైరస్ SUV 3995 mm పొడవు, 1,800 mm వెడల్పు, 1,665 mm ఎత్తును కలిగి ఉంది.

కియా సైరస్ కారులో 5 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవచ్చు. ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి వీలుగా 465 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా ఈ కారు కలిగి ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్స్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్లు ఈ కారు సొంతం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 12, 2025, 7:00 [IST]
English summary
Kia syros achieves 5 star safety rating challenges tata in safety
Read more on: #kia motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+