లాంచ్ అయిన 6 నెలల్లోనే ఈ కార్లను జనాలు విపరీతంగా కొంటున్నారు.. వీటికి ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏంటి?

మార్కెట్లో అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా(skoda)కు చెందిన కైలాక్ (Kylaq), దక్షిణ కొరియా బ్రాండ్ కియా(Kia) సైరోస్ (syros) SUVలు చాలా తక్కువ కాలంలోనే వినియోగదారుల మనసు దోచుకున్నాయి. లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే ఈ రెండు కాంపాక్ట్ SUVలు మార్కెట్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్నాయి. డిజైన్, పనితీరు, ఫీచర్లు.. అన్నింటిలోనూ వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ జోష్ మే నెలలో కూడా కొనసాగింది. స్కోడా కైలోక్ SUV, గత నెలలో మాత్రమే దేశవ్యాప్తంగా 4,949 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కేవలం ఓ గణాంకం కాదు, స్కోడా కోసం ఇది మంచి వృద్ధికి సంకేతం. వాస్తవానికి, కైలోక్ ప్రారంభమైనప్పటి నుంచి నెలనెలకూ దాని విక్రయాల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది.

ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కైలాక్‌కు మంచి డిమాండ్ నెలకొంది. ఏప్రిల్‌లో 5,364 యూనిట్లు, మార్చిలో 5,327 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో 3,636 యూనిట్లు, జనవరిలో 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలే కైలాక్‌ ఎలాంటి స్థాయిలో మార్కెట్లో తన స్థానాన్ని పెంచుకుంటోందో చాటి చెబుతున్నాయి. స్కోడా బ్రాండ్ నమ్మకంతో పాటు, కైలాక్ మోడల్‌ ప్రత్యేకతలు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Skoda Kylaq Suv

డిసెంబర్ 2024లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన స్కోడా కైలాక్‌ను చూస్తేనే క్లాస్ అండ్ క్వాలిటీతో అట్రాక్ట్ చేస్తుంది. శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో కైలాక్‌ వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ SUV ధర రూ. 8.25 లక్షల నుంచి మొదలవుతూ, టాప్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 5-సీటర్ల కాంపాక్ట్ SUV అయిన కైలాక్‌, ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

ఈ కారు వీకెండ్స్ ట్రిప్స్‌ కూడా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. దీనిలో 446 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను అందిస్తుంది, ఇది తరచుగా లాంగ్ జర్నీల్లో సహాయపడుతుంది. ఇంజిన్ విషయంలో, స్కోడా కైలాక్‌కి శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని కలిగించే ఈంజిన్ కాగా, 15 నుండి 18 కిలోమీటర్ల మధ్య మైలేజీని అందించగల సామర్థ్యం కలిగి ఉంది.

Skoda Kylaq Suv May sales

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది టెక్నాలజీ ప్రేమికులను ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుంది. 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లతో ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. భద్రతపరంగా చూస్తే కూడా స్కోడా ఏమాత్రం రాజీ పడలేదు. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టిపుల్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు వంటి భద్రతాపరమైన అంశాలు ఉన్నాయి.

కియా సైరోస్ SUV గురించి చూసినట్లయితే 2025 మే నెలలో ఈ SUV మొత్తంగా 3,611 యూనిట్లను విక్రయించింది. ఇది ఒక స్థిరమైన డిమాండ్‌ను సూచించింది. ఏప్రిల్‌లో 4,000 యూనిట్లు, మార్చిలో 5,015 యూనిట్లు, ఫిబ్రవరిలో 5,425 యూనిట్లు, జనవరిలో 5,546 యూనిట్ల అమ్మకాలను ఇది నమోదు చేసింది. ధర విషయానికొస్తే, కియా సైరోస్ SUVను రూ.9.50 లక్షల నుండి రూ.17.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయవచ్చు.

Kia Syros May Sales

ఒక 5 సీట్ల కాంపాక్ట్ SUV కావడం వల్ల కుటుంబ ప్రయాణాలకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇంజిన్ పరంగా ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ ఇది 17 నుండి 21 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇం‌టీరియర్ ఫీచర్లలో డ్యూయల్ స్క్రీన్, 8-స్పీకర్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 11, 2025, 15:40 [IST]
English summary
Kia syros and skoda kylaq suvs may 2025 sales report detials inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+