కియా కొత్త కారు కోసం జనాల బారులు.. అందరూ పెట్రోల్‌ మోడళ్లకే జై కొడుతున్నారు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఇండియాలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇక్కడి లోకల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏడాది భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ సేల్స్‌ను రెట్టింపు చేసుకుంటూ తన మార్కెట్‌ను బాగా విస్తరించుకుంటుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ సెల్టోస్‌, సోనెట్ వంటి ఇతర మోడళ్లను విక్రయిస్తుంది. ఇతర కంపెనీలకు పోటీగా కొత్త కొత్త కార్లను తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇదే క్రమంలో కియా డిసెంబర్ 19వ తేదీన 'సైరోస్ ఎస్‌యూవీ (Syros SUV)ని ఆవిష్కరించింది. అదిరిపోయే ఫీచర్స్, సరికొత్త రూపంతో లాంచ్ అయిన ఈ కారు బుకింగ్స్‌లను కూడా కంపెనీ ప్రారంభించింది.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, కియా సైరోస్ ఎస్‌యూవీకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. డేటా ప్రకారం, ఇది రికార్డు స్థాయిలో 10,000 బుకింగ్స్‌ను సాధించింది. 2025 కొత్త ఏడాదిలో ఈ గణాంకాలను చూసి కియా ఇండియా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kia Syros Suv Bookings

కొత్త కియా సైరోస్ ఎస్‌యూవీ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో ఎక్కువగా 60 శాతం కంటే ఎక్కువ మంది పెట్రోల్‌తో రన్ అయ్యే మోడళ్లను బుకింగ్ చేసుకున్నారు. ఆ తరువాత మిగిలిన వారు డీజిల్ మోడళ్లను ఎంచుకున్నారు. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రూ. 9 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుందని అంచనా. దీని ధరను ఫిబ్రవరి 1 న వెల్లడించనుంది.

జనవరి 17 నుండి ఈ కారుకు సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది రెండు పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 1-లీటర్ టర్బో పెట్రోల్ , 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ జత చేయబడి ఉన్నాయి. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది.

Kia Syros Suv Petrol Model

లోపల అధునాతన ఫీచర్స్‌ను కారులో అందించారు. యాంబియంట్ లైటింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ స్క్రీన్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రయాణికుల భద్రతకు సంబంధించి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) , ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటి పలు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్‌ ఫ్లష్-టైప్ మాదిరిగా ఉంటాయి. కియా సైరస్ కారు మార్కెట్లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ వంటి కార్లకు ఇది ప్రధాన పోటీదారుగా ఉంటుంది. ఎస్‌యూవీ అమ్మకాల్లో ఇది కియా కంపెనీకి చాలా కీలకం కానుంది.

Kia Syros Suv Petrol Cabin

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2025, 17:15 [IST]
English summary
Kia syros suv petrol model getting huge number of bookings check all details
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+